హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphone Market: ఇండియన్‌ మార్కెట్‌లో టాప్‌ ప్లేస్‌కి వచ్చిన శామ్‌సంగ్‌.. 2, 3 స్థానాల్లో ఉన్నవి ఇవే?

Smartphone Market: ఇండియన్‌ మార్కెట్‌లో టాప్‌ ప్లేస్‌కి వచ్చిన శామ్‌సంగ్‌.. 2, 3 స్థానాల్లో ఉన్నవి ఇవే?

కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న షియోమీ, ఇప్పుడు తన స్థానాన్ని కోల్పోయింది. షియోమీ స్థానాన్ని దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ చాలాకాలం తరువాత కైవసం చేసుకుంది.

కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న షియోమీ, ఇప్పుడు తన స్థానాన్ని కోల్పోయింది. షియోమీ స్థానాన్ని దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ చాలాకాలం తరువాత కైవసం చేసుకుంది.

కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న షియోమీ, ఇప్పుడు తన స్థానాన్ని కోల్పోయింది. షియోమీ స్థానాన్ని దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ చాలాకాలం తరువాత కైవసం చేసుకుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ఇండియాలో స్మార్ట్‌ఫోన్(Smartphone) వినియోగించే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ నిత్యావసర వస్తువుగా మారడంతో భారత్ ప్రధాన మార్కెట్‌గా అవతరించింది. కస్టమర్లను ఆకర్షించడం కోసం కంపెనీలు అద్భుతమైన ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెడుతున్నాయి. తాజాగా ఇండియన్‌ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై(Indian Smartphone Market) ఓ రిపోర్ట్‌లో(Report) ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మూడో స్థానానికి షియోమీ

గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న షియోమీ, ఇప్పుడు తన స్థానాన్ని కోల్పోయింది. షియోమీ స్థానాన్ని దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ చాలాకాలం తరువాత కైవసం చేసుకుంది. ఆశ్చర్యకరంగా వివో రెండో స్థానంలోకి వచ్చింది.

Central Government Jobs: 11,409 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు .. తెలుగులో పరీక్ష..

* 20 త్రైమాసికాల తరువాత అగ్రస్థానం

Canalys న్యూ డేటా ప్రకారం.. 2017 మూడో త్రైమాసికం తరువాత 2022 నాలుగో త్రైమాసికంలో శామ్‌సంగ్ ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో తిరిగి అగ్రస్థానికి చేరుకుంది. కంపెనీకి అత్యంత ముఖ్యమైన దేశాల్లో ఒకటైన భారత్‌లో చాలాకాలం తరువాత శామ్‌సంగ్ తిరిగి లీడర్‌షిప్ స్థానాన్ని పొందడం గమనార్హం. చైనీస్ బ్రాండ్ షియోమీ 20 త్రైమాసికాల తరువాత 2022 Q4లో టాప్ ప్లేస్‌ను చేజార్చుకుంది. 5.5 మిలియన్ యూనిట్ల షిప్‌మెంట్‌లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. షియోమీ మూడో స్థానానికి పడిపోవడం, మరోపక్క గత కొన్ని త్రైమాసికాల్లో సవాలుగా మారిన మార్కెట్ పరిస్థితులను అధిగమించడానికి, సద్వినియోగం చేసుకోవడానికి Vivoకు అవకాశాలు వచ్చాయి. అయితే ఓవరాల్‌గా 2022లో షియోమీ నంబర్ వన్ వెండర్‌గా నిలిచిందని రిపోర్ట్ పేర్కొంది.

* శామ్‌సంగ్ vs షియోమీ

శామ్‌సంగ్ తన ప్రొడక్టుల లైనప్‌ విస్తరించింది. ముఖ్యంగా బడ్జెట్, మిడ్ రేంజ్ డివైజ్‌లతో తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేసింది. సరసమైన ధరలకు స్మార్ట్‌ఫోన్లను తీసుకురావడంతో శామ్‌సంగ్‌కు బాగా కలిసొచ్చింది. మరోపక్క షియోమీ 2022 పండుగ సీజన్ అమ్మకాల సమయంలో తన పాత స్టాక్‌ను క్లియర్ చేయడంలో సమస్యలను ఎదుర్కొంది. దీంతో కంపెనీ తన కొత్త లాంచ్‌లను పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మార్కెట్ లీడింగ్‌ను కోల్పోయింది.

ఆఫ్‌లైన్ మార్కెట్‌పై ఫోకస్

మరో చైనీస్ బ్రాండ్ వివో.. టైర్-త్రీ, ఫోర్ నగరాల్లో‌ని ఆఫ్‌లైన్ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టిసారించడంతో అది కంపెనీ గ్రోత్‌కు ఫ్లస్ అయింది. ఎందుకంటే ప్రస్తుత ఎరాలోనూ ఫోన్ కొనుగోలు చేయడానికి టచ్ అండ్ ఫీల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇప్పటికీ కష్టమర్లు ఇష్టపడుతున్నారు. విస్తృతమైన రిటైల్ నెట్‌వర్క్, విస్తృత శ్రేణి ఉత్పత్తులతో పాటు డ్యుయల్-రిటైల్ అప్రోచ్ అనేది గత త్రైమాసికంలో శామ్‌సంగ్‌కు బాగా కలిసొచ్చింది. షియోమీ ఇప్పటికే 2023ను గ్రాండ్‌గా ప్రారంభించింది. ఇటీవల రెడ్ మీ నోట్ 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టనుంది. మరి, ఈ చర్యల కారణంగా వచ్చే త్రైమాసికాల్లో తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందో లేదో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

First published:

Tags: Latest Technology, Samsung, Technology

ఉత్తమ కథలు