Home /News /technology /

SMART PHONES THESE ARE THE BEST SMARTPHONES AVAILABLE IN THE INDIAN MARKET FOR LESS THAN RS 15000 TAKE A LOOK AT THE FEATURES GH VB

Smart Phones Under 15K: రూ.15 వేలలోపు లభిస్తున్న బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. ఫీచర్లపై ఓ లుక్కేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ మార్కెట్‌లోకి ఇటీవల కాలంలో కొత్త ఫీచర్లతో(New Features) చాలా బడ్జెట్‌ ఫోన్‌లు(Budget Phones) అందుబాటులోకి వచ్చాయి. రూ.15,000 లోపు ఫోన్‌లు కూడా ఉన్నాయి. చాలా ఫోన్‌లు 50MP లేదా 64MP కెమెరాలను కలిగి ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్‌లోకి ఇటీవల కాలంలో కొత్త ఫీచర్లతో(New Features) చాలా బడ్జెట్‌ ఫోన్‌లు(Budget Phones) అందుబాటులోకి వచ్చాయి. రూ.15,000 లోపు ఫోన్‌లు కూడా ఉన్నాయి. చాలా ఫోన్‌లు 50MP లేదా 64MP కెమెరాలను కలిగి ఉన్నాయి. గతంలో విడుదలైన ఫోన్‌లలోని కెమెరాల సామర్థ్యంతో పోలిస్తే ఇవి చాలా బెటర్. 6 GB RAMతో కూడా కొన్ని హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి. AMOLED స్క్రీన్‌లు లేదా అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు లేదా రెండూ కూడా ఈ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో రూ.15,000 లోపు ధరలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఏవో చూద్దాం.

* Oppo K10
Oppo నుంచి వచ్చిన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Oppo K10. ఇది IP5X రేటెడ్ డస్ట్ ప్రూఫ్ డిజైన్‌తో ఆకట్టుకొంటోంది. K10 ఫోన్‌ 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC చిప్‌సెట్ ఉంటుంది. ఈ బడ్జెట్‌లో ఇది చాలా మంచి ఎంపిక. 6 GB RAM, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ పొందుతారు. మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి మరింత విస్తరించుకోవచ్చు. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో కెమెరా కూడా ఉంది. 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Oppo K10కి 5000 mAh బ్యాటరీ ఉంది. ఇది సాధారణ వినియోగానికి దాదాపు ఒకటిన్నర రోజుల పాటు పని చేస్తుంది. కంపెనీ 33W SuperVOOC ఛార్జర్‌ అందిస్తుంది. ColorOS 11తో Android 11పై రన్ అవుతుంది. భారతదేశంలో Oppo K10 ధర: 6 GB RAM/ 128 GB వేరియంట్‌ రూ.14,990కి అందుబాటులో ఉంది.

Tweet New Feature: ట్విట్టర్ ట్వీట్ లో కొత్త అప్‌డేట్స్.. ఇక వాటిని సులువుగా చెక్ చేసుకోవచ్చు..


* Redmi Note 11
ఈ విభాగంలో రెడ్‌మి నోట్ 11 మంచి ఆల్‌రౌండర్. ఇది 6.43 అంగుళాల పూర్తి HD+ AMOLED స్క్రీన్‌ను 90 Hz రిఫ్రెష్ రేట్, 1000 nits గరిష్ట బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 పొర ద్వారా స్క్రీన్ గీతలు పడకుండా రక్షిస్తుంది. ఈ ఫోన్ కూడా క్వాల్‌కామ్ స్నాప్‌గ్రాగన్ 680 చిప్‌తో, 6 GB RAMతో, 64 ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తుంది. Redmi Note 11లో 8MP అల్ట్రా-వైడ్ షూటర్, 2MP మాక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో పాటు 50MP ప్రైమరీ కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. సాధారణ వినియోగానికి దాదాపు ఒకటిన్నర రోజులపాటు పని చేస్తుంది. ప్యాకేజీలో 33W ఫాస్ట్ ఛార్జర్‌ ఉంటుంది. దీంతో గంటలో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. MIUI 13తో Android 11పై పనిచేస్తుంది. భారతదేశంలో Redmi Note 11 ధర 6 GB RAM/64GB స్టోరేజీ రూ.14,499 వద్ద అందుబాటులో ఉంది.

* Poco M4 Pro
కొత్త Poco M4 కూడా 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ HD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఉంది. Poco వేరే SoCని ఎంచుకుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ హీలియో G96 చిప్‌తో వస్తుంది. 6 GB RAM, 64 GB ఇంటర్నల్‌ స్టోరేజీ ఉంటుంది. Poco M4 Proలో 64 MP ప్రైమరీ కెమెరాతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సపోర్ట్ కాస్ట్‌లో 8 MP అల్ట్రా-వైడ్ స్నాపర్, 2 MP మాక్రో కెమెరా ఉన్నాయి. M4 Pro సెల్ఫీ విభాగంలో 16MP ఫ్రంట్ కెమెరాను అందించే Redmi Note 11లో ఒకటిగా ఉంది. ఫోన్ MIUI 13 బేస్డ్ ఆండ్రాయిడ్ 11పై పనిచేస్తుంది. ఇది 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. 33W ఫాస్ట్ ఛార్జర్‌ అందిస్తారు. భారతదేశంలో Poco M4 ప్రో ధర 6 GB RAM/ 64GB వేరియంట్‌ రూ.14,999కి అందుబాటులో ఉంది.

* Motorola G31
Motorola G31 ఆకట్టుకునే ఫీచర్లతో జాబితాలో తన స్థానాన్ని నిలుపుకుంది. ఇది 6.4 అంగుళాల ఫుల్ HD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. 60 Hz రిఫ్రెష్ రేట్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్‌లో కూడా 8MP అల్ట్రావైడ్ షూటర్, 2MP మాక్రో కెమెరాతో పాటు వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా ఉంది. స్క్రీన్ పైభాగంలో ఉన్న ఒక చిన్న పంచ్ హోల్ 13MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది సెల్ఫీలు, వీడియో కాల్‌లకు సపోర్ట్‌ చేస్తుంది. ఫోన్ వాటర్-రిపెల్లెంట్ డిజైన్‌ను కలిగి ఉంది. Moto G31 అనేది మీడియా టెక్ హీలియో G85 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 6 GB RAM, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజీతో ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది. సాధారణంగా ఒకటిన్నర రోజుల పాటు వినియోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11తో వస్తున్న దీనికి ఈ సంవత్సరం తర్వాత ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్‌ను రావచ్చు. భారతదేశంలో Motorola G31 ధర 6 GB RAM/128 GB వేరియంట్‌కు రూ.14,999గా ఉంది.

State Bank Of India: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అలర్ట్.. వాటి రేటును పెంచిన బ్యాంకు..


* Realme Narzo 30
Realme Narzo 30కి స్టైలిష్ డిజైన్ కాకుండా, ఫోన్ అనుకూలమైన యాప్‌లలో ఫ్లికర్-ఫ్రీ స్క్రోలింగ్ కోసం 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్‌లో 16MP సెల్ఫీ కెమెరా సెల్ఫీ ప్రియులను మెప్పిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G95 చిప్‌తో వస్తుంది. ఈ బడ్జెట్‌లో 6 GB, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్‌ అందుబాటులో ఉంది. వెనుక కెమెరా విభాగంలో 48MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో ప్రారంభమయ్యే మూడు షూటర్‌లు ఉన్నాయి. Realme Narzo 30 కూడా 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది ఒకటిన్నర రోజులపాటు ఉంటుంది. 30W డార్ట్ ఛార్జర్‌ను అందుకొంటారు. రియల్‌మీ UI 2.0తో ఆండ్రాయిడ్ 11తో పని చేస్తుంది. భారతదేశంలో Realme Narzo 30 ధర 6 GB RAM/ 128GB స్టోరేజ్‌ రూ.14,790గా ఉంది.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Smartphones, Technology

తదుపరి వార్తలు