Home /News /technology /

SHOCK FOR ROYAL ENFIELD LOVERS THE PRICE OF THAT MODEL BIKE HAS INCREASED HOW MUCH UMG GH

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్ కు షాక్.. ఆ మోడల్ బైక్ ధరలు పెరిగాయి.. ఎంతంటే ?

 రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్ కు షాక్..  ఆ మోడల్ బైక్ ధరలు పెరిగాయి.. ఎంతంటే ?

రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్ కు షాక్.. ఆ మోడల్ బైక్ ధరలు పెరిగాయి.. ఎంతంటే ?

రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) మెటార్ 350 బైక్‌ను 2020లో ఇంట్రడ్యూస్ చేసింది. ఇది కంపెనీకి చెందిన “J” ఆర్కిటెక్చర్‌ బేస్డ్ బైక్‌గా ఫేమస్(Famous) అయింది.

ప్రీమియం బైక్స్(Bikes) తయారు చేసే రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) నుంచి కొత్త మోడల్ రిలీజ్ అయితే ఎంత డిమాండ్ ఉంటుందో.. పాత బైక్స్‌కు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. కంపెనీ పాత బైక్స్‌ ప్రొడక్షన్ లైనప్‌ను కొనసాగిస్తూ, వాటిలో కొత్త వేరియంట్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. అయితే ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చిన మెటార్ 350 (Meteor 350) మోటార్‌సైకిల్‌ కొత్త వేరియంట్ ధరను కంపెనీ పెంచింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితులు, చిప్స్ కొరత కారణంగా ట్రిప్పర్ నావిగేషన్ పాడ్‌ను తొలగించడం వల్ల మెటార్ 350 ధరను ఈ ఏప్రిల్‌లోనే కంపెనీ పెంచింది. ఆ తర్వాత మే నెలలో ఈ బైక్ ధరను తగ్గించింది. కానీ అప్పట్లో తగ్గిన ధర మేరకు కంపెనీ ఈసారి పెంచి కస్టమర్లకు షాక్ ఇచ్చింది.

కొత్త మెటార్ 350 లైనప్‌ను మూడు కొత్త కలర్ ఆప్షన్లలో కంపెనీ రూపొందించింది. ఇప్పుడు ఈ బైక్ మొత్తం పెయింట్ ఆప్షన్ల సంఖ్య 13కి పెరిగింది. ఈ బైక్ ఫైర్‌బాల్ రెడ్/ఎల్లో/బ్లూ/మ్యాట్ గ్రీన్ వేరియంట్ ఇప్పుడు రూ. 2,05,844కి అందుబాటులో ఉంది. గతంలో దీని ధర రూ. 2,01,253 కాగా, ఇప్పుడు రూ.3591 పెరిగింది. స్టెల్లార్ బ్లూ/రెడ్/బ్లాక్ వేరియేషన్ ధర రూ.4591 పెరిగి రూ.2,11,924కి చేరుకుంది. స్టెల్లార్ ప్యూర్ బ్లాక్ కస్టమ్ ధర అతి తక్కువగా రూ. 2754 పెరిగి ఇప్పుడు రూ.2,11,924కి చేరుకుంది. సూపర్‌నోవా బ్రౌన్/బ్లూ/రెడ్ వేరియషన్‌లు గతంలో రూ. 2,17,469కి అందుబాటులో ఉండగా, ఇప్పుడు వీటిపై రూ. 4,592 ధర పెరిగింది. ఇప్పుడు ఈ వేరియంట్లు రూ. 2,22,061కి అందుబాటులో ఉన్నాయి. మెటార్ 350 వేరియంట్లలో ఇవే అత్యంత ఖరీదైన రకంగా నిలుస్తున్నాయి.

ఇదీ చదవండి:  Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?

రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటార్ 350 బైక్‌ను 2020లో ఇంట్రడ్యూస్ చేసింది. ఇది కంపెనీకి చెందిన “J” ఆర్కిటెక్చర్‌ బేస్డ్ బైక్‌గా ఫేమస్ అయింది. ఇందులో తక్కువ సీటు, ఎత్తైన హ్యాండిల్‌బార్లు, ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్స్, బెస్ట్ సీటింగ్ పొజిషన్ వంటివన్నీ బెస్ట్ రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. ఇతర ఫీచర్లలో km/h, mph మార్కింగ్‌లతో అనలాగ్ స్పీడోమీటర్, 8 టెల్-టేల్ LEDలతో డిజి-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. డిస్‌ప్లే(Display)లోని డిజిటల్ రీడౌట్స్ సర్వీస్ రిమైండర్, ఫ్యుయెల్ లెవల్ బార్, క్లాక్ టైమ్, గేర్ ఇండికేషన్‌, ఎకో ఇండికేటర్ వంటి ఫీచర్లు బైక్ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి.



ధరల పెరుగుదల తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటార్ 350 ప్రారంభ ధర ఇప్పుడు 2,05,844గా ఉంది. ఈ ఏడాది ఆగస్టులో రాయల్ ఎన్‌ఫీల్డ్ J-సిరీస్ ప్లాట్‌ఫారమ్ బేస్డ్ హంటర్ 350 బైక్‌ను పరిచయం చేయాలని యోచిస్తోంది. మరికొన్ని రోజుల్లో దీని గురించి పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించనుంది.
Published by:Mahesh
First published:

Tags: Bike accident, Electric Bikes, Life Insurance, Royal Enfield

తదుపరి వార్తలు