హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smart Phones Under 20K: రూ.20 వేల లోపు బెస్ట్ బడ్జెట్‌ ఫోన్ కోసం చూస్తున్నారా..? ఈ మోడళ్లను పరిశీలించండి..

Smart Phones Under 20K: రూ.20 వేల లోపు బెస్ట్ బడ్జెట్‌ ఫోన్ కోసం చూస్తున్నారా..? ఈ మోడళ్లను పరిశీలించండి..

ఇండియన్ మార్కెట్‌లో రూ.20 వేల లోపు బడ్జెట్‌ ఫోన్‌లు వినియోగదారులను అమితంగా ఆకట్టుకొంటున్నాయి. ఎక్కువ ఖర్చు పెట్టి ఫోన్‌ కొనాల్సిన అవసరం లేదని భావించేవాళ్లు.. చక్కటి ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లను పరిశీలింవచ్చు.

ఇండియన్ మార్కెట్‌లో రూ.20 వేల లోపు బడ్జెట్‌ ఫోన్‌లు వినియోగదారులను అమితంగా ఆకట్టుకొంటున్నాయి. ఎక్కువ ఖర్చు పెట్టి ఫోన్‌ కొనాల్సిన అవసరం లేదని భావించేవాళ్లు.. చక్కటి ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లను పరిశీలింవచ్చు.

ఇండియన్ మార్కెట్‌లో రూ.20 వేల లోపు బడ్జెట్‌ ఫోన్‌లు వినియోగదారులను అమితంగా ఆకట్టుకొంటున్నాయి. ఎక్కువ ఖర్చు పెట్టి ఫోన్‌ కొనాల్సిన అవసరం లేదని భావించేవాళ్లు.. చక్కటి ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లను పరిశీలింవచ్చు.

ఇంకా చదవండి ...

  ఇండియన్ మార్కెట్‌లో(Indian Market) రూ.20 వేల లోపు బడ్జెట్‌ ఫోన్‌లు వినియోగదారులను అమితంగా ఆకట్టుకొంటున్నాయి. ఎక్కువ ఖర్చు పెట్టి ఫోన్‌ కొనాల్సిన అవసరం లేదని భావించేవాళ్లు.. చక్కటి ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లను పరిశీలింవచ్చు. Poco X4 Pro 5G, Redmi Note 11 Pro తదితర ఫోన్ల వివరాలు ఇవే.. అందులో మొదటిది.. Poco X4 Pro 5G.  ఇది ఇండియాలో రూ.20,000 లోపు ఉన్న జాబితాలో ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న స్మార్ట్ ఫోన్. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ రూ.18,999కు అందుబాటులో ఉంది. 64MP ట్రిపుల్-కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 595 SoC, 6.67-అంగుళాల AMOLED 120Hz డిస్ప్లే , 5000 mAh బ్యాటరీకి 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

  రెడ్‌మి నోట్ 11 ప్రో

  రెడ్‌మి నోట్ 11 ప్రో ప్రారంభ ధర రూ.17,999గా ఉంది. ఈ 4G స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G96 SoC, 108 MP క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫోన్‌లో 6.67-అంగుళాల AMOLED 120Hz డిస్‌ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ కూడా ఉన్నాయి.

  * Realme 9 SE

  Realme 9 SE రూ.20,000 లోపు ఉన్న ఫోన్లలో అత్యుత్తమ పనితీరును అందిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 778G, 144Hz IPS LCDతో ఫోన్‌ వస్తోంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 5000 mAh బ్యాటరీ ఉంది.

  * Redmi Note 11S

  భారతదేశంలో Redmi Note 11S ప్రారంభ ధర రూ.16,499గా ఉంది. ఇందులో MediaTek Helio G96 SoC, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 108MP క్వాడ్-కెమెరా సెటప్, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 5000 mAh బ్యాటరీ ఉన్నాయి.

  * Redmi Note 11T 5G

  ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.16,999గా ఉంది. ఈ ఫోన్ MediaTek Dimensity 810 SoC, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల IPS LCD, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌లో 50MP డ్యూయల్ కెమెరా సెటప్ కూడా ఉంది.

