Home /News /technology /

SINGAPORES SHOPEE GIVING COMPETITION TO AMAZON AND FLIPKART WITH OVER 1 LAKH ORDERS PER DAY SS GH

Shopee: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు పోటీ ఇస్తున్న షాపీ... రోజూ లక్ష ఆర్డర్లు

Shopee: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు పోటీ ఇస్తున్న షాపీ... రోజూ లక్ష ఆర్డర్లు
(ప్రతీకాత్మక చిత్రం)

Shopee: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు పోటీ ఇస్తున్న షాపీ... రోజూ లక్ష ఆర్డర్లు (ప్రతీకాత్మక చిత్రం)

Shopee | అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇ-కామర్స్ కంపెనీలకు (e-commerce) పోటీగా కొత్త ప్లాట్‌ఫామ్ ఇండియాలో దూసుకెళ్తోంది. సింగపూర్‌కు చెందిన షాపీ యాప్ రోజూ లక్షకు పైగా ఆర్డర్స్ పొందుతోంది.

భారత ఈ కామర్స్ రంగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ రెండు సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది షాపీ (Shopee) ఈ-కామర్స్ సంస్థ. ఈ ప్లాట్‌ఫాంలో రూ.499 ధర ఉన్న వాల్ హ్యాంగింగ్ రూ.9కి.. రూ.1,199 ధర ఉన్న డేటా కేబుల్‌ రూ.9కి.. రూ.2,999 విలువైన యాపిల్ లైట్నింగ్ కేబుల్‌ రూ.9కి అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ప్రారంభించిన షాపీ ఇండియా యాప్‌లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని కొందరు బ్లాగర్లు చెబుతున్నారు. సింగపూర్‌కు చెందిన షాపీ నెల కిందట ‘జీరో ఫ్యాన్ ఫేర్’ సేల్స్‌ను లాంచ్ చేసింది. ఈ డిస్కౌంట్ సేల్ ద్వారా షాపీ ఈ -కామర్స్ మార్కెట్లోకి వినియోగదారులను వేగంగా ఆకట్టుకుంది. కొన్ని వారాల్లోనే రోజుకు లక్ష ఆర్డర్లను సంపాదించింది.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి పది లక్షలకుపైగా యాప్ డౌన్‌లోడ్స్‌ను సంస్థ నమోదు చేసింది. ఈ రంగంలో దిగ్గజ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు రోజుకు సగటున 20 లక్షల నుంచి 25 లక్షల ఆర్డర్లను పొందుతున్నాయని పరిశ్రమ వర్గాల ద్వారా తెలుస్తోంది. అమెజాన్, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్, మీషోలకు షాపీ సంస్థ త్వరలో బలమైన పోటీదారుగా ఉద్భవించే అవకాశం కనిపిస్తోంది. మన దేశంలో 57.2 కోట్ల ఇంటర్నెట్ యూజర్లలో ప్రస్తుతం పది కోట్ల మంది మాత్రమే ఆన్‌లైన్‌లో ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. 2020 నాటికే ఈ పరిశ్రమ రూ.2.25 లక్షల కోట్లకు చేరుకుందని బైన్, సీక్వోయా క్యాపిటల్ నివేదిక వెల్లడించింది.

Nothing Ear 1 TWS: గుడ్ న్యూస్... నథింగ్ ఇయర్ 1 టీడబ్ల్యూఎస్ ధర తగ్గింది... ఆఫర్ కొద్ది రోజులే

షాపీ ఇండియా అనేక ఆఫర్లను ప్రకటించింది. రూ.99, అంతకంటే తక్కువ ధరకే యాక్ససరీస్ విక్రయిస్తోంది. ఫ్యాషన్ దుస్తులపై 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. షాపీ ఇండియా యాప్‌లో ఎలుకల స్టిక్కీ ట్రాప్‌ల నుంచి ఇత్తడి నెక్లెస్‌లు, కిట్టి మొబైల్ కవర్ల వంటి అన్ బ్రాండెడ్ వస్తువులతోపాటు, భారతదేశంలో ఎలక్ట్రానిక్, స్మార్ట్‌ఫోన్‌ల వంటి పాపులర్ కేటగిరీలపై అనేక ఆఫర్లను ప్రకటించింది.

ఆర్డర్ వాల్యూమ్‌లు రెట్టింపు చేయడంపై షాపీ (Shopee) దృష్టి సారించింది. రోజుకు నాలుగు విడతలుగా ఆఫర్లపై అమ్మకాలు సాగిస్తోంది. మధ్యాహ్నం గం.12, రాత్రి గం.12, సాయంత్రం గం.4, రాత్రి గం.8 ఆఫర్లలో రూ.9 నుంచి రూ.49,రూ.99,రూ.199 ధరల్లో వివిధ ఉత్పత్తులను విక్రయిస్తోంది. విక్రేతలకు ఎలాంటి కమిషన్ అందించడం లేదు. వినియోగదారుల నుంచి షిప్పింగ్ ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఈ కామ్ ఎక్స్‌ప్రెస్‌తో షాపీ డెలివరీ భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. అయితే దీనిపై ఈ కామ్ ఎక్స్‌ప్రెస్‌ స్పందించలేదు.

