• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • SMARTPHONE SALES WORLDWIDE DECLINED BY 12 5 PERCENT IN 2020 BECAUSE OF COVID 19 EFFECT NS GH

Smartphone sales: 2020లో క్షీణించిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు.. ఏ బ్రాండ్​ అమ్మకాలు ఎంత మేర తగ్గాయంటే..

Smartphone sales: 2020లో క్షీణించిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు.. ఏ బ్రాండ్​ అమ్మకాలు ఎంత మేర తగ్గాయంటే..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా ప్రభావం దాదాపు అన్ని రంగాలపై పడింది. ఫలితంగా లక్షలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. కొనుగోలు శక్తి తగ్గడంతో ప్రజలు ఆచితూచి ఖర్చు పెడుతున్నారు. అత్యవసరమైతే తప్ప వస్తువుల కొనుగోలుకు మొగ్గుచూపడం లేదు. అయితే..

  • Share this:
కరోనా ప్రభావం దాదాపు అన్ని రంగాలపై పడింది. ఫలితంగా లక్షలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. కొనుగోలు శక్తి తగ్గడంతో ప్రజలు ఆచితూచి ఖర్చు పెడుతున్నారు. అత్యవసరమైతే తప్ప వస్తువుల కొనుగోలుకు మొగ్గుచూపడం లేదు. అయితే.. ఈ ప్రభావం 2020లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలపై కూడా పడింది. కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా 12.5% మేర స్మార్ట్​ఫోన్​ అమ్మకాలు క్షీణించాయని మార్కెట్ పరిశోధన సంస్థ గార్ట్‌నర్ తన నివేదికలో పేర్కొంది. అయితే, 2020 నాలుగో త్రైమాసికంలో మార్కెట్​లోకి 5జీ ఫోన్లు విడుదల కావడంతో కొంత మేర అమ్మకాలు పుంజుకున్నప్పటికీ 2019తో పోలిస్తే గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 5.4% మేర క్షీణించిందని కంపెనీ తెలిపింది. కాగా, నాలుగో త్రైమాసికంలో ఆపిల్ ఐఫోన్ల అమ్మకాలు భారీగా జరిగాయి.​ 2020 మొత్తం గ్లోబల్​ మార్కెట్​లో ఆపిల్​ 20.8% వాటాను దక్కించుకుంది. తద్వారా కరోనా టైంలోనూ అత్యధిక అమ్మకాలు జరిపిన బ్రాండ్​గా ఆపిల్ అగ్రస్థానంలో నిలిచింది. మునుపటి సంవత్సరం కంటే ఇది 3% పైగా వృద్ధి కూడా నమోదు చేసింది.

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్​ దిగ్గజం శామ్ సంగ్ 16.2% మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది. 2019 అమ్మకాలతో పోలిస్తే 1% మేర దీని అమ్మకాలు తగ్గాయి. చైనాకు చెందిన ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల తయారీ సంస్థలు షియోమి, ఒప్పో, హువావే వరుసగా తరువాతి మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ఇవి 2020 గ్లోబల్​ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో 11.3%, 8.9%, 8.9% వాటా దక్కించుకున్నాయి.

అమ్మకాల పరంగా అగ్రస్థానంలో నిలిచిన ఆపిల్​..దీనిపై గార్ట్‌నర్ సీనియర్ రీసెర్చ్ డైరెక్టర్ అన్షుల్ గుప్తా మాట్లాడుతూ ‘‘2020 నాలుగో త్రైమాసికంలో 5జి స్మార్ట్‌ఫోన్‌లు, లోయర్ -టు -మిడ్-టైర్ స్మార్ట్‌ఫోన్ల రాకతో గ్లోబల్​ మార్కెట్​లో అమ్మకాల క్షీణత కొంతమేత తగ్గింది. కరోనా కారణంగా ప్రజలు తమ ఖర్చులతో జాగ్రత్తగా వ్యవహరించారు. అయినప్పటికీ, మార్కెట్​లోకి కొత్తగా విడుదలైన 5 జి స్మార్ట్‌ఫోన్‌లు, ప్రో-కెమెరా ఫీచర్లు కొంతమంది వినియోగదారులను ఆకట్టుకున్నాయి.

తద్వారా వీటిని కొనుగోలు చేయడానికి లేదా వారి ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి ఆసక్తి కనబర్చారు. తద్వారా, నాలుగో త్రైమాసికంలో స్మార్ట్​ఫోన్​ అమ్మకాలు పుంజుకున్నాయి.” అని ఆయన అన్నారు. గ్లోబల్​ స్మార్ట్​ఫోన్ల అమ్మకాల్లో క్షీణత భారతదేశాన్ని కూడా ప్రభావితం చేసింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడిసి) ప్రకారం, 2020లో కరోనా కారణంగా భారత్​లో మొబైల్​ ఎగుమతులు 2% మేర తగ్గాయని తెలిపింది. 2009 తరువాత భారత్​లో మొబైల్ అమ్మకాలు తగ్గడం ఇదే మొదటిసారి.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు