Home /News /technology /

SEVEN REASONS YOUR PC MIGHT BE RUNNING SLOW AND WAYS TO FIX IT UMG GH

Computer Performance: మీ కంప్యూటర్ స్లోగా రన్ అవుతోందా..? అయితే ఈ ప్రాబ్లమ్స్‌ ఫిక్స్ చేయండి..!

మీ కంప్యూటర్ స్లో అవుతుందా..?

మీ కంప్యూటర్ స్లో అవుతుందా..?

కంప్యూటర్ ఫర్ఫార్మెన్స్ స్లో అవడానికి ఏడు ప్రధాన కారణాలు ఉంటాయి. వీటిని సింపుల్‌గా ఫిక్స్ చేసుకోవడం ద్వారా మళ్లీ కంప్యూటర్‌ సూపర్ ఫాస్ట్‌గా వర్క్ అవుతుంది. ఆ కారణాలు ఏమిటో.. వాటిని ఎలా ఫిక్స్ చేయాలో తెలుసుకుందాం.

కొత్తగా కొనుగోలు చేసిన కంప్యూటర్లు (Computers) సూపర్ ఫాస్ట్‌గా వర్క్ అవుతాయి. కానీ కాలక్రమేణా వాటి పర్ఫామెన్స్ (Performance) నెమ్మదిస్తుంది. స్లోగా నడిచే కంప్యూటర్ ఇంటర్నెట్‌లో వెబ్ పేజీలు స్క్రోల్ చేయడం నుంచి యాప్స్ ఓపెన్ చేయడం వరకు ప్రతి చిన్న టాస్క్‌కు కూడా చాలా సమయం తీసుకుంటుంది. ఇలా కంప్యూటర్లు  స్లో (Computer Running Slow) అవడానికి అనేక విషయాలు కారణం అవ్వచ్చు. టెక్ నిపుణుల ప్రకారం, కంప్యూటర్ ఫర్ఫార్మెన్స్ స్లో అవడానికి ఏడు ప్రధాన కారణాలు ఉంటాయి. వీటిని సింపుల్‌గా ఫిక్స్ చేసుకోవడం ద్వారా మళ్లీ కంప్యూటర్‌ సూపర్ ఫాస్ట్‌గా వర్క్ అవుతుంది. ఆ కారణాలు ఏమిటో.. వాటిని ఎలా ఫిక్స్ చేయాలో తెలుసుకుందాం.

వర్క్ కాని యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్
కంప్యూటర్‌లో వర్క్‌ అయ్యే యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఉండటం తప్పనిసరి. యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ వర్క్ కాకపోతే చాలా వైరస్‌లు రహస్యంగా పీసీలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ఈ వైరస్‌ల కారణంగా కూడా పీసీ నెమ్మదించే అవకాశం ఉంది. మీరు కాకుండా ఇతరులు ఎవరైనా మీ పీసీని ఉపయోగించి ఇంటర్నెట్