Budget Smartphones: రూ.10 వేలలోపు స్మార్ట్​ఫోన్​ కోసం చూస్తున్నారా? 8 బెస్ట్​ బడ్జెట్​ మొబైల్స్ ఇవే

‘‘షాపీ అనేది సీ (Sea) అనే సింగపూర్ కంపెనీలో భాగం. మా కార్యకలాపాలు ప్రారంభ దశలో ఉన్నాయి. కొన్ని అంశాలు చర్చించడం తొందరపాటు అవుతుంది. మా స్థానిక సిబ్బంది ప్రజల అవసరాలను అర్థం చేసుకోవడంపై దృష్టి సారించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ఉపయోగించుకుంటూ గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ద్వారా చిరు వ్యాపారులకు ఎలా సహాయం చేయగలమనే అంశంపై దృష్టి సారించాం. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌కు సహకరిస్తూనే, భారత డిజిటల్ ఎకానమీ మిషన్‌లో భాగస్వామిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని షాపీ సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

షాపీ భారత వ్యాపారానికి అంకిత్ ఉపాధ్యాయ్ నాయకత్వం వహిస్తున్నట్టు అతని లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది. 2020లో థాయ్‌లాండ్‌లో సప్లై చైన్ మేనేజ్‌మెంట్ హెడ్‌గా చేరారు. మనదేశం నుంచి చిన్న టీమ్ నడుపుతున్నాడు. వచ్చే ఆరు నెలల్లో వ్యాపారాన్ని ఐదు నుంచి ఏడు రెట్లు పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రకటనలు గుప్పించడం ద్వారా భారతదేశంలో వ్యాపారాన్ని వృద్ధి చేయాలని షాపీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంస్థ భారతదేశంలో భారీగా సిబ్బందిని నియమిస్తోంది. రిక్రూట్మెంట్ సైట్లలో మార్కెటింగ్ అసోషియేట్స్, క్యాంపెయిన్ మేనేజర్స్, కంటెంట్ రైటర్స్ కావాలని ప్రకటనలు ఇస్తోంది.

SBI Alert: సంవత్సరానికి ఓసారి రూ.342 చెల్లిస్తే చాలు... రూ.4,00,000 విలువైన బెనిఫిట్స్

షాపీ చరిత్ర


షాపీని 2015లో సింగపూర్‌లో ప్రారంభించారు. ఆ తరువాత సౌత్ ఈస్ట్, ఈస్ట్ ఆసియా దేశాలతోపాటు ఐరోపా, లాటిన్ అమెరికా అంతటా విస్తరించారు. 2021 సెప్టెంబరు త్రైమాసికంలో ఇది 170 కోట్ల ఆర్డర్ల ద్వారా రూ.1,26,000 కోట్ల విలువైన వ్యాపారం నిర్వహించింది. అయితే మనదేశంలో షాపీ ప్రయాణం సాఫీగా సాగే అవకాశం లేదు. చైనా కంపెనీల తరహాలో షాపీ కూడా భారత ట్రేడర్ల హిట్ లిస్టులో చేరే అవకాశం ఉంది. సంప్రదాయ వ్యాపారులకు షాపీ వల్ల భారీ షాక్ తగిలే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (Confederation of All India Traders)అభిప్రాయపడింది. ‘‘విదేశీ నిధులతో ఇ కామర్స్ కంపెనీల అన్యాయమైన వాణిజ్య పద్దతుల నుంచి దేశీయ వ్యాపారులు ఇంకా కోలుకోలేదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(Confederation of All India Traders)అభిప్రాయపడింది.

SBI ATM Card: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఉందా? లక్ష రూపాయల లోన్ ఇస్తున్న బ్యాంక్

కంపెనీలో చైనా పెట్టుబడి 25 శాతం ఉంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు ఫారెస్ట్ లీ కూడా చైనీయుడే. అయితే కొన్ని సంవత్సరాల కిందట సింగపూర్లో స్థిరపడ్డాడు. డేటాను స్టోర్ చేయడానికి ఈ సంస్థ చైనాకు చెందిన సీ టెన్సెంట్ క్లౌడ్ సేవలను ఉపయోగించుకుంటుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జాతీయ కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో ఆరోపించారు. దీనికి తోడు షాపీ పేరుతో స్పిన్ (SPINN) ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న సైట్లను, యాప్ లను బ్లాక్ చేయాలని ఢిల్లీ హైకోర్టులో నవంబరు 15న ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దేశ భద్రత, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు దీని వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పిటిషనర్ శశాంక్ శేఖర్ ఝూ తెలిపారు. ఇన్ని అడ్డంకులు ఎదుర్కొని.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ దిగ్గజాలను షాపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Santhosh Kumar S
First published:

Tags: Amazon, AMAZON INDIA, Flipkart, Online shopping

తదుపరి వార్తలు