  * Realme 8S 5G

  ఇండియన్‌ మార్కెట్‌లో Realme 8S 5G ఫోన్‌.. 6GB ర్యామ్‌, 128GB స్టోరేజ్‌ వేరియంట్ రూ.17,999 నుండి ప్రారంభమవుతుంది. ఫోన్ MediaTek Dimensity 810 SoC, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల LCD, 64MP ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది.

  * లావా అగ్ని 5G

  లావా అగ్ని 5G ఇండియన్‌ మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. రూ.20,000 లోపు లావా అందిస్తున్న మొట్టమొదటి 5G స్మార్ట్‌ఫోన్ ఇది. 5000 mAh బ్యాటరీ, MediaTek డైమెన్సిటీ 810 SoCతో వస్తుంది. దీని ధర రూ.19,999గా ఉంది. 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది.

  Samsung Galaxy M32 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,000 పైనే డిస్కౌంట్... ఆఫర్ వివరాలివే

  * iQOO Z3

  ఐక్యూ కంపెనీ iQOO Z5 5Gని ప్రారంభించిన తర్వాత భారతదేశంలో iQOO Z3 ధరను సవరించింది. Z3 5G ఇప్పుడు అనేక ప్లాట్‌ఫారమ్‌లలో రూ 16,999కి అందుబాటులో ఉంది. వివిధ ఇ-కామర్స్ విక్రయాల సమయంలో దీని ధర రూ.15,999కి తగ్గుతుంది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 768G SoCని, 55W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీనికి 120Hz IPS LCD స్క్రీన్, వెనుకవైపు ట్రిపుల్-కెమెరా సెటప్‌ ఉన్నాయి.

  * Poco X3 Pro

  Poco X3 Pro మాత్రమే స్నాప్‌డ్రాగన్ 800 సిరీస్ చిప్‌ను కలిగి ఉన్న రూ.20,000 లోపు స్మార్ట్‌ఫోన్. స్నాప్‌డ్రాగన్ 860 SoCతో వస్తుంది. చిప్‌తో పాటు Poco X3 ప్రోలో 120Hz LCD ప్యానెల్, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,160 mAh బ్యాటరీ, UFS 3.1 స్టోరేజ్, 48 MP క్వాడ్-కెమెరా సెటప్ కూడా ఉన్నాయి. రూ. 18,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

  * Redmi Note 10 Pro Max

  ఈ ఫోన్ ఇప్పటికీ భారతదేశంలో రూ. 20,000 లోపు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఫోన్ గ్లాస్ బ్యాక్, 120Hz AMOLED డిస్‌ప్లే, 108MP క్వాడ్-కెమెరా సెటప్, 5020 mAh బ్యాటరీతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 732G SoCపై పని చేస్తుంది.

  * Realme 9 Pro

  దీని ధర రూ 17,999 నుంచి ప్రారంభమవుతుంది. స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల 120Hz IPS LCD, స్నాప్‌డ్రాగన్ 695 SoCతో వస్తుంది. దీనికి వెనుకవైపు 64MP ట్రిపుల్-కెమెరా సెటప్‌ ఉంది.

  * Vivo T1 5G ప్రారంభ ధర ఇండియాలో రూ.15,990. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 SoC, 50MP ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫోన్‌లో 6.58 అంగుళాల 120Hz IPS LCD ఉంది. పైన వాటర్-డ్రాప్ నాచ్‌తో వస్తుంది.

  * Infinix Note 10 Pro

  ఈ జాబితాలో Infinix Note 10 Pro మాత్రమే 8GB RAM, 256GB స్టోరేజ్‌తో వచ్చే ఏకైక స్మార్ట్‌ఫోన్. రూ.16,999 ధరతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Helio G95 SoC, 64 MP క్వాడ్-కెమెరా సెటప్, పెద్ద 90Hz డిస్‌ప్లే, స్టీరియో స్పీకర్లు, 5,000 mAh బ్యాటరీ ఉన్నాయి.

  First published:

  Tags: 5g technology, Budget smart phone, Smart phones

  ఉత్తమ కథలు