హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphone Buying Guide: రూ.20 వేల లోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

Smartphone Buying Guide: రూ.20 వేల లోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియాలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు పరిగణించాల్సిన చిట్కాలు, దృష్టి పెట్టాల్సిన విషయాలు ఏంటో తెలుసుకోండి.

ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా(Smartphone Market) పేరున్న ఇండియాలో.. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను(Premium Smartphone) బడ్జెట్‌(Budget) ధరల్లో అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి. చాలా మిడ్‌ రేంజ్‌, ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగదారులు కోరుకునే ఫీచర్లను కంపెనీలు అందించే ప్రయత్నం చేస్తున్నాయి. చాలా ఆప్షన్‌లు అందుబాటులో ఉండటంతో ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్(Best) అనేది తెలుసుకోవడం అవసరం. ఇండియాలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు పరిగణించాల్సిన చిట్కాలు, దృష్టి పెట్టాల్సిన విషయాలు ఏంటో తెలుసుకోండి.

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేందుకు సూచనలు

ఫోన్‌ కొనుగోలు చేయాలనుకొన్న సమయంలో ఎలాంటి ఫీచర్‌లు కావాలో నిర్ణయించుకోవాలి. డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ లైఫ్, ప్రాసెసర్, డిజైన్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను కనీసం ఆరు పారామీటర్‌లుగా పరిగణించాలి. స్పీకర్‌లు, బిల్డ్ క్వాలిటీ వంటివి విశ్లేషించవచ్చు. అన్ని ఫీచర్‌లను సెలక్ట్‌ చేసుకొన్న తర్వాత ఫోన్‌ ఎంచుకోవడం సులభం. ఉదాహరణకు స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువ కంటెంట్‌ని వినియోగిస్తే, డ్యూయల్ స్పీకర్‌లతో కూడిన AMOLED డిస్‌ప్లే ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్‌ని కలిగి ఉంటాయి, అయితే కొనుగోలు కొనుగోలు చేయడానికి ముందు ఒకసారి తనిఖీ చేయడం ఉత్తమం. ఇలాంటి సదుపాయాలు ఉన్న ఫోన్‌లలో Redmi Note 11, Moto G52 ఉన్నాయి.

ఇది కూడా చదవండి  : విశ్రాంతి పేరుతో వేటుకు రంగం సిద్ధం చేసిన బీసీసీఐ! సౌతాఫ్రికాతో సిరీస్ కు కోహ్లీని పక్కన పెట్టే ఛాన్స్!

అత్యుత్తమ పనితీరును కోరుకుంటే కొత్త ప్రాసెసర్‌తో వచ్చే ఫోన్‌లను పరిశీలించాలి. Vivo T1 5G, iQOO Z6 5G ఫోన్‌లు 6nm ప్రాసెస్‌పై ఆధారపడిన స్నాప్‌డ్రాగన్ 695 SoCతో వస్తాయి. ఈ చిప్‌సెట్ గొప్ప పనితీరును అందించడమే కాకుండా తక్కువ శక్తిని వినియోగిస్తుంది. దీని ద్వారా ఫోన్‌ బ్యాటరీ జీవిత కాలం పెరుగుతుంది. అసాధారణమైన కెమెరా పనితీరును అందించే బడ్జెట్ విభాగంలో చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి.

బెస్ట్ కెమెరా కోసం చూసేవారికి.. బడ్జెట్ సెగ్మెంట్‌లో Moto G52, Redmi Note 11S, iQOO Z6 5G, Vivo T1 5G వంటి కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఇవి మంచి కెమెరా పనితీరును అందిస్తాయి. ఫోన్‌ని కేవలం మెగాపిక్సెల్ కౌంట్ లేదా సెన్సార్‌ల సంఖ్య ఆధారంగా ఎంచుకోకూడదు. కెమెరా పనితీరు, నాణ్యత ఆధారంగా మాత్రమే ఎంచుకోవాలి. ఈ విభాగంలో కొన్ని ఫోన్‌లు అల్ట్రావైడ్ కెమెరాతో రావు, అయితే కొన్ని ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్-కెమెరా సెటప్‌ను అందిస్తున్నాయి. అనేక బ్రాండ్‌లు 2022లో Android 11తో ఫోన్‌లను లాంచ్ చేశాయి. తాజా యుటిలిటీ ఫీచర్‌లను మాత్రమే కాకుండా కీలకమైన ప్రైవసీ, సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా పొందడం కోసం సరికొత్త Android 12 అప్‌డేట్‌తో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడం మేలు.

* పోస్ట్ సేల్ సర్వీస్‌

కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ముందు తనిఖీ చేయవలసిన ముఖ్యమైన విషయం ఇది. టైర్ 2 లేదా టైర్ 3 ప్రాంతాల్లో ఉండేవారు స్మార్ట్‌ఫోన్ కంపెనీకి మీ టౌన్‌లో సర్వీస్ సెంటర్ ఉందో లేదో చూసుకోవాలి. చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు దేశవ్యాప్తంగా విస్తృత సర్వీస్‌ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. మార్కెట్ వాటాను పొందేందుకు విస్తరిస్తున్నాయి. సమస్యలను, ఫిర్యాదులను పరిష్కరించడానికి ఎంత సమయం తీసుకుంటుందో కూడా పరిశీలించాల్సి ఉంటుంది. విడిభాగాల లభ్యత కూడా ఒక ముఖ్యమైన అంశం.

* 2022లో 4G లేదా 5G స్మార్ట్‌ఫోన్?

5జీ స్పెక్ట్రమ్ వేలం ఈ ఏడాది చివర్లో జరగనుంది. వేలం తర్వాత కంపెనీలు దేశంలోని వివిధ ప్రాంతాలలో వాణిజ్యపరంగా 5G నెట్‌వర్క్‌ను విడుదల చేయాలని భావిస్తున్నాయి. మెట్రో నగరాలు, టైర్ 1 నగరాలు ముందుగా 5G నెట్‌వర్క్‌ను పొందే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇతర పట్టణాలు, ప్రాంతాలకు చేరుతాయి. 5G ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ, ఇది అదనపు ప్రీమియంతో వస్తుందని గమనించాలి. టెలికాం ఆపరేటర్లు పెట్టుబడి మొత్తాన్ని భర్తీ చేయడానికి, రికవరీ చేయడానికి 5G ప్లాన్‌లకు ఎక్కువ ధరను నిర్ణయిస్తారు. మొదటి కొన్ని నెలలు కనెక్షన్ స్థిరంగా ఉండే అవకాశం లేదు. అయినప్పటికీ 5G స్మార్ట్‌ఫోన్‌ను పొందాలనుకుంటే, Realme, Redmi, Samsung, Motorola, Vivo, iQOO మొదలైన కంపెనీలు చాలా ఫోన్‌లను అందిస్తున్నాయి.

Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Smartphones, Technology

ఉత్తమ కథలు