హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

5G Applications: నేటి నుంచే ఇండియాలో 5G.. స్మార్ట్ అంబులెన్స్‌ల నుంచి మిక్స్‌డ్ రియాలిటీ వరకు.. అందుబాటులోకి వచ్చే అదిరే అప్లికేషన్లు ఇవే..

5G Applications: నేటి నుంచే ఇండియాలో 5G.. స్మార్ట్ అంబులెన్స్‌ల నుంచి మిక్స్‌డ్ రియాలిటీ వరకు.. అందుబాటులోకి వచ్చే అదిరే అప్లికేషన్లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలోని సెలెక్టెడ్ సిటీలలో నేటి (అక్టోబర్ 1) నుంచి 5G సేవలు ప్రారంభం కానున్నాయి. 4G కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ వేగంతో ఇంటర్నెట్ డేటాను 5G ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఇంకా ఏమేం 5G అప్లికేషన్లు వస్తాయో ఇప్పుడు చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

భారతదేశంలోని సెలెక్టెడ్ సిటీలలో నేటి (అక్టోబర్ 1) నుంచి 5G సేవలు (5G Services) ప్రారంభం కానున్నాయి. 4G కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ వేగంతో ఇంటర్నెట్ డేటాను 5G ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. అలానే 5G లో-లేటెన్సీ కనెక్టివిటీతో బిలియన్ల కొద్దీ డివైజ్‌లతో రియల్-టైమ్ డేటాను పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. దీంతో 3D హోలోగ్రామ్ కాలింగ్, మెటావర్స్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపడుతుంది. ఇంకా ఏమేం 5G అప్లికేషన్లు (5G Applications) వస్తాయో ఇప్పుడు చూద్దాం.

-ఎడ్యుకేషన్‌ రంగంలో కీలక మార్పులు5G అందుబాటులోకి వచ్చాక యూజర్లు తమ ఇళ్లలో కొత్త ఫర్నీచర్ ఎలా కనిపిస్తుందో చూసుకోవచ్చు. ఇందుకు 5G ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR)ని కంపెనీలు పరిచయం చేయనున్నాయి. హైటెక్ గ్యాడ్జెట్‌లతో కూడిన 5Gతో ఎడ్యుకేషన్‌ను అందించే విధానాన్ని సమూలంగా మార్చేయవచ్చు. మారుమూల ప్రాంతాలలో కూడా లెక్చరర్లను పవర్డ్ హోలోగ్రామ్‌ల ద్వారా హోస్ట్ చేయడం లేదా మిక్స్‌డ్-రియాలిటీ కంటెంట్‌ని తరగతి గదుల్లోకి ప్రత్యక్ష ప్రసారం చేయడం సాధ్యమవుతుంది.

Business Benefits Of 5G: 5జీ నెట్వర్క్ తో వ్యాపార ప్రయోజనాలివే.. ఓ లుక్కేయండి

-అంబులెన్స్‌లో అప్లికేషన్స్: 2022 ప్రారంభంలో ఎయిర్‌టెల్ అపోలో హాస్పిటల్స్, సిస్కోతో కలిసి 5G కనెక్టెడ్ అంబులెన్స్‌ను ప్రదర్శించింది. ఈ అంబులెన్స్‌ ఎమర్జెన్సీ రూమ్‌గా వర్క్ అవుతుంది. ఈ అంబులెన్స్‌ రోగి టెలిమెట్రీ డేటాతో పాటు వారి ముఖ్య అవయవాలకు తీవ్ర గాయాలు ఏమైనా అయ్యాయా? తదితర వివరాలను తెలుసుకొని ఆసుపత్రిలోని వైద్యులు, నిపుణులకు లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. తద్వారా గాయమైన మొదటి 60 నిమిషాలలో డాక్టర్లు రోగిని పరిశీలించి తక్షణ వైద్య సహాయం అందించడం వీలవుతుంది.

New Jobs With 5G: దేశంలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. 5జీ రాకతో భారీగా జాబ్స్ .. వివరాలివే

5G కనెక్టెడ్ అంబులెన్స్‌లో వైద్య పరికరాలు, పేషెంట్ మానిటరింగ్ అప్లికేషన్లు, రోగి ఆరోగ్య డేటాను ఆసుపత్రికి ప్రసారం చేసే టెలిమెట్రీ పరికరాలు ఉంటాయి. అలానే ఆన్‌బోర్డ్ కెమెరాలు, పారామెడిక్ సిబ్బంది కోసం బాడీ కెమెరాలు ఉంటాయి. ఇవన్నీ అల్ట్రా-హై స్పీడ్, లో-లేటెన్సీ 5G నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేస్తారు. ఈ లైఫ్‌సేవింగ్ అప్లికేషన్లు ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ (AR/VR) వంటి టెక్నాలజీలతో లాంచ్ అయ్యాయి.

-ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ వస్తువులు లేదా మరే ఇతర ప్రొడక్ట్స్ తయారీలో సామర్థ్యం, ప్రొడక్టివిటీ ని మెరుగుపరచడానికి.. మానవ లోపాలను తగ్గించడానికి స్మార్ట్ ఫ్యాక్టరీలను రన్ చేయడానికి 5G చక్కగా పనిచేస్తుంది. 5Gతో రోబోటిక్స్ వాడకం ద్వారా ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సాధ్యమవుతుంది. అలానే అటానమస్ కార్లు, 5G ఫేస్ ఐడెంటిటీ పేమెంట్, 3D హోలోగ్రామ్ కాలింగ్, AR మ్యాప్‌లు, రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్స్, డ్రోన్ డెలివరీ, వర్చువల్ షాపింగ్ కూడా అందుబాటులోకి వస్తాయి.

- 5G VR క్లౌడ్ గేమింగ్5G VR క్లౌడ్ గేమింగ్ కాన్సెప్ట్ గేమర్లకు అద్భుతమైన థ్రిల్ ఆఫర్ చేస్తుంది. రిలయన్స్ జియో తన 5G నెట్‌వర్క్‌లో వర్చువల్ రియాలిటీ లేదా VR ఎనేబుల్డ్‌ మల్టీ-ప్లేయర్ క్లౌడ్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఆల్రెడీ టెస్ట్ చేసింది. ఈ ట్రయల్స్‌లో కన్సోల్-ఆధారిత క్లౌడ్ గేమ్‌ల కంటే మరింత మెరుగైన అనుభూతి లభించింది. ఎందుకంటే గేమర్లు వారి VR హెడ్‌సెట్స్‌, గేమింగ్ యాక్సెసరీలను జియో లో-లేటెన్సీ 5G నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేసి స్మూత్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందడం కుదిరింది. ఇక 4G ప్రైస్ కంటే 5జీ ప్రైస్ మరీ ఎక్కువగా ఉండకపోవచ్చని సమాచారం.

Published by:Nikhil Kumar S
First published:

Tags: 5G, 5G Smartphone, 5g technology

ఉత్తమ కథలు