వాట్సాప్ అకౌంట్ల బ్యాన్.... ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే టాపిక్ హల్చల్ చేస్తోంది. ఈ ఏడాది జూన్ 16 నుంచి జులై 31 వరకు సుమారు 30 లక్షల అకౌంట్లను వాట్సాప్ బ్యాన్ (WhatsApp Accounts Ban) చేసిందట. వాట్సాప్ (WhatsApp) ఇటీవల విడుదల చేసిన ట్రాన్స్పరెన్సీ రిపోర్టు లెక్కలు చెబుతున్న విషయం ఇదీ. ఆగస్టు 31న ఈ నివేదిక విడుదలైంది. ఆ అకౌంట్లను ఎందుకు బ్యాన్ చేశారు, ఎవరివి బ్యాన్ చేశారు అనే వివరాలను వాట్సాప్ తెలిపింది. వాట్సాప్ బ్యాన్ చేసిన ఖాతాల్లో 95 శాతం వరకు ఆటోమేటెడ్ మెసేజింగ్‌ను నిర్వహిస్తున్నాయట. అంటే మనుషుల ప్రమేయం లేకుండా సాంకేతికత ద్వారా ఆ అకౌంట్లను నిర్వహిస్తున్నారని అర్థం.
వాట్సాప్‌లో స్పామ్‌ను (WhatsApp Spam) నిరోధించే చర్యల్లో భాగంగానే ఈ ఖాతాలను తొలగించినట్లు సంస్థ చెబుతోంది. ఆటోమేటడ్ వినియోగం వల్ల స్పామ్ మెసేజ్‌లు పెరిగిపోతున్నాయి. వీటిపై జూన్ 16 నుంచి జులై 31 వరకు.. అంటే 46 రోజుల్లో వాట్సాప్ గ్రీవెన్స్‌కు సుమారు 594 రిపోర్టులు వచ్చాయట. వాటి ఆధారంగానే ఆ అకౌంట్లను తొలగించారట.
వాట్సాప్‌కు వచ్చిన 594 గ్రీవెన్స్‌లో 74 కేసుల విషయంలో వాట్సాప్ చర్యలు ప్రారంభించింది. అందులో 73 అకౌంట్ బ్యాన్ గురించేనట. అయితే వాట్సాప్ ఖాతాలను నిషేధించేందుకు మూడు స్టేజీలను ఏర్పాటు చేసుకుంది. వాట్సాప్‌లో ఖాతా తెరవగానే... ఆ వ్యక్తి నుంచి వాట్సాప్ తీసుకునే మెటా డేటాతో యూజర్ బిహేవియర్‌ను అంచనా వేస్తుంది. ఆ తర్వాత ఆ ఖాతా మీద ఏదైనా రిపోర్టు వస్తే... వాళ్ల దగ్గర డేటా ఆధారంగా స్పందిస్తుంది.
వాట్సాప్ మెసేజ్‌ల్లో స్పామ్/తప్పుడు మెసేజ్‌లు ఎక్కువవుతున్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు ప్రారంభించింది అని భావించొచ్చు. ఇలా కొన్ని ఖాతాలను బ్యాన్ చేయడం ద్వారా ప్రజలకు హాని చేసే సమాచారం చేరకుండా చేయొచ్చని వాట్సాప్ భావిస్తోందట. ఏదైనా హాని జరిగేకంటే ముందే... ఇలాంటి ఖాతాలను గుర్తించి నియంత్రించడం మంచిదని వాట్సాప్ నిర్ణయించిందట. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తూ మరిన్ని సౌకర్యాలు అందిస్తూ వస్తోంది.
దేశంలో ఐటీ రూల్స్ - 2021 అమలయ్యాక వాట్సాప్ తీసుకొచ్చిన రెండో ట్రాన్స్పరెన్సీ రిపోర్టు ఇది. దేశంలో సోషల్ మీడియా వినియోగం విషయంలో పూర్తి స్థాయిలో నియంత్రణ ఉంచేందుకు ప్రభుత్వం ఈ రూల్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా సోషల్ మీడియా సంస్థలు ఓ నోడల్ అధికారిని నియమించాల్సి ఉంటుంది. వారిని గ్రీవెన్స్ అధికారి అంటారు. వినియోగదారులు తమకొచ్చిన సందేహాలు, తమ అభ్యంతరాలను వారికి తెలపొచ్చు. వాటికి గ్రీవెన్స్ అధికారి రిప్లై ఇస్తారు. ఆ తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.