TikTok: టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలంటున్న మెజార్టీ యూత్... సర్వేలో వెల్లడి

TikTok Ban | యువతలో పోర్నోగ్రఫిని ఎంకరేజ్ చేసే విధంగా ఉన్న టిక్‌టాక్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయాలని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించిన తరువాత నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

news18-telugu
Updated: April 10, 2019, 12:15 PM IST
TikTok: టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలంటున్న మెజార్టీ యూత్... సర్వేలో వెల్లడి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 10, 2019, 12:15 PM IST
మన దేశ యువతలో కొత్త కొత్త యాప్స్ పట్ల క్రేజ్ ఎక్కువగా ఉంటుందనే విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కారణంగానే టిక్‌టాక్ యాప్‌ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధించింది. చైనా కంపెనీకి చెందిన ఈ యాప్‌ను ఇండియాలోని యువత ఎక్కువగా వాడుతున్నారు. అయితే తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో టిక్‌టాక్ పట్ల దేశ యువత ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారనే అంశంపై ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి పదిమందిలో ఎనిమిది మంది చైనాకు చెందిన టిక్‌టాక్ వీడియో యాప్‌ను బ్యాన్ చేయాలని కోరుకుంటున్నారని సర్వేలో తేలింది న్యూస్ యాప్ ఇన్‌షార్ట్స్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

యువతలో పోర్నోగ్రఫిని ఎంకరేజ్ చేసే విధంగా ఉన్న టిక్‌టాక్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయాలని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించిన తరువాత నిర్వహించిన సర్వేలో ఈ రకమైన అభిప్రాయం వ్యక్తమైంది. సామాజిక బాధ్యత కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌పై నిషేధం విధించాల్సిన అవసరం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే టిక్‌టాక్ మాత్రం తాము స్థానిక చట్టాలకు పూర్తిగా లోబడి వ్యవహరిస్తున్నామని తెలిపింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన అధికారిక కాపీలు అందిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

సర్వేలో 30 వేల మంది అభిప్రాయాలను తీసుకున్నారు. టైర్ 1, టైర్ 2 నగరాలకు చెందిన 18 నుంచి 35 ఏళ్ల వయసున్న యువతీయువకుల్లో ఎక్కువమంది టిక్‌టాక్‌ను ఇండియాలో బ్యాన్ చేయాలని కోరారు. మొత్తానికి ఈ సర్వేలో 80 శాతం మంది టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది యూజర్లు ఉన్న టిక్‌టాక్‌కు భారత్‌లో 5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో దాదాపు 43 శాతం కొత్తగా టిక్‌టాక్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నట్టు సెన్సార్ టవర్ ఫౌండర్ ఓలివర్ యేహ్ తెలిపారు.



First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...