మనం వినియోగించే ఆండ్రాయిడ్ (Android) ఫోన్లో గూగుల్ క్రోమ్ (Google Chrome), యాప్‌లు మనం నిత్యం వాడే సమాచారం తాలూకు డేటాను నిక్షిప్తం చేసుకుంటాయి. దీని ద్వారా మనం సమాచారాన్ని (Information) వేగవంతంగా వినియోగించుకోగలుగుతాం. కాని ఈ నిక్షిప్తమైన సమాచారం ఎక్కువగా అవ్వడం వల్ల ఫోన్ మెమోరీ వృధా అయ్యే అవకాశం ఉంది. కావున ఎప్పటికప్పడు అనవసరమైన సమాచారాన్ని తొలగించుకోవడం మంచిది. దీని ద్వారా ఫోన్ పనితీరు మెరుగవుతుంది. కొన్ని యాప్‌లైతే చాలా మెమోరీ (Memory) ని వృధా చేస్తాయి. ఇప్పుడు మనం ఎక్కువగా వాడే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ (Browser)తో పాటు ఎక్కువగా వినియోగించుకొనే యాప్ (Apps)లను ఎలా క్లీన్ చేయాలో తెలుసుకుందాం.
క్రోమ్ బ్రౌజర్‌ను క్లీన్ చేసే విధానం..
Step 1 : ముందుగా క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి కుడివైపు పైన ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేయాలి.
Step2 : క్లిక్ చేసినప్పుడు వచ్చిన మెనూలో హిస్టరీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
Step 3 : హిస్టరీ మెనూలో ‘క్లియర్ బ్రౌజింగ్ డేటా’ (Clear Browsing data) ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
Step 4 : ఇచ్చిన ఆప్షన్లను ఎంచుకొని మనకు అవసరమైనంత మేర హిస్టరీని డెలిట్ చేసుకోవచ్చు.
Step 5 : అంతే కాకుండా ‘కేచ్ ఇమేజ్ అండ్ ఫైల్స్’ (Cache image and Files) ఆప్షన్‌ను క్లిక్ చేసి ‘క్లియర్ డేటాను’ (Clear Data)ను ఎంచుకోవాలి.
Step 6 : ఒకోసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది. అప్పుడు ‘క్లియర్’ను క్లిక్ చేస్తే సరిపోతుంది.
Xiaomi Diwali Offers: షియోమీ స్పెషల్ సేల్..స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్‌టీవీలపై బంపర్ ఆఫర్స్
యాప్‌లలోని కేచ్‌లను క్లీన్ చేసే విధానం..
Step 1 : ముందుగా హోమ్ స్క్రీన్ (Home Screer) ని కిందికి డ్రాగ్ చేసి సెట్టింగ్ ఆప్షన్ (Setting Options) ఎంచుకోవాలి.
అందులో స్టోరేజ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
Step 2 : వచ్చిన మెనూలో ‘అదర్ యాప్’ (Other app) ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
మనకు ఫోన్లో ఇన్స్టాల్ అయిన అన్ని యాప్‌లు కనిపిస్తాయి. వాటితోపాటు అవి ఎంత మెమోరీని వినియోగిస్తున్నాయో కనిపిస్తుంది. కావల్సిన యాప్‌ను ఎంచుకొని క్లియర్ కేచ్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Latest Technology, Smart phone