స్మార్ట్ ఫ్యాన్ వచ్చేసింది.. ఆగమంటే ఆగిపోతుంది..ఇంకా ఎన్నో ఫీచర్స్..

Smart Fan | మార్కెట్లోకి రకరకాల ఫ్యాన్స్ వచ్చేశాయి. కొత్త స్టైల్స్, ఎన్నో మోడల్స్‌లో వచ్చాయి. ఈ నేపత్యంలోనే మరో స్మార్ట్ ఫ్యాన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ ఫ్యాన్ పిలిస్తే ఆన్ అవుతుంది.. ఆగిపో.. అంటే ఆగిపోతుంది.

news18-telugu
Updated: April 17, 2019, 12:50 PM IST
స్మార్ట్ ఫ్యాన్ వచ్చేసింది.. ఆగమంటే ఆగిపోతుంది..ఇంకా ఎన్నో ఫీచర్స్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సరికొత్తగా స్మార్ట్ ఫ్యాన్ మార్కెట్లోకి వచ్చేసింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) సపోర్ట్‌తో ఓరియంట్ ఎయిరోస్లిమ్ ఫ్యాన్ ఇది. ఈ ఫ్యాన్ ఆపరేట్ చేసేందుకు స్విచెస్ అవసరం లేదు. పిలిస్తేచాలు ఆన్ అవుతుంది.. ఆగిపో అని చెప్పగానే ఆఫ్ అయిపోతుంది. దీనికి కారణం ఇందులోని అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌లే. వీటిని ప్రత్యేక యాప్‌తో వాడుకోవచ్చు. అయితే ఆన్ ఆఫ్ మాత్రమే కాదు.. ఏ టైమ్‌లో ఆన్ కావాలి. ఎంత తిరగాలి వంటి వాటిని కూడా టైమర్‌తో సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు... ఈ ఫ్యాన్‌కి లైట్ కూడా ఉంటుంది.

ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా ఫ్యాన్ ఎక్కువ కరెంట్ వినియోగిచుకుంటుందంటే పొరపాటే.. ఇన్వర్టర్ మోటర్‌తో అతి తక్కువ విద్యుత్‌తో ఈ ఫ్యాన్ నడుస్తుంది. దీంతో కరెంట్ ఆదా అవుతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లను కూడా ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. మార్కెట్లో ఈ ఫ్యాన్ ధర రూ.31,990

ఫ్యాన్ మరిన్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 
First published: April 17, 2019, 12:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading