హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Shorts On TV: టిక్‌టాక్‌కు పోటీగా యూట్యూబ్ కొత్త ఫీచర్.. టీవీల్లో  స్ట్రీమింగ్ అప్‌డేట్ లాంచ్‌..

Shorts On TV: టిక్‌టాక్‌కు పోటీగా యూట్యూబ్ కొత్త ఫీచర్.. టీవీల్లో  స్ట్రీమింగ్ అప్‌డేట్ లాంచ్‌..

Shorts On TV: టిక్‌టాక్‌కు పోటీగా యూట్యూబ్ కొత్త ఫీచర్.. టీవీల్లో  స్ట్రీమింగ్ అప్‌డేట్ లాంచ్‌..

Shorts On TV: టిక్‌టాక్‌కు పోటీగా యూట్యూబ్ కొత్త ఫీచర్.. టీవీల్లో  స్ట్రీమింగ్ అప్‌డేట్ లాంచ్‌..

గూగుల్ యూట్యూబ్ షార్ట్స్‌ను టీవీలో మంచి ఎక్స్‌పీరియన్స్‌తో చూసేందుకు వీలుగా ఒక యాప్ అప్‌డేట్‌ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తోంది. ఈ టీవీ యాప్ అప్‌డేట్‌తో స్మార్ట్ టీవీలలో షార్ట్స్ సరికొత్తగా, అట్రాక్టివ్‌గా కనిపించనున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్(YouTube), ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. స్మార్ట్ టీవీలలో కూడా యూట్యూబ్ వీడియోలు ఎంజాయ్ చేస్తున్న వారెందరో! అయితే మొబైల్స్‌లో చూడగల షార్ట్స్ (Shorts), టీవీలో చూస్తున్నప్పుడు మంచి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ దొరకడం లేదు. అందుకే తాజాగా గూగుల్ యూట్యూబ్ షార్ట్స్‌ను టీవీలో మంచి ఎక్స్‌పీరియన్స్‌తో చూసేందుకు వీలుగా ఒక యాప్ అప్‌డేట్‌ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్(Release) చేస్తోంది. ఈ టీవీ యాప్ అప్‌డేట్‌తో స్మార్ట్ టీవీలలో షార్ట్స్(Shorts) సరికొత్తగా, అట్రాక్టివ్‌గా కనిపించనున్నాయి. మరికొద్ది వారాల్లో స్మార్ట్ టీవీ(Smart TV) యూజర్లందరికీ ఈ అప్‌డేట్‌ రానుంది.

సాధారణంగా 60 సెకన్లలోపు నిడివి గల యూట్యూబ్ షార్ట్స్ వెర్టికల్ వీడియో ఫార్మాట్‌తో ప్లే అవుతాయి. టీవీలు ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో మాత్రమే బెస్ట్ పిక్చర్ చూపిస్తాయి. అందువల్ల, టీవీలో చూసినప్పుడు షార్ట్‌ వీడియోలకు ఇరువైపులా చాలా ఖాళీ స్థలం కనిపిస్తోంది. అలాగే షార్ట్ వీడియోలను మొబైల్‌లో లాగా పైకి కిందకి స్క్రోల్ చేయడం కుదరడం లేదు. అయితే షార్ట్స్ ప్లే అవుతున్నప్పుడు కనిపించే ఖాళీ స్థలాన్ని గూగుల్ తొలగించి ఇప్పుడు రీడిజైన్డ్‌ యూఐ అందిస్తోంది. అంటే షార్ట్స్‌ రీడిజైన్డ్‌ UIతో పెద్ద టీవీ స్క్రీన్‌ మధ్యలో వైట్ బోర్డర్‌లైన్‌తో ప్లే అవుతాయి. షార్ట్ క్లిప్ మెయిన్ కలర్ ఆధారంగా వాటి బ్యాక్‌గ్రౌండ్ లేదా సైడ్స్‌లో థీమ్ రంగులు మారతాయి. ఒకవేళ షార్ట్ వీడియోలో బ్రౌన్ కలర్ కనిపిస్తే దాని సైడ్స్‌లో బ్రౌన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తుంది.

