హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Gmail Without Internet: జీమెయిల్ వాడుతున్నారా..? ఇంటర్నెట్ లేకుండానే ఈమెయిల్ ఇలా సెండ్ చేయండి..

Gmail Without Internet: జీమెయిల్ వాడుతున్నారా..? ఇంటర్నెట్ లేకుండానే ఈమెయిల్ ఇలా సెండ్ చేయండి..

Gmail Without Internet

Gmail Without Internet

Gmail Without Internet: ఇంటర్నెట్ లేకపోయినా ఈ-మెయిల్ పంపించే ఒక అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది గూగుల్. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఈమెయిల్ సర్వీసుల కోసం ఎక్కువ మంది ఉపయోగించేది జీమెయిల్ (Gmail) అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఉద్యోగులు (Employees), విద్యార్థులు (Students) ఇలా ప్రతి ఒక్కరూ ముఖ్యమైన మెసేజ్‌లు పంపించడానికి లేదా డాక్యుమెంట్స్ షేర్ చేయడానికి జీమెయిల్ పైనే ఆధారపడుతున్నారు. అయితే జీమెయిల్ ద్వారా ఈమెయిల్ (Email) పంపించాలంటే యాక్టివ్ ఇంటర్నెట్ (Internet) కనెక్షన్ ఉండటం తప్పనిసరి. ఏదైనా ఇంపార్టెంట్ మెయిల్ పంపాలనుకున్నప్పుడు సమయానికి ఇంటర్నెట్ లేకపోతే ఇబ్బందులు తప్పవు. అందుకే గూగుల్ ఇంటర్నెట్ లేకపోయినా (Without Internet) ఈ-మెయిల్ పంపించే ఒక అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్ (Enable Offline Mail) అని పిలిచే ఈ ఫీచర్ టర్న్ ఆన్ చేసుకుంటే ఇంటర్నెట్ లేకుండా కొత్త ఈ-మెయిల్స్‌ను పంపించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఆఫ్‌లైన్‌లో జీమెయిల్ ద్వారా ఈమెయిల్ పంపడం ఎలా

స్టెప్ 1: మీ మ్యాక్, లైనక్స్‌ లేదా విండోస్ పీసీలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. ఈ బ్రౌజర్ లేకపోతే దానిని డౌన్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత బ్రౌజర్‌లో మీ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న సెట్టింగ్స్‌ ఐకాన్ పైన నొక్కాలి. పాప్-అప్ మెనూలో "సీ ఆల్ సెట్టింగ్స్‌ (See All Settings)" పై ట్యాప్ చేయాలి.

స్టెప్ 2: ఇప్పుడు మీకు స్క్రీన్ పైన నావిగేషన్ బార్‌లో జనరల్, ఇన్‌బాక్స్‌ వంటి చాలా ట్యాబ్స్ కనిపిస్తాయి. వాటిలో "ఆఫ్‌లైన్" ట్యాబ్‌కు వెళ్లాలి.

స్టెప్ 3: ఈ పేజీలో జీమెయిల్ కోసం ఆఫ్‌లైన్ మోడ్‌ను ఆన్ చేయడానికి “ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్” అనే ఆప్షన్‌ను ఆన్ చేయాలి. ఇందుకు ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్ బాక్స్‌లో చెక్/టిక్ మార్క్ పెట్టాలి.

స్టెప్ 4: ఆఫ్‌లైన్ మోడ్ ఆన్‌ చేసినప్పుడు, జీమెయిల్ మీ న్యూ ఈమెయిల్స్‌ను ఆఫ్‌లైన్ యాక్సెస్ కోసం ఆటోమేటిక్‌గా సింక్ చేస్తుంది. వాటిని 7 రోజుల నుంచి 90 రోజుల వరకు మీరు స్టోర్ చేసుకొని ఆఫ్‌లైన్ యాక్సెస్ చేయవచ్చు. ఈ సమయాన్ని ఎంచుకోవాలి.

స్టెప్ 4: తర్వాత కింద కనిపించే " సేవ్ చేంజెస్ (Save Changes)" బటన్‌పై క్లిక్ చేయాలి. అంతే! ఇక నుంచి మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నా ఇన్‌బాక్స్‌ని చెక్ చేయవచ్చు. చదవని ఈమెయిల్‌లను ఓపెన్ చేయొచ్చు. అలాగే కొత్త మెసేజెస్ పంపించవచ్చు.

First published:

Tags: GMAIL, Tech news, Technology

ఉత్తమ కథలు