SMARTPHONE APP DEVELOPED BY IIT KHARAGPUR STUDENTS CAN DETECT FAKE CURRENCY SS
మీ దగ్గరున్న నోటు నకిలీదా? ఒరిజినలా? స్మార్ట్‌ఫోన్ యాప్‌తో గుర్తించొచ్చు
మీ దగ్గరున్న నోటు నకిలీదా? ఒరిజినలా? స్మార్ట్‌ఫోన్ యాప్‌తో గుర్తించొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)
నకిలీ నోట్లను స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా గుర్తించేందుకు ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించారు విద్యార్థులు. మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గరున్న కరెన్సీ నోటును అప్లోడ్ చేయాలి.
మీ చేతికి ఓ కొత్త నోటు వస్తుంది. చూడ్డానికి ఒరిజినల్ లాగానే ఉంటుంది. మీరు వెళ్లి షాపులో ఏదో కొనుక్కుంటారు. ఆ షాపు యజమాని మరుసటి రోజు బ్యాంకుకు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేస్తారు. అందులో మీరు ఇచ్చిన నోటు నకిలీదని బ్యాంకు సిబ్బంది గుర్తిస్తారు. అంతే... ఆ నోటు ఇక చెల్లదు. ఈ సమస్య చాలామందికి ఎదురవుతూనే ఉంటుంది. కారణం... మార్కెట్లో ఒరిజినల్ నోట్లను తలదన్నేలా నకిలీ నోట్లు చలామణి అవుతుండటమే. ఒరిజినల్ నోటు, నకిలీ నోటు పక్కపక్కన పెడితే అస్సలు గుర్తుపట్టలేనంత పక్కాగా ఫేక్ కరెన్సీ తయారు చేస్తున్నారు కేటుగాళ్లు. మరి అలాంటి నోట్లను స్పాట్లో గుర్తుపట్టే ఛాన్సే లేదా? ఉంది. నకిలీ నోట్లను మీరే గుర్తించేందుకు వీలుగా ఓ స్మార్ట్‌ఫోన్ యాప్ రూపొందింది. ఐఐటీ ఖరగ్‌పూర్ పరిశోధకుల ఆవిష్కరణ ఇది. మార్కెట్లో కుప్పలుతెప్పలుగా ఉన్న నకిలీ నోట్లను సామాన్యులు సైతం గుర్తించేందుకు వీలుగా తయారు చేసిన యాప్ ఇది. మార్చి 2, 3 తేదీల్లో జరిగిన 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2019'లో ఐఐటీ-ఖరగ్‌పూర్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నకిలీ నోట్లను స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా గుర్తించేందుకు ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించారు విద్యార్థులు. మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గరున్న కరెన్సీ నోటును అప్లోడ్ చేయాలి. ఆ నోటు ముందు, వెనుకవైపు 25 ఫీచర్లను ఈ యాప్ పరిశీలిస్తుంది. ఒకవేళ అది నకిలీ నోటు అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఇంకా ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ యాప్ సామాన్యులకు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఒకసారి ఈ యాప్ రిలీజ్ అయిందంటే మీరే మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా నకిలీ నోట్లను సులభంగా గుర్తించొచ్చు.
Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.