Job Vacancies: వేతనం రూ.76వేలు.. ఉద్యోగం సొంత జిల్లాల్లో.. ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా..?

షార్ట్‌కి కుడి వైపున వీడియో క్లిప్‌లో టైటిల్, క్రియేటర్, ఏ సౌండ్ ఉపయోగించారో డిస్‌ప్లే అవుతుంది. ఈరోజు విడుదలవుతున్న డిజైన్‌తో పాటు భవిష్యత్తు రిలీజ్‌లలో ఎక్స్‌ట్రా ఫంక్షన్స్ తీసుకురావాలని చూస్తున్నట్లు ఒక యూట్యూబ్ అధికారి పేర్కొన్నారు. టీవీ స్క్రీన్‌కి తగినట్టు షార్ట్స్ ప్లే అయ్యేలా అప్‌డేట్స్ కూడా తీసుకొస్తామన్నారు. అప్‌డేటెడ్ యూట్యూబ్ స్మార్ట్ టీవీ యాప్ ఇప్పుడు యూజర్లు పాపులర్ వర్టికల్ వీడియోలను ఆప్టిమైజ్డ్‌ మోడ్‌లో చూపిస్తాయి.

మరికొద్ది వారాల్లోగా ఈ రీడిజైన్డ్‌ షార్ట్స్ మోడ్ 2019, ఆ తర్వాత టీవీ మోడల్స్‌, కొత్త గేమ్ కన్సోల్‌లలో అందుబాటులోకి వస్తుంది. షార్ట్‌పై నేరుగా క్లిక్ చేయడం ద్వారా లేదా రిమోట్ కంట్రోల్‌లోని ప్లే, పాజ్ బటన్‌లను ఉపయోగించడం ద్వారా షార్ట్ వీడియోని ప్లే చేయవచ్చు. టీవీ స్క్రీన్‌పై షార్ట్-ఫామ్ వర్టికల్ వీడియోలను తీసుకొచ్చే మొదటి వీడియో సర్వీస్ యాప్ యూట్యూబ్ కాదు. టిక్‌టాక్ కొంతకాలంగా స్మార్ట్ టీవీ ఇంటర్‌ఫేస్‌లతో ప్రయోగాలు చేస్తోంది. యూట్యూబ్ చాలా డిజైన్స్ టెస్ట్ చేసి ఇప్పుడు ఒక బెస్ట్ డిజైన్ రోలవుట్ చేస్తోంది.

యూట్యూబ్ స్మార్ట్ టీవీ యూజర్స్ క్రియేటర్స్ ఛానెల్ నుంచి షార్ట్‌లను చూడవచ్చు. అందుకు క్రియేటర్స్ కోసం వెతికి వారి యూట్యూబ్ ఛానెల్ ప్రొఫైల్‌పై క్లిక్ చేసి Shorts చూసుకోవచ్చు. లేదంటే యూట్యూబ్‌ యాప్ హోమ్‌పేజీలో వీడియోస్ స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే షాట్స్ అనే టాప్ కనిపిస్తుంది అక్కడినుంచి షార్ట్స్ ప్లే చేసుకోవచ్చు. ఒక షాట్ ప్లే చేసినప్పుడు అది కంటిన్యూగా ప్లే అవుతూనే ఉంటుంది. దాన్ని రిమోట్ కంట్రోల్ తో పాజ్ చేయవచ్చు. లేదంటే రిమోట్‌లో అప్, డౌన్ బటన్స్ నొక్కుతూ వేరే షార్ట్స్‌ చూసుకోవచ్చు.

First published:

Tags: Shorts, Tiktok, Youtube, Youtuber

ఉత్తమ కథలు