Home /News /technology /

SMART PHONE TIPS ARE YOU USING THESE BRANDED PHONES THEN KNOW THESE THING IF YOU WANT TO USE THEM FOR A LONG TIME EVK

Smart Phone Tips: మీరు ఈ బ్రాండ్ ఫోన్‌లు వాడుతున్నారా.. ఎక్కువ కాలం వాడాలంటే ఈ విష‌యం తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Smart Phone Tips | ప్ర‌స్తుతం అంద‌రి లైఫ్‌లో స్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా పెరిగిపోయింది. దాదాపు అంద‌రూ ఫోన్‌ల‌ను చాలా ఎక్కువ‌గా వాడు తుంటారు. ఈ నేప‌థ్యంలో మీ ఫోన్ మెరుగ్గా ప‌ని చేయాలంటే అప్‌డేట్స్ అవ‌స‌రం. అయితే ఏ ఫోన్ ఎప్పుడు అప్‌డేట్ చేయాలో తెలుసుకొని వాడితే ఎక్కువ‌కాలం ఫోన్‌ను వాడుకోవ‌చ్చు.

ఇంకా చదవండి ...
    ప్ర‌స్తుతం అంద‌రి లైఫ్‌లో స్మార్ట్‌ఫోన్ (Smart Phone)  వినియోగం బాగా పెరిగిపోయింది. దాదాపు అంద‌రూ ఫోన్‌ల‌ను చాలా ఎక్కువ‌గా వాడు తుంటారు. ఈ నేప‌థ్యంలో మీ ఫోన్ మెరుగ్గా ప‌ని చేయాలంటే అప్‌డేట్స్ అవ‌స‌రం. అయితే ఏ ఫోన్ ఎప్పుడు అప్‌డేట్ చేయాలో తెలుసుకొని వాడితే ఎక్కువ‌కాలం ఫోన్‌ను వాడుకోవ‌చ్చు. స్మార్ట్‌ఫోన్ ఎప్పుడూ ఇబ్బంది లేకుండా పనిచేయాలంటే అప్‌డేట్స్ తప్పనిసరి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌తో (Software Updates) పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా ముఖ్యం. రెగ్యులర్‌గా సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తే నాలుగేళ్లు కూడా స్మార్ట్‌ఫోన్ చక్కగా వాడుకోవచ్చు. ఒకవేళ ఈ అప్‌డేట్స్ రాకపోతే మాత్రం రెండేళ్ల తర్వాత స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం కష్టం. మరి ఏ కంపెనీ ఎక్కువకాలం ఈ అప్‌డేట్స్ అందిస్తోంది? మీరు వాడే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఎన్నేళ్లపాటు అప్‌డేట్స్ ఇస్తుంది? తెలుసుకోండి.

    శామ్‌సంగ్ (Samsung): శామ్సంగ్ ఐదేళ్ల వరకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తోంది. చాలావరకు సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లకు మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి. అయితే సాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు మాత్రం నాలుగేళ్లు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, ఐదేళ్లు సెక్యూరిటీ ప్యాచెస్ లభించడం విశేషం.

    New Smart Phone: ఏప్రిల్‌లో ఒప్పో నుంచి కొత్త‌ఫోన్‌.. అదిరిపోయే ఫీచ‌ర్స్ ఇవే!

    వ‌న్‌ప్ల‌స్, ఒపో (OnePlus, Oppo): వన్‌ప్లస్ 7 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతీ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు మూడేళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని ప్రకటించడం విశేషం. వన్‌ప్లస్ సిస్టమ్ బ్రాండ్ అయిన ఒప్పో కూడా మూడేళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తోంది.

    షావోమీ (Xiaomi): షావోమీ స్మార్ట్‌ఫోన్లకు కూడా మూడేళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ లభిస్తాయి. ఇక సెక్యూరిటీ అప్‌డేట్స్ విషయానికి వస్తే నాలుగేళ్లు ఈ అప్‌డేట్స్ పొందొచ్చు. ఈ విషయంలో వన్‌ప్లస్‌కు గట్టి పోటీనే ఇస్తోంది షావోమీ.

    రియ‌ల్‌మి (Realme): ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ విషయంలో రియల్‌మీ కాస్త వెనుకంజలోనే ఉంది. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లకు కేవలం రెండేళ్ల ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ మాత్రమే లభిస్తాయి.

    eSIM: రెండు సిమ్‌కార్డులు ఒక్క‌దాంట్లోనే.. ఆండ్రాయ‌డ్ 13 కొత్త వ‌ర్ష‌న్‌లో అదిరిపోయే ఫీచ‌ర్స్‌

    నోకియా (Nokia): నోకియా ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు మూడేళ్ల ఓఎస్ అప్‌డేట్స్ లభిస్తే, జీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు రెండేళ్ల ఓఎస్ అప్‌డేట్స్ లభిస్తున్నాయి. ఈ రెండు సిరీస్‌ల స్మార్ట్‌ఫోన్లకు మూడేళ్ల ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తోంది కంపెనీ. ఇక సీ సిరీస్‌ విషయానికి వస్తే రెండేళ్ల క్వార్టర్లీ సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తోంది. ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ మాత్రం ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం లభిస్తాయి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: 5g smart phone, Android, Latest Technology, Smart phones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు