హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Mobile Offer: మెగా డిస్కౌంట్ ఆఫర్.. ఈ ఫోన్‌‌పై రూ.20 వేల భారీ తగ్గింపు!

Mobile Offer: మెగా డిస్కౌంట్ ఆఫర్.. ఈ ఫోన్‌‌పై రూ.20 వేల భారీ తగ్గింపు!

Oppo Reno

Oppo Reno

Amazon Sale | ఏకంగా రూ. 20 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? ఒప్పొ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ ఫోన్ కొనాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Flipkart Offer | కొత్తగా ఫోన్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. దిగ్గజ ఈకామర్స్ సంస్థలైన అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) కాకుండా వేరే ప్లాట్‌ఫామ్‌పై ఈ సూపర్ డీల్ లభిస్తోంది. ఒప్పొ ఫోన్లపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. కొత్తగా ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ ఆఫర్‌ను ఒకసారి పరిశీలించొచ్చు. ఫోన్‌లో కూడా ఫీచర్లు అదిరిపోయాయి. ఆఫర్ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

  ఒప్పొ రెనో సిరీస్ ఫోన్‌లో పవర్‌ఫుల్ ఫీచర్లు ఉన్నాయి. గ్రేట్ కెమెరా పనితీరు వీటి సొంతం. మీరు కూడా ఈ ప్రీమియం ఫోన్లలో ఒకదాన్ని కొనుగోలు చేయాలని భావిస్తే.. అది కూడా మీ బడ్జెట్ రూ. 30 వేల లోపు అయితే మీకోసం ఒక డీల్ అందుబాటులో ఉంది. ఒప్పొ రెనో 7 ప్రో ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. 12 జీబీ ర్యామ్ వేరియంట్‌ ఇప్పుడు కేవలం రూ. 27,499కే అందుబాటులో ఉంది. మీరు దీని కోసం ఏ సేల్ కోసం వేచి చూడాల్సిన పని లేదు.

  ఆ భయాలతో కుప్పకూలిన బంగారం ధర.. 2 ఏళ్ల కనిష్టానికి పతనం.. ఇప్పుడు కొనొచ్చా?

  కస్టమర్లు ఈ ఫోన్‌ను క్రోమా స్టోర్ నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ లిస్టెడ్ ధర రూ. 47,999గా ఉంది. అయితే ఇది గత ఏడాది రూ. 39,999తో మార్కెట్‌లోకి వచ్చింది. ఈ ఫోన్‌లో ఆర్బిట్ బ్రీథింగ్ లైట్ ఫీచర్ ఉంది. అందుకే ఈ ఫోన్ ఇతర ఫోన్లకు భిన్నంగా ఉంటుంది. నోటిఫికేషన్స్ వస్తే లైట్ వెలుగుతుంది.

  బంగారంతో కాసుల వర్షం.. కొన్న వారి పంట పండింది

  12 జీబీ ర్యామ్, 256 జీబీ మొమరీ వేరియంట్ ధర రూ. 30,999గా ఉంది. క్రోమా ఆన్‌లైన్‌ స్టోర్‌లో దీన్ని కొనుగోలు చేయొచ్చు. అలాగే ఈ ఫోన్‌పై అదనంగా రూ. 1500 తగ్గింపు ఉంది. ఇంకా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడితే రూ. 2 వేల అదనపు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అన్ని ఆఫర్లను కలుపుకుంటే ఈ ఫోన్‌ను రూ. 27,499కే కొనుగోలు చేయొచ్చు.

  ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమొలెడ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ, మీడియా టెక్ డెమెన్‌సిటీ 1200 మ్యాక్స్ చిప్‌సెట్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ ఫోన్‌లో 50 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: 5G Smartphone, Amazon Great Indian Festival Sale, Flipkart Big Billion Days, Latest offers, Smartphone

  ఉత్తమ కథలు