హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

New Technology: కొత్త టెక్నాలజీ.. మానవ మూత్రంతో స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్..

New Technology: కొత్త టెక్నాలజీ.. మానవ మూత్రంతో స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్(Smart Phone) కలిగి ఉన్నారు. చదువుకున్న ప్రతీ ఒక్కరూ మొబైల్(Mobile) వాడటంతో పాటు.. ఇంటర్నెట్ ను కూడా.. తెగ వాడేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్(Smart Phone) కలిగి ఉన్నారు. చదువుకున్న ప్రతీ ఒక్కరూ మొబైల్(Mobile) వాడటంతో పాటు.. ఇంటర్నెట్ ను కూడా.. తెగ వాడేస్తున్నారు. అయితే ప్రతీ మొబైల్ వచ్చే సమస్య.. బ్యాటరీ. కొన్ని మొబైల్ ఫోన్లలో ఫుల్ ఛార్జ్ పెట్టినా.. వెంటనే గంటలో అయిపోతుంటుంది. మళ్లీ తర్వాత ఛార్జ్ చేయడానికి పట్టే సమయం అంతా ఇంతా కాదు. ఒక్కోసారి ఆ ఫోన్ వాడే వాళ్లకు విసుగు కూడా అనిపిస్తుంటుంది. మొబైల్ వాడిని తర్వాత.. బ్యాటరీ అయిపోతే.. ఇంటి దగ్గర మళ్లీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అదే ఎక్కడికైనా దూరంగా వెళ్లినప్పుడు ఇలాంటి సమస్య ఎదురైతే.. ఫోన్ స్విఛాఫ్(Switch Off) కావాల్సిందే. కొంత మంది దీని కోసం .. పవర్ బ్యాంక్(Power Bank) ను వెంట తీసుకెళ్లడం చూస్తుంటాం.. దానిలో కూడా పవర్ అయిపోతే పరిస్థితి ఏంటి..? ఆ సమయంలో ముఖ్యమైన కాల్స్ చేయాల్సి వస్తే..అప్పుడు తెలుస్తుంది ఎంత ఖరీదైన మొబైల్ మన వద్ద ఉందని ముఖ్యం కాదు.. ఛార్జింగ్ ఆదా చేసుకోవడం అనేది ముఖ్యమని.

అయితే ఆ సమయంలో కూడా మీరు మొబైల్ కు ఛార్జింగ్ పెట్టుకునే విధానం ఒకటి వచ్చింది. అదే మూత్రం ద్వారా మొబైల్ ఛార్జింగ్. అవును మీరు వింటున్నది నిజమే.. శరీరం నుంచి బయటకు వచ్చే మూత్రం నుంచి కూడా మొబైల్‌కి ఛార్జింగ్‌ పెట్టడం సాధ్యమవుతుంది. దీనిని మీరు నమ్మలేక పోతున్నారా..? ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది. శరీరం నుండి బయటకు వచ్చే మూత్రం నుండి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పుడు ఈ శక్తితో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌ను ఛార్జ్ చేయడం సాధ్యమవుతుంది.

SSC Key Announcement: అభ్యర్థులకు అలర్ట్.. ఆ పరీక్షను రద్దు చేసిన SSC..

మూత్రాన్ని విద్యుత్తుగా మార్చడం ఎలా..?

శరీర మూత్రాన్ని విద్యుత్తుగా మార్చడానికి ప్రస్తుతం UKలో ప్రయోగాత్మకంగా నిరూపించే పనిలో పడ్డారు శాస్తవ్రేత్తలు. అయితే ఇందులో శాస్తవ్రేత్తలు పెద్దఎత్తున విజయం సాధించారన్నారు. మానవ మూత్రం పునరుత్పాదక వనరు అయినందున మూత్రం నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో విజయం సాధించడం భవిష్యత్తుకు పెద్ద విషయమనే చెప్పాలి.

మూత్రం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో మొబైల్‌కి ఛార్జ్‌ అవుతుందా?

నివేదికల ప్రకారం.. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఒక చిన్న మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి తగినంత విద్యుత్తును మూత్రం ద్వారా ఉత్పత్తి చేశారు. ఈ విధంగా విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు 'మైక్రోబయల్ ఫ్యూయల్ సెల్స్'ను ఉపయోగిస్తున్నారు. ఇది ఎనర్జీ కన్వర్టర్. కొన్ని వైరస్‌లు కూడా మూత్రంతో కలిపి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని, మూత్రంతో తయారు చేసిన విద్యుత్తు ఉచితంగా లభిస్తుందని బ్రిస్టల్ రోబోటిక్స్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు కూడా తెలిపారు. ఈ సాంకేతికత (టెక్నాలజీ) విజయవంతమైతే.. దీనిని బాత్రూంలో కూడా ఉపయోగించవచ్చు. ఇది షవర్లు, లైటింగ్, రేజర్లు మరియు స్మార్ట్‌హోమ్‌లను ఛార్జ్ చేయడానికి తగినంత విద్యుత్‌ను సులభంగా ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ ప్రయోగం చూస్తుంటే.. త్రీ ఇడియట్స్ సినిమా గుర్తుకు వస్తుంది. అందులో హీరో క్యారెక్టర్ చాలా ఇంటెల్లిజెంట్ గా ఉంటుంది. అతడు చేసే ప్రతీ పనిలో కూడా ఒక ప్రయోగం దాగి ఉంటుంది. క్లాస్ లో కూర్చొని పాఠాలు వినడం కన్నా.. ప్రాక్టికల్ వాటిని చేసే చూపితేనే విద్యార్థులకు అర్థం అవుతుంది అనే కాన్సెప్ట్ తో ఉంటాడు. ఇలా అతని తెలివితేటలు అందరినీ విస్మయానికి గురిచేస్తాయి.

First published:

Tags: 5g technology, New smartphone, Science and technology, Technology