Phone Offer | స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి తీపికబురు. అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. భారీ డిస్కౌంట్ అందుబాటులో లభిస్తోంది. వివిధ రకాల డిస్కౌంట్ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. 5జీ కొత్త ఫోన్ (Smartphone) కొనాలని చూసే వారు ఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే. ఆఫర్ (Offer) పరిమిత కాలం వరకే అందుబాటులో ఉండొచ్చు. అందువల్ల కొత్త ఫోన్ కొనాలని చూసే వారు ఈ డీల్ పరిశీలించొచ్చు.
దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఎంఆర్‌పీ రూ. 28,998గా ఉంది. అయితే ఈ ఫోన్‌పై భారీ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఏకంగా రూ. 27 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. అంటే మీరు కేవలం రూ. 1998కే స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
బంగారం రూ.1,000 పతనం.. వెండి రూ.5 వేలు ఢమాల్.. లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్లు ఇలా
అయితే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది ఫోన్ ప్రాతిపదికన మారుతూ ఉంటుంది. అందువల్ల కొన్ని ఫోన్లకు తక్కువ ఎక్స్చేంజ్ విలువ కూడా రావొచ్చు. అప్పుడు చేతి నుంచి ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది. అందువల్ల కొత్త ఫోన్ కొనడానికి ముందే మీ ఫోన్‌కు ఎంత ఎక్స్చేంజ్ విలువ ఉందో చెక్ చేసుకోండి. తర్వాత కొనాలా? వద్దా? అనే నిర్ణయానికి రండి.
ఆధార్ కార్డుదారులకు ఉచిత ఆఫర్.. రూ.1 కట్టక్కర్లేదు, కొన్ని రోజులే ఛాన్స్!
అలాగే మీరు ఈ వన్‌ప్లస్ నార్డ్ టీ2 స్మార్ట్‌ఫోన్‌ను మీరు తక్కువ ఈఎంఐతో కూడా కొనొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 1385 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 1795 పడుతుంది. ఇంకా ఏడాది టెన్యూర్ అయితే నెలకు రూ. 2600 చెల్లించాల్సి వస్తుంది. అలాగే 9 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 3400 కట్టాల్సి వస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. ఆరు నెలల టెన్యూర్ వరకు ఇది వర్తిస్తుంది. నెలకు రూ. 4833 కట్టాలి. అదే 3 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 9,666 పడుతుంది. అంటే సున్నా వడ్డీతో ఆరు నెలల టెన్యూర్‌తో కొనొచ్చు. క్రెడిట్ కార్డు ప్రాతిపదికన కూడా ఈఎంఐ మొత్తంలో కొంత మేర మార్పు ఉండొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g phones, 5G Smartphone, Amazon offers, Amazon sale, Latest offers, Mobile offers, Smartphone