ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు (Android Users) మరో కొత్త ఫీచర్(Feature) అందుబాటులోకి వచ్చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లో డీఫాల్ట్‌గా ఉండే స్క్రీన్ సేవర్లతో విసిగిపోయి ఉంటే.. నచ్చిన ఫొటోలను స్క్రీన్ సేవర్ (Screen Saver) లుగా ఎంచుకొనే అవకాశం ఉంది. చాలా సులువుగానే ఈ సదుపాయాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఈ సారి ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడుగానీ.. సాధారణంగానే వినియోగించకుండా పక్కన పెట్టి ఉన్నప్పుడు గానీ ఫేవరెట్ చిత్రాలను స్క్రీన్ సేవర్‌లో చూడవచ్చు. ఫోన్ టర్న్డ్ డిజిటల్ ఫొటో ఫ్రేమ్ ద్వారా ఇష్టమైన ఫొటోలను స్క్రీన్‌పై కనిపించేలా చేసుకొనే అవకాశాన్ని గూగుల్ (Google) కల్పించింది. ఆండ్రాయిడ్ ఓఎస్‌లో బిల్ట్ఇన్గా వచ్చిన ఈ ఫీచర్‌ను కొన్ని సులువైన స్టెప్ల ద్వారా పొందవచ్చు. వినియోగదారులు అదనంగా అప్లికేషన్లు డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
WhatsApp: వాట్సప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్స్.. తెలుసుకొని ట్రై చేయండి
ఈ స్టెప్స్ పాటించాలి..
- ఫోన్ అన్‌లాక్ చేసి.. సెట్టింగ్స్ మెనూకు వెళ్లాలి
- డిప్‌ప్లే మెనూ (Display Menu) పై క్లిక్ చేసి స్క్రీన్ సేవర్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి
- తర్వాత కరెంట్ స్క్రీన్ సేవర్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసి గూగుల్ ఫొటోస్ (Google Photos) యాప్ ఐకాన్‌ను సెలక్ట్ చేసుకోవాలి
- అనంతరం స్కీన్ సేవర్ మెనూ పేజ్ ఓపెన్ అవుతుంది
- ఇక్కడ గేర్ ఐకాన్‌పై క్లిక్ చేసి ఫోటోలను స్క్రీన్ సేవర్‌గా ఎప్పుడు చూపాలి, యానిమేటెడ్ జూమ్ ఎఫెక్ట్ ఆన్ లేదా ఆఫ్ చేయడం తదితర ఎంపికలను చేసుకోవచ్చు.
Tech Tips: మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. అయితేఈ మిస్టేక్ చేయకుండా ఉండండి
- తర్వాత మెయిన్ స్క్రీన్ సేవర్ మెనూ పేజ్‌కు వెళ్లి ‘వెన్ టూ స్టార్ట్’ అనే ఆప్షన్ సెలక్ట్ చేయాలి. తర్వాత ఛార్జింగ్ చేస్తున్నప్పుడు, వినియోగించకుండా పక్క పెట్టినప్పుడు, లేదా రెండు సందర్భాల్లో స్క్రీన్ సేవర్ రావాలా? అనే ఆప్షన్లను ఎంచుకోవాలి.
- అనంతరం మెయిన్ స్క్రీన్ సేవర్ మెనూకి తిరిగి వెళ్లి ప్రివ్యూ లేదా స్టార్ట్ నౌ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేస్తే.. ఎంచుకొన్న స్క్రీన్ సేవర్ కనిపిస్తుంది.
-స్క్రీన్ సేవర్.. సంబంధిత ఫోన్ ఆల్బమ్‌లోని ఏ క్రమంలో సెలక్ట్ చేసి ఉంటే అదే క్రమంలో చూపుతుంది. డీఫాల్ట్ స్క్రీన్ సేవర్లతో విసుగు చెంది ఉంటే.. నచ్చిన ఫొటోలతో ఆటో అప్డేట్ ఆల్బమ్‌ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆటో అప్డేటింగ్ ఆల్బమ్‌ను క్రియేట్ చేయడానికి గూగుల్ ఫొటోస్ యాప్ ఓపన్ చేసి.. స్రీన్ బాటమ్‌లోని లైబ్రరీ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
- తర్వాత కొత్త ఆల్బమ్ కోసం “+” చిహ్నాన్ని సెలక్ట్ చేయాలి. లేదా అదే లైబ్రరీ ట్యాబ్‌కి వెళ్లి ఆల్బమ్‌ని ఎంచుకోవడం ద్వారా ఇప్పటికే ఉన్న ఆల్బమ్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.
Redmi 11 5G: అదిరిపోయే ఫీచర్స్‌తో.. త్వరలో మార్కెట్లోకి రెడ్మి 11 5జీ.. ధర వివరాలు
- ఆల్బమ్‌కు టైటిల్‌ని ఇచ్చి, యాడ్ ఫోటోస్ ఆప్షన్ కింద ఇస్టమైన వ్యక్తులు, పెంపుడు జంతువులు తదితర ఫొటోస్ను ఎంచుకోవచ్చు.
- ఆటో అప్డేటింగ్ ఆల్బమ్‌లో ఎటువంటి విభాగానికి చెందిన చిత్రాలు కావాలో ఎంచుకోనే సదుపాయం ఉంటుంది. ఆ తర్వాత ఫొటోస్ యాప్‌లోకి చేరిన ప్రతి ఫొటోలో ఎంచుకున్న విభాగానికి చెందిన చిత్రాలు ఉంటే గూగుల్ ఆటోమేటిక్‌గా ఐడెంటిఫై చేస్తుంది.
- ఇప్పటికే ఉన్న ఆల్బమ్ ఫీచర్ (Feature) ని ఉపయోగించడానికి.. టాప్ రైట్ కార్నర్‌లోని మూడు చుక్కలపై నొక్కండి. ఆ తర్వాత కనిపించే ఆప్షన్లను ఎంచుకోండి.
- తర్వాత ఆటోమేటికల్లీ ఆప్షన్ కింద ఫొటోలను యాడ్ చేయాలి. ప్లస్ బటన్ నొక్కి ఎవరిని ఇన్క్లూడ్ చేయాలనుకొంటున్నారో సెలక్ట్ చేయవచ్చు. అప్పటికే ఉన్న ఫొటోలను కూడా ఎంచుకొనే సదుపాయం ఉంది.
- ఆల్బమ్ ఓపన్ చేయగానే కనిపించే ఫొటోలే.. స్క్రీన్ సేవర్‌లో కూడా మొదట కనిపిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Latest Technology, Smart phones