Home /News /technology /

BSNL కస్టమర్లకు భారీ షాక్.. డిసెంబర్ 1 నుంచి ఆ ప్లాన్లు అన్నీ బంద్.. వివరాలివే

BSNL కస్టమర్లకు భారీ షాక్.. డిసెంబర్ 1 నుంచి ఆ ప్లాన్లు అన్నీ బంద్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌(BSNL) వినియోగదారులకు షాకిచ్చింది. లైఫ్‌టైం ప్రీపెయిడ్ ప్లాన్‌లను (BSNL Prepaid Plans) నిలిపివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఆ ప్లాన్‌లు నిలిచిపోతాయని బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
మీరు బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) నెట్‌వర్క్ వాడుతున్నారా? లైఫ్‌టైం ప్రీపెయిడ్ ప్లాన్‌లతో (BSNL Lifetime Prepaid Plans) చక్కటి బెనిఫిట్స్ పొందుతున్నారా? అయితే మీకొక ఒక బ్యాడ్ న్యూస్. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తన లైఫ్‌టైం ప్రీపెయిడ్ ప్లాన్‌లను నిలిపివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. 2021, డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అన్ని లైఫ్‌టైం ప్రీపెయిడ్ ప్లాన్‌(Prepaid Plan) లు నిలిచిపోతాయని బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఉన్న కస్టమర్లను రూ. 107 పర్ మినిట్ ప్రీమియం ప్లాన్‌కు మారుస్తామని వెల్లడించింది. లైఫ్‌టైం ప్రీపెయిడ్ ప్లాన్‌లు తీసుకున్న కస్టమర్లందరూ ఐదు రోజుల్లోగా రూ.107 ప్లాన్‌కు ఆటోమేటిక్‌గా మారిపోతారు. లైఫ్‌టైం ప్రీపెయిడ్ ప్లాన్‌లు కస్టమర్లకు అతి తక్కువ టారిఫ్‌/ఛార్జితో ప్రయోజనాలను అందించాయి. కానీ ఇప్పుడు అవి రూ.107 ప్లాన్‌కి స్విచ్ అవుతాయి.

ఆదాయం భారీగా పెంచుకునేందుకు భారతదేశంలోని టెలికాం సంస్థలు రీఛార్జ్ ప్లాన్ల రేట్లను భారీ ఎత్తున పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా రెవెన్యూ పెంచుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా లైఫ్‌టైం ప్రీపెయిడ్ ప్లాన్‌లను నిలిపివేస్తోంది. రూ.107 ప్లాన్ అనేది అపరిమిత ఇన్‌కమింగ్ కాల్‌లతో మొత్తం 90 రోజుల వ్యాలిడిటీని ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్‌తో వచ్చే 10జీబీ డేటాను 30 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు.
Vodafone Idea: పెరిగిన వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు... నేటి నుంచే అమలు

అదనంగా 100 నిమిషాల అవుట్‌గోయింగ్ కాల్‌లను 24 రోజుల పాటు యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్లాన్‌తో కస్టమర్‌లు కొన్ని ఉచిత బెనిఫిట్స్‌ను (freebies- ఫ్రీబీస్‌) పొందవచ్చు. 60 రోజుల పాటు ఫ్రీగా బీఎస్‌ఎన్‌ఎల్‌ డిఫాల్ట్ ట్యూన్స్ పొందవచ్చు. 3జీబీ ఉచిత డేటాను 84 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు. అయితే లైఫ్‌టైమ్ ప్రీపెయిడ్ నుంచి రూ.107 ప్లాన్‌కి మైగ్రేట్ అయ్యే యూజర్‌లు ఫ్రీబీలను యాక్సెస్ చేయలేరు.
Airtel Tariff Hike: ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్... పెరగనున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు

గ్రేస్ పిరియడ్ లో కస్టమర్లు యాక్టివ్ గా మారాలనే లక్ష్యంతో ఈ ఏడాది ప్రారంభంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్రమోషన్ ప్లాన్లను తీసుకొచ్చింది. అంతేకాదు, రూ.2399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీని అదనంగా మరో 60 రోజులకు పెంచింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఇప్పుడు 425 రోజులు. ఈ ప్లాన్ రోజుకు 3జీబీ, ఆ తర్వాత 80 kbps వేగంతో అన్లిమిటెడ్ డేటాను అందిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్లకు ఫ్రీ యాక్సెస్ తో పాటు 425 రోజులు పాటు ఈరోస్ నౌ(Eros Now) కంటెంట్ ఉచితంగా చూడవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: BSNL, Recharge, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు