SMART PHONES TOP PHONES AND FEATURES THAT ARE GOING TO MAKE A SPLASH IN THE INDIAN MARKET SOON EVK
Smart Phones: త్వరలో ఇండియన్ మార్కెట్లో సందడి చేయబోతున్న టాప్ ఫోన్లు, ఫీచర్స్!
(ప్రతీకాత్మక చిత్రం)
Smart Phones | ఎప్పటికప్పుడు ప్రముఖ కంపెనీలు కొత్త ఫోన్లతో మార్కెట్లో సందడి చేస్తుంటాయి. ఎన్ని ఫోన్లు వచ్చినా అంతకు మించిన ఏదో కొత్త ఫీచర్‌ను అందించడంలో దాదాపు అన్ని కంపెనీలు ముందు తున్నాయి. తాజాగా త్వరలో విడుదల అయ్యే కొత్త ఫోన్ ఫీచర్ల గురించి తెలుసుకోండి.
ఎప్పటికప్పుడు ప్రముఖ కంపెనీలు కొత్త ఫోన్లతో మార్కెట్లో సందడి చేస్తుంటాయి. ఎన్ని ఫోన్లు వచ్చినా అంతకు మించిన ఏదో కొత్త ఫీచర్‌ను అందించడంలో దాదాపు అన్ని కంపెనీలు ముందు తున్నాయి. తాజాగా త్వరలో విడుదల అయ్యే కొత్త ఫోన్ ఫీచర్ల గురించి తెలుసుకోండి.
వన్‌ప్లస్ 10 ప్రో ..
వన్‌ప్లస్ 10 ప్రో 5జీ (OnePlus 10 Pro 5G) స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మొబైల్ చైనాలో లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా ఇతర దేశాల్లో అందుబాటులోకి రాలేదు. ఇండియాకు ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు వస్తుందా అని వన్‌ప్లస్ ఫ్యాన్స్ చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది. వన్‌ప్లస్ లాంఛింగ్‌కు సంబంధించిన టీజర్‌ను ట్వీట్ చేసింది వన్‌ప్లస్ ఇండియా. వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే ఇండియాలో రిలీజ్ అయిన ఐకూ 9 ప్రో (iQOO 9 Pro), సాంసంగ్ గెలాక్సీ ఎస్22, ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
స్మార్ట్‌ఫోన్ (Smart Phone) మార్కెట్లో దూకుడుమీదున్న రియల్మీ మరో ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియల్మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ డేట్‌ను ఫిక్స్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 22న చైనాలో విడుదల చేయనుంది. మార్కెట్లో 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల మొట్టమొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. గత నెలలో బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022 (MWC 2022)లో రియల్మీ తన 150W టెక్నాలజీని ప్రదర్శించింది. ఇప్పుడు ఇదే టెక్నాలజీని రియల్మీ జీటీ నియో 3 ఫోన్లో అందిచనుంది. ఈ 150W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 5 నిమిషాల్లోనే 4,500mAh బ్యాటరీని 0 నుండి 50 వరకు ఛార్జ్ చేయవచ్చు.
యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 2022..
టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల నిర్వహించిన యాపిల్ స్ప్రింట్ ఈవెంట్ (Apple Sprint Event)లో రెండు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసింది. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 2022 (Apple iPhone SE 2022), ఐప్యాడ్ ఎయిర్ 2022 (iPod Air 2022) ట్యాబ్లెట్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ రెండు ఉత్పత్తులను భారతదేశంలోని ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఛానెల్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ఉత్పత్తులు 5G నెట్‌వర్క్‌కు మద్దతిస్తాయి. ఐఫోన్ ఎస్ఈ A15 బయోనిక్ చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఐప్యాడ్ ఎయిర్ 2022లో M1 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌నే ఐప్యాడ్ ప్రో లైనప్, మ్యాక్‌బుక్‌లలో కూడా ఉపయోగిస్తుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.