డిక్షనరీ కంటే బరువైన, ఫ్యాన్సీ ఫీచర్లతో కూడిన మొబైల్ ఫోన్ల రోజులు ఇక అయిపోయాయి. స్మార్ట్‌ఫోన్ రంగంలో దూసుకుపోతున్న OPPO కు, చుట్టూ గల కొన్ని ఉత్తమ స్మార్ట్ఫోన్ల కంటే శక్తివంతమైన పనితీరుని అందించగలదని మరోసారి నిరూపించుకునే సమయం వచ్చింది. అద్భుతంగా రూపొందించిన OPPO F17 Pro తో ఇది ఖచ్చితంగా నిరూపించుకుంటుంది.
OPPO F17 Pro మొట్టమొదటిసారిగా వినూత్నమైన విడుదల కార్యక్రమంలో ప్రపంచమంతా గొప్పగా ప్రదర్శించబడినది. వినూత్నమైన స్మార్ట్‌ఫోన్‌తో పాటు లాంచ్ ఈవెంట్‌తో OPPO ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది - ఈ బ్రాండ్ ప్రామాణికమైన ప్రసంగాలకు దూరంగా, సంగీత పరంగా ఒక కొత్త పరికరాన్ని ఇంటికి తీసుకువచ్చింది!
ఇది నిజం. మ్యూజిక్ కాన్సర్ట్ వేడుకతో జరిగిన F17 Pro స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ కార్యక్రమంలో రాఫ్తార్ మరియు హార్డీ సంధులతో సహా సంగీత పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖుల ప్రదర్శనలు కూడా కలవు. ఇదిమాత్రమే కాదు ఈ కార్యక్రమానికి ప్రముఖ టెలివిజన్ నటుడు రిత్విక్ ధంజని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ రకమైన లాంచింగ్ ఆలోచన అందరినీ ఉత్తేజపరచడమే కాకుండా, OPPO అన్నింటికీ ఎంత భిన్నంగా ఉంటుందో మరోసారి చూపించింది. ఈ బ్రాండ్ ఒకవైపు తన వినూత్నమైన ఆలోచనలతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఆకర్షించుకుంటుంది, మరోవైపు ఇటివంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా వినియోగదారులతో తన బంధాన్ని మరింతగా బలపరచుకుంటుంది.
పరికరం విషయానికి వస్తే, Android 10 తో నడిచే OPPO F17 Pro 7.48mm తో నమ్మలేని విధంగా 164 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది! ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ట్రెండ్-సెట్టింగ్ టెక్నాలజీతో, అద్భుతమైన ఫీచర్లతో రూపొందించిన OPPO F17 Pro మీ స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకువెళుతుంది.
ఎంతో సన్నగా, చూడగానే ఆకట్టుకునే ఈ ఫోన్ మీ జేబులో ఎందుకు ఉండాలో మీరే చూడండి.
ఆకట్టుకునే డిజైన్, అద్భుతమైన పనితీరు
ఇప్పుడు ఇది ఒక అద్భుతమైన కలయిక! సన్నగా ఉన్న ఈ ఫోన్ పట్టుకోడం, అలాగే ఉపయోగించడం అంత సులభం కాదని మీరు అనుకోవచ్చు. పరిశ్రమలో మొట్టమొదటి సారిగా వచ్చిన హై-గ్లాస్ విధానాన్ని ఉపయోగించి రూపొందించిన 220° రౌండ్ ఎడ్జ్ డిజైన్ టెక్నీక్ సన్నని రూపాన్ని సమతుల్యం చేసి, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.
ఈ ఫోన్ మ్యాజిక్ బ్లూ, మ్యాట్ బ్లాక్, మెటాలిక్ వైట్ వంటి అద్భుతమైన రంగులలో లభ్యమవుతుంది. దీనిలో మెటాలిక్ వైట్ మాకు మరింత ఆకర్షణీయంగా అనిపించింది. ఈ రంగు మీ ఫోనుకి ప్రత్యేకమైన మెరుపును అందిస్తుంది, అలాగే మీ కళ్ళకు రిఫ్రెష్ అనుభూతిని ఇస్తుంది. ఈ ఫోన్ గనుక మీ చేతిలో ఉన్నట్లయితే అందరి దృష్టి మీపై ఉండడం ఖాయం. దీనిలో మ్యాట్ బ్లూ కలర్ కూడా ప్రీమియం లుక్ అందిస్తుంది కాబట్టి మీరు మీ అభిరుచికి తగిన రంగుని ఎంపిక చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించండి.
మీ నవ్వులను బంధించే కెమెరా
ఒక ఉత్తమ ఫోన్ మీకు ఎటువంటి ఫోటోగ్రఫీ శిక్షణ లేకున్నప్పటికీ మీకు అద్భుతమైన చిత్రాలను అందిస్తుంది. మరియు ఈ విభాగంలో ప్రయత్నించిన ఉత్తమమైన వాటిలో ఇది ఒకటి అని మేము ఖచ్చితంగా చెప్పగలము.
OPPO F17 Pro కెమెరాలో 48MP సెంట్రల్ కెమెరాతో కూడిన అద్భుతమైన క్వాడ్ సెన్సార్ సెటప్, 8MP వైడ్ లెన్స్, రెండు 2MP మోనో సెన్సార్లు కూడా కలవు. ఇదిమాత్రమే కాదు, సెల్ఫీల కోసం, వీడియో కాల్ మాట్లాడడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన డ్యూయల్ పంచ్ హోల్ కెమెరా కలదు, ఇది 16MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క 6 AI- పోర్ట్రెయిట్ కెమెరాలు అద్భుతమైన స్పష్టత మరియు నాణ్యత గల చిత్రాలను అందిస్తుంది. అలాగే దాని ఫ్రంట్ కెమెరాలోని డ్యూయల్ లెన్స్ బొకే మోడ్‌తో మీరు మీ సామాజిక పోస్ట్‌ల కోసం సృజనాత్మక సెల్ఫీలను తీసుకోవచ్చు.
ఇంకా చాలా ఉన్నాయి. AI సూపర్ నైట్ పోర్ట్రెయిట్ ఫీచర్ తక్కువ వెలుతురులో లేదా స్ట్రీట్ల్యాంప్ కింద కూడా అద్భుమైన సెల్ఫీలను అందిస్తుంది. అదే విధంగా AI నైట్ ఫ్లేర్ పోర్ట్రెయిట్ ప్రకాశవంతమైన లైట్ ఎఫెక్ట్‌తో అద్భుతమైన నైట్ పోర్ట్రెయిట్ షాట్లను తీస్తుంది, ఇంకా స్కిన్ టోన్ ను పెంచి, మీ ముఖాన్ని మరింత అందంగా మార్చుకునే అవకాశాన్ని కూడా ఇస్తుంది.
ఒక సంస్థ ఎంతో శ్రద్ధ వహించి మీకోసం ప్రత్యేకంగా ఒక గొప్ప ఉత్పత్తిని రూపొందించిన విషయం మీకు తెలుసు. దాని రెండవ తరంలో AI బ్యూటిఫికేషన్ 2.0 భారతీయ అందాల ప్రాధాన్యత కోసం అనుకూలీకరించబడినది. దీని అర్థం మీరు ప్రతీసారి మరింత సహజవంతమైన చిత్రాలను పొందుతారు.
వీటన్నింటినీ నిర్వహించే అతిపెద్ద బ్యాటరీ
OPPO F17 Pro తో మీరు కేవలం ఒక ఫోన్ మాత్రమే పొందరు; వేగవంతమైన మీ జీవనశైలి కోసం భవిష్యత్తుకై సిద్ధంగా ఉన్న పరికరాన్ని పొందుతారు. 30W VOOC 4.0 ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన ఈ ఫోన్ 5 నిమిషాల ఛార్జింగ్‌తో 5 గంటల టాక్ టైమ్ అందిస్తుంది. అదిమాత్రమే కాదు F17 Pro కేవలం 53 నిమిషాలలో 100% ఛార్జ్ అవుతుంది. ఫోన్ వేడెక్కకుండా అత్యంత వేగంగా, సమర్థవంతంగా ఛార్జింగ్ అందించే వేగవంతమైన ఛార్జ్ టెక్నాలజీని గేమర్లు ఎంతగానో ఇష్టపడతారు. ఈ ధర వద్ద ఇది నమ్మశక్యం కాని నిజం!
ఇప్పుడు స్నేహితులతో సుదీర్ఘ సంభాషణ మధ్య లేదా పనికి సంబంధించిన ముఖ్యమైన కాన్ఫరెన్స్ కాల్స్ మధ్యలో మీ ఫోన్ ఆఫ్ అయిపోతుందనే దానిగురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. సూపర్ పవర్ సేవింగ్ మోడ్ మరియు AI నైట్ ఛార్జింగ్‌తో కూడిన 4,000 mAh బ్యాటరీని మీరు ఎంతగానో ఇష్టపడతారు. అధిక ఛార్జింగ్, ఆప్టిమైజ్ చేయబడిన బ్యాటరీ అవుట్‌పుట్‌తో ఒత్తిడి లేని, సరికొత్త ఫోన్ వినియోగానికి సిద్ధంగా ఉండండి.
సూపర్ పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసినట్లయితే మీ బ్యాటరీని పొదుపుగా వినియోగిస్తుంది. ఇది డిస్ప్లేను బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లోకి మార్చి, 'యూజర్ ప్రీసెట్' ద్వారా వినియోగదారులు ఎంచుకున్న ఆరు యాప్ లను నడుపుతూ 5% బ్యాటరీ లైఫ్ ఉన్నప్పటికీ 14.6 గంటల పాటు నిర్విరామంగా పనిచేస్తుంది.
ప్రతీ స్వైప్‌లో వేగవంతమైన పనితీరు
మీతో పరిగెత్తలేని ఫోన్ గురించి మీరు ఇకపై ఆందోళన చెందవలసిన అవసరం లేదు. OPPO F17 Pro లోని అత్యాధునిక MediaTek Helio P95 AI ప్రాసెసింగ్ యూనిట్ 2.2Ghz కంటే అధికమైన CPU ఫ్రీక్వెన్సీతో 8- కోర్స్ ను వేగవంతం చేస్తుంది.
దీనిలో 2.2GHZ వరకు పనిచేయగల 2 ARM Cortex-A75 ప్రైమ్ కోర్స్ కలవు. వినియోగదారులు దీనిలో లభించే 8GB మెమరీ, 128GB స్టోరేజ్ పవర్ కాంబోతో పాటు దానిని 3-కార్డు స్లాట్ ద్వారా 512GB వరకు విస్తరించుకోవచ్చు.
యాంటీ-లాగ్ అల్గారిథం, లోపాలను కలిగించి, మీ ఫోన్ వేగాన్ని తగ్గించే డేటాను కనుగొని దానిని తొలగిస్తుంది. అంతేకాదు, మీ బైక్‌ను బాగుచేయడానికి గ్రీజ్ వేసేటప్పుడు, వంటచేసే సమయంలో మీ చేతులలో పిండి ఉన్నపుడు కాల్ మాట్లాడవలసి వస్తే మీరు ఫోనుకు 20-50 సెంటీమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కోసం గాలిలో మీ చేతిని ఉపినట్లయితే గాలి తరంగాల ద్వారా సంకేతం చేరడంతో కాల్ మాట్లాడవచ్చు.
అద్భుతమైన డిస్ప్లే అనుభవాన్ని పొందండి
6.4-inch డ్యూయల్ పంచ్-హోల్ FHD+ Super AMOLED డిస్ప్లే ఈ ఫోన్ యొక్క స్క్రీన్ అంతటా ఉంటుంది. 90% పైగా స్క్రీన్-టు-బాడీ నిష్పత్తికి ఆప్టిమైజ్ చేయబడిన ఈ డిస్ప్లే 2400 x 1080 పిక్సెల్ రిజల్యూషన్ అందిస్తుంది. మీడియా, సినిమాలు, మీకు ఎంతో ఇష్టమైన ఆటలు కూడా ఎన్నడూ చూడనంత అద్భుతంగా కనిపిస్తాయి. దీనిలోని ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అన్‌లాక్ 3.0 జిప్పీ 0.3 సెకండ్లలోనే పరికరాన్ని అన్‌లాక్ చేస్తుంది.
ColorOS 7.2 అనుభవాన్ని ఆస్వాదించండి.
అద్భుతమైన డిజైన్ మరియు సహజమైన ఇంటర్ఫేస్తో సన్నని గీతలు, మెరుగైన డిజైన్ మరియు అద్భుతమైన స్పష్టత అనుభవాన్ని పొందుతారు. యాప్స్ సైజ్, షేప్, అమరికల ద్వారా మీ ఫోన్ అందాన్ని అనుకూలీకరించండి. గోప్యతను పాటించడానికి పాస్‌వర్డ్‌ను సంరక్షించే 'యూజర్ స్పేసేస్'తో వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాన్ని వేరు చేయడానికి మల్టీ-యూజర్ మోడ్ మీకు సహాయపడుతుంది.
మీ కళ్ళ గురించి ఎటువంటి చింత లేకుండా మీ ఫోన్లో అద్భుతమైన డిజైనర్ వాల్పేపర్లను ఉపయోగించుకోవచ్చు. OPPO's F17 Pro ఐ కేర్ మోడ్‌తో కూడిన బిల్ట్-ఇన్ డార్క్ మోడ్ రోజంతా కంటికి సౌకర్యవంతంగా ఉండేలా చేస్తుంది. దీనిని సులభంగా అనుకూలీకరించవచ్చు, అలాగే బ్యాటరీ వినియోగాన్ని 38% వరకూ తగ్గిస్తుంది.
అద్భుతమైన ఈ పరికరానికి చెందిన పర్యావరణ వ్యవస్థ
ఈ సంవత్సర ప్రారంభంలో OPPO పూర్తి IoT తో వినియోగదారుల కేంద్రీకృత, ఆధునాతన టెక్ పర్యావరణ వ్యవస్థను భవిష్యత్తు కోసం రూపొందించే ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ సమయంలో కూడా ఈ బ్రాండ్ కేవలం ఒకటి కాదు రెండు అద్భుతమైన పరికరాలను విడుదల చేసింది. అవును మేము మాట్లాడుతున్నది, OPPO వారి అల్ట్రా-క్లియర్ నాయిస్ కాన్సిలేషన్ బ్రాండ్ న్యూ హెడ్‌ఫోన్ గురించే. మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకునే పలు ఫీచర్లతో కూడిన ఈ హెడ్‌ఫోన్ OPPO స్మార్ట్‌ఫోన్‌కు సరైన జోడీ.
ప్రస్తుతం ఈ ధర విభాగంలో OPPO W51 దానిలోని హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్ ఫీచర్ ద్వారా ఎటువంటి శబ్దాలు లేని అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. అంతేకాదు, IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్, బైనరల్ లో-లాటెన్సీ బ్లూటూత్® ట్రాన్స్మిషన్, మరియు ముఖ్యమైన కాల్స్ కోసం ట్రిపుల్ మైక్ నాయిస్ రిడక్షన్ గల ఈ సరికొత్త హెడ్ఫోన్లు 24 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తాయి. ఇవి సమగ్రవంతంగా, అత్యుత్తమ పనితీరుని అందిస్తాయని OPPO వాగ్దానం చేస్తుంది.
ఎంతగానో ఆకట్టుకునే ఈ అద్భుతమైన పరికరాలు, ఈ సంవత్సరం మీరు అప్‌గ్రేడ్ చేసే జాబితాలో అగ్రస్థానంలో ఉండాలి.'
ఈ OPPO F17 Pro ధర కేవలం రూ. 22990 నుండి ప్రారంభమవగా, OPPO Enco W51 ధర రూ. 4999 వద్ద ప్రారంభమవుతుంది. అయితే ఈ ఫోన్ సేల్స్ సెప్టెంబర్ 07 న ప్రారంభమవుతుండగా, వైర్లెస్ హెడ్‌ఫోన్ సేల్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. OPPO F17 Pro ఆఫ్‌లైన్ , Amazon మరియు ఆన్లైన్ స్టోర్లలో కూడా లభిస్తుంది.
ఒకవేళ మీరు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ చూడలేకపోయినట్లయితే, మీరు దానిని ఈ లింక్‌లో చూడవచ్చు. ఈ అద్భుతమైన సరికొత్త OPPO F17 Pro గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది ఒక భాగస్వామ్య ప్రకటన
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.