Smart Speaker: దేశంలో స్మార్ట్ స్పీకర్లకు పెరుగుతున్న ఆదరణ

భారత్‌లో డిస్‌ప్లేతో లభించే స్మార్ట్ స్పీకర్లను కొనుగోలు చేసే ధోరణి కూడా పెరుగుతోందని అధ్యయనం వెల్లడించింది.

news18-telugu
Updated: November 20, 2020, 5:59 PM IST
Smart Speaker: దేశంలో స్మార్ట్ స్పీకర్లకు పెరుగుతున్న ఆదరణ
Smart Speaker: దేశంలో స్మార్ట్ స్పీకర్లకు పెరుగుతున్న ఆదరణ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత మార్కోట్లో స్మార్ట్ స్పీకర్లకు ఆదరణ పెరుగుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం భారత్‌కు రవాణా అయ్యే స్మార్ట్ స్పీకర్ల సంఖ్య 7.5 లక్షల యూనిట్లకు చేరుకోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మన దేశ వినియోగదారులు ఇళ్లలో స్మార్ట్ టెక్నాలజీని వాడాలని కోరుకుంటున్నారని టెక్‌ఆర్క్ సంస్థ చేసిన పరిశోధన లేలింది. ఈ నివేదికను ఆ సంస్థ సోమవారం విడుదల చేసింది. మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన స్మార్ట్‌ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అమెజాన్ ఎకో స్మార్ట్‌ స్పీకర్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ వరకు 91 శాతం వాటాతో స్మార్ట్ స్పీకర్ మార్కెట్లో ఎకో అగ్రస్థానంలో నిలిచిందని అధ్యయనం తెలిపింది. అమెజాన్ తరువాత ఏడు శాతం వాటాతో షావోమీ, రెండు శాతం వాటాతో గూగుల్ ఈ జాబితాలో ఉన్నాయి.

Cylinder Booking on Paytm: పేటీఎంలో సింపుల్‌గా సిలిండర్ బుకింగ్... ఎలా చేయాలంటే

Earphones: ఇయర్‌ఫోన్స్ ఎక్కువగా వాడితే ఎంత డేంజరో తెలుసా?

వాడకం పెరుగుతోంది


స్మార్ట్ టెక్నాలజీపై ఆసక్తి చూపుతున్న భారత వినియోగదారులు స్మార్ట్ స్పీకర్ వంటి వాయిస్ కంట్రోల్డ్ డివైజ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని టెక్‌ఆర్క్ వ్యవస్థాపకుడు, చీఫ్ అనలిస్ట్ ఫైసల్ కవూసా ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎకో డివైజ్‌లు ఎక్కువగా ప్రాచుర్యం పొందడానికి వివిధ కారణాలు ఉన్నాయి. వినియోగదారులకు ఆకర్షణీయమైన కంటెంట్‌ను ఇచ్చేలా, యాప్‌లను యాక్సెస్‌ చేసేలా అమెజాన్ ఎకో ప్రొడక్ట్స్‌ను తీర్చిదిద్దింది’ అని ఆయన చెప్పారు.

WhatsApp Feature: మెసేజెస్‌తో వాట్సప్ ఫుల్ అవుతోందా? ఈ సెట్టింగ్స్ మార్చండి

Jio New Plans: జియోలో రూ.75 నుంచే ఆల్ ఇన్ వన్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే

డిస్‌ప్లేతో లభించే స్మార్ట్ స్పీకర్లకు కూడా


భారత్‌లో డిస్‌ప్లేతో లభించే స్మార్ట్ స్పీకర్లను కొనుగోలు చేసే ధోరణి కూడా పెరుగుతోందని అధ్యయనం వెల్లడించింది. ఈ సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో డిస్‌ప్లేతో ఉండే స్మార్ట్ స్పీకర్ల షిప్‌మెంట్ గత త్రైమాసికంతో పోలిస్తే 87 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది. డిస్ప్లేతో ఉండే స్మార్ట్ స్పీకర్లకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నందున, వాటి సగటు ధరలు కూడా కొంత వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సాధారణ స్మార్ట్ స్పీకర్ డివైజ్‌ల సగటు ధర 5,560 వరకు ఉంది. జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇది రూ.6,100 వరకు ఉండటం విశేషం.
Published by: Santhosh Kumar S
First published: November 20, 2020, 5:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading