హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Swachh City: స్వచ్ఛ్ సిటీ ప్లాట్‌ఫామ్ హ్యాక్.. రిస్క్‌లో 1.6 కోట్ల మంది డేటా.. ర్యాన్సమ్‌వేర్ అటాక్స్‌ ముప్పు..

Swachh City: స్వచ్ఛ్ సిటీ ప్లాట్‌ఫామ్ హ్యాక్.. రిస్క్‌లో 1.6 కోట్ల మంది డేటా.. ర్యాన్సమ్‌వేర్ అటాక్స్‌ ముప్పు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Swachh City: భారత ప్రభుత్వానికి చెందిన స్వచ్ఛ్.సిటీ (Swachh.city) ప్లాట్‌ఫామ్‌ హ్యాకింగ్‌కు గురైంది. ఇటీవల ఒక హ్యాకర్ 1.6 కోట్ల స్వచ్ఛ్.సిటీ యూజర్ల డేటాను ప్రముఖ ఫైల్-హోస్టింగ్ ప్లాట్‌ఫామ్‌లో లీక్ చేశారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారత ప్రభుత్వానికి చెందిన స్వచ్ఛ్.సిటీ (Swachh.city) ప్లాట్‌ఫామ్‌ హ్యాకింగ్‌కు గురైంది. ఇటీవల ఒక హ్యాకర్ 1.6 కోట్ల స్వచ్ఛ్.సిటీ యూజర్ల డేటాను ప్రముఖ ఫైల్-హోస్టింగ్ ప్లాట్‌ఫామ్‌లో లీక్ చేశారు. ఈ విషయాన్ని సింగపూర్‌కి చెందిన క్లౌడ్‌సెక్ (CloudSEK) అనే థ్రెట్ ఇంటెలిజెన్స్ టీమ్ తాజాగా కనిపెట్టింది. డార్క్ వెబ్‌లో శాంపిల్ డేటాను కూడా హ్యాకర్ పోస్టు చేశాడు. ఇందులో యూజర్ల రిజిస్టర్డ్‌ ఈమెయిల్ అడ్రస్‌లు, పాస్‌వర్డ్ హ్యాష్‌లు, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్లు, OTP ఇన్ఫో, లాగిన్ IPs, ఇండివిడ్యువల్ యూజర్ టోకెన్లు, బ్రౌజర్ వేలిముద్రలు ఉన్నట్టు క్లౌడ్‌సెక్ సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు. 1.25 గిగాబైట్ల సైజు ఉన్న ఈ డేటా లీక్ కావడంతో యూజర్లు రిస్క్‌లో పడినట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.

స్వచ్ఛ్.సిటీ ప్లాట్‌ఫామ్‌ను గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి స్వచ్ఛ్ భారత్ మిషన్ ప్రారంభించింది. అయితే హ్యాక్‌కి గురైన 1.6 కోట్ల స్వచ్ఛ్.సిటీ యూజర్ల పర్సనల్ డేటా తప్పుడు చేతుల్లో పడొచ్చని క్లౌడ్‌సెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. డీప్ వెబ్ ఫోరమ్‌లలో లీక్‌బేస్ (LeakBase), చుకీ, చుకీస్, స్క్‌ల్రిప్ నిక్‌నేమ్స్ వాడుతున్న హ్యాకర్ ఈమెయిల్ అడ్రస్‌లు, హ్యాష్డ్‌ పాస్‌వర్డ్‌లు, యూజర్ ఐడీల వంటి పర్సనల్ ఐడెంటిటీ ఇన్ఫర్మేషన్ (PII) ఉన్న డేటాబేస్‌ను షేర్ చేశాడని రీసెర్చర్లు పేర్కొన్నారు.

లీక్‌బేస్ అనేది తరచుగా ఆర్థిక లాభం కోసం సైబర్ అటాక్స్ చేస్తుంది. డార్క్ వెబ్‌లోని దాని మార్కెట్‌ప్లేస్ ఫోరమ్‌లో డేటాను అమ్ముకుంటుంది. లీక్‌బేస్ కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ల (CMS) అడ్మిన్ ప్యానెల్స్‌, సర్వర్లకు కూడా యాక్సెస్‌ను అందిస్తుంది.

"ఫోన్ నంబర్లు, ఈమెయిల్ అడ్రస్‌ల వంటి పర్సనల్ వివరాలను అమ్ముతామని హ్యాకర్లు ప్రచారం చేస్తున్నారు. అది యూజర్లకు ఏదో ఒక పెద్ద హాని తలపెట్టే అవకాశం ఉంది" అని డిజిటల్ రిస్క్ మానిటరింగ్ ప్లాట్‌ఫామ్ క్లౌడ్‌సెక్ తెలిపింది. ఈ సమాచారాన్ని ఫిషింగ్ అటాక్స్‌ చేయడానికి, స్వచ్ఛ్ సిటీ నుంచి ఫేక్ బ్రీచ్ నోటీసు ఈమెయిల్స్‌ పంపించడానికి వాడొచ్చు. అలాగే మరింత సున్నితమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి సోషల్ ఇంజనీరింగ్ కోసం ఈ డేటా ఉపయోగించవచ్చు. Ransomware అటాక్స్‌ చేయడానికి కూడా ఈ డేటా హెల్ప్ అవుతుంది. ఈ సమాచారాన్ని సైబర్ క్రైమ్ ఫోరమ్‌లలో లీడ్స్‌గా విక్రయించవచ్చు.

ఇది కూడా చదవండి : రండి బాబూ రండి.. బెంగళూరులో హెలికాప్టర్ బుకింగ్ సేవలు.. టికెట్ కాస్ట్ ఎంతంటే..

* ఎలా జాగ్రత్త పడాలి

ప్రస్తుతం స్వచ్ఛ్.సిటీ యూజర్లు తమను తాము సురక్షితంగా ఉంచుకోవడం తప్పనిసరి అని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూజర్లు తమ అన్ని అకౌంట్లకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్ మెథడ్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. అలానే లాగిన్‌ల అంతటా మల్టీ-ఫాక్టర్ అథెంటికేషన్ (MFA)ను ఎనేబుల్ చేయాలని సలహా ఇస్తున్నారు. ప్రజలు తమ అకౌంట్స్‌లో ఏదైనా తేడాగా కనిపిస్తుందా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.

Published by:Sridhar Reddy
First published:

Tags: Cyber Attack, Data theft, Hacking, Singapore

ఉత్తమ కథలు