• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • SMARTPHONE CATCHES FIRE INSIDE MANS BAG IN CHINA WATCH VIDEO HERE SS

Video: బ్యాగులో పేలిన స్మార్ట్‌ఫోన్... సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు

Video: బ్యాగులో పేలిన స్మార్ట్‌ఫోన్... సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు

Video: బ్యాగులో పేలిన స్మార్ట్‌ఫోన్... సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు (Credit: Screengrab from South China Morning Post)

Smartphone Blast | చైనాలో నడిరోడ్డుపై స్మార్ట్‌ఫోన్ పేలిన ఘటన కలకలం రేపింది. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వీడియో ఇక్కడ చూడండి.

  • Share this:
    ఛార్జింగ్‌లో ఉండగా స్మార్ట్‌ఫోన్ పేలిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఘటనల్లో చనిపోయినవాళ్లూ ఉన్నారు. కొన్నిసార్లు ఛార్జింగ్‌లో లేకపోయినా స్మార్ట్‌ఫోన్లు పేలుతూ ఉంటాయి. అలాంటి ఘటనే చైనాలో జరిగింది. ఓవ్యక్తి నడుస్తూ ఉండగా అతని బ్యాగులో ఉన్న సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ పేలింది. ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఈ వీడియోను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ న్యూస్ పోస్ట్ చేసింది. ఆ వార్తా కథనం ప్రకారం కొద్ది రోజుల క్రితం అతను ఓ బిజీ స్ట్రీట్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా తన బ్యాగులోంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. వెంటనే బ్యాగు కింద పారేశాడు. అతని చేతి, జుట్టు, కనురెప్పలు కాలిపోయాయి. తన సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ పేలిపోవడం వల్ల ఈ మంటలు వచ్చాయని గుర్తించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో ఇక్కడ చూడొచ్చు.

    Realme 8 5G: రియల్‌మీ సంచలనం... రూ.14,999 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

    WhatsApp: వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్ వెంటనే మార్చండి


    సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ న్యూస్ కథనం ప్రకారం సదరు వ్యక్తి 2016లో ఆ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ను కొన్నాడు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా బ్యాటరీ మార్చలేదు. ఈ ఘటన జరిగినప్పుడు తన ఫోన్ ఛార్జింగ్‌లో కూడా లేదు. ఈఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఈ వీడియోపై ట్విట్టర్‌లో రియాక్షన్స్ వస్తున్నాయి. అయితే బ్యాటరీ ఉబ్బడం వల్ల పేలిపోయి ఉంటుందని కొందరు ట్వీట్ చేశారు. లేదా బ్యాగులో ఉన్నఇతర వస్తువుల వల్ల ఈ ఘటన జరిగి ఉండొచ్చని చర్చిస్తున్నారు. ఇంకొందరైతే కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అవుతున్నా చైనీయులు పాత స్మార్ట్‌ఫోన్లు ఎందుకు వాడుతున్నారని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఆ వ్యక్తికి పెను ప్రమాదం తప్పింది.

    Android Apps: అలర్ట్... మీ స్మార్ట్‌ఫోన్ నుంచి వెంటనే ఈ 8 యాప్స్ డిలిట్ చేయండి

    Oppo A54: ఒప్పో ఏ54 స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు తెలుసుకోండి

    గతంలో సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లలో ఓవర్‌హీటింగ్ సమస్యలు ఉండేవి. అందుకే 2016లో సాంసంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్లను వెనక్కి తీసుకుంది సాంసంగ్. 191,000 డివైజ్‌లను రీకాల్ చేసింది. కస్టమర్లు తమ డివైజ్‌లు మార్చుకోవాలని సాంసంగ్ కోరింది.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు