• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • SMART CONSUMER APP ARE YOU BUYING FAKE PRODUCTS OR ORIGINAL CHECK WITH SMART CONSUMER APP BEFORE YOU PURCHASE SS

Mobile App: మీరు కొనే వస్తువులు ఒరిజినలా? నకిలీవా? ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు

Mobile App: మీరు కొనే వస్తువులు ఒరిజినలా? నకిలీవా? ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు

Mobile App: మీరు కొనే వస్తువులు ఒరిజినలా? నకిలీవా? ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు (image: Playstore)

Smart Consumer App | ఈ యాప్ సాయంతో మీరు కొన్న వస్తువులు అసలువో, నకిలీవో గుర్తుపట్టొచ్చు. మీరు కొన్న ప్రొడక్ట్‌పైన ఉండే బార్‌కోడ్‌ను ఈ యాప్‌తో స్కాన్ చేయాలి.

  • Share this:
    మార్కెట్‌లో ఏవి అసలు వస్తువులో... ఏవి నకిలీవో గుర్తించడం కష్టమైపోయింది ఈ రోజుల్లో. వాడుకునే వస్తువులు నకిలీవి కంటే డబ్బు నష్టపోతారేమో కానీ... తినే వస్తువులు నకిలీవి తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ముప్పే. అసలు వస్తువుల్ని, నకిలీ ఉత్పత్తుల్ని పక్కపక్కన పెట్టినా గుర్తించడం కష్టం. ఆ స్థాయిలో నకిలీ వస్తువుల్ని తయారు చేస్తున్నారు కేటుగాళ్లు. నకిలీ వస్తువులు కూడా బ్రాండెడ్ ప్రొడక్ట్స్‌ని తలదన్నేలా ఉంటున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ ఉత్పత్తుల్ని గుర్తించే మార్గమే లేదా అన్నది సామాన్యుల సందేహం. ఆ అవకాశం ఉంది. మీరు నకిలీ వస్తువుల్ని సులువుగా గుర్తించొచ్చు. ఇందుకోసం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా-FSSAI కలిసి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మొబైల్ యాప్‌ను తయారు చేయడం విశేషం. ఆ యాప్ పేరు స్మార్ట్ కన్య్యూమర్. అంటే తెలివైన వినియోగదారులని అర్థం. ఈ యాప్‌తో FSSAI లైసెన్స్ సమాచారంతో పాటు లీగల్ మెట్రాలజీ నిబంధనలు, 2011 ప్రకారం ప్రొడక్ట్ సమాచారం తెలుసుకోవడం చాలా సులువు. మరి ఆ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

    Smart Consumer App: స్మార్ట్ కన్య్యూమర్ యాప్ ఎలా వాడాలి?


    Smart Consumer మొబైల్ యాప్‌ను మీరు గూగుల్ ప్లే స్టోర్‌ లేదా యాపిల్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Smart Consumer అని సెర్చ్ చేస్తే యాప్ కనిపిస్తుంది. యాప్ డెవలపర్ GS1 India అని ఉన్న యాప్‌నే డౌన్‌లోడ్ చేయండి. లేదా యాప్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ యాప్ సాయంతో మీరు కొన్న వస్తువులు అసలువో, నకిలీవో గుర్తుపట్టొచ్చు. మీరు కొన్న ప్రొడక్ట్‌పైన ఉండే బార్‌కోడ్‌ను ఈ యాప్‌తో స్కాన్ చేయాలి. ఒకవేళ బార్‌కోడ్ స్కాన్ కాకపోతే బార్‌కోడ్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. మీ ప్రొడక్ట్ పేరు, బ్యాచ్ నెంబర్, ధర, FSSAI లైసెన్స్ నెంబర్ లాంటి వివరాలన్నీ మొబైల్ స్క్రీన్‌ పైన కనిపిస్తాయి. మీ ప్రొడక్ట్ పైన ఉన్న వివరాలను, స్కాన్ చేయగా వచ్చిన వివరాలను పోల్చి చూసుకోవాలి. వివరాలు సరిపోలినట్టైతే అది ఒరిజినల్ ప్రొడక్టే. ఇలా మీరు కొనే ప్రతీ ప్రొడక్ట్‌ని స్కాన్ చేసి ఒరిజనలో, కాదో తెలుసుకోవడం చాలా సులువు. మీరు స్కాన్ చేసిన తర్వాత వివరాలు రాకపోయినా, వచ్చిన వివరాల్లో ఏదైనా తేడా ఉన్నా మీరు నేరుగా అదే యాప్ నుంచి కంప్లైంట్ చేయొచ్చు. మీ కంప్లైంట్‌కు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. రిఫరెన్స్ నెంబర్ ద్వారా మీ కంప్లైంట్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ప్రొడక్ట్ ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వొచ్చు.

    Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    WhatsApp: వాట్సప్ వాడాలంటే డబ్బులు కట్టాలా... ఇందులో నిజమెంత?

    Redmi K20 Pro: గుడ్ న్యూస్... జూలై 17న రెడ్‌మీ కే 20 ప్రో, రెడ్‌మీ కే 20 రిలీజ్

    HDFC Bank: ఆ యాప్‌తో జాగ్రత్త... కస్టమర్లను హెచ్చరిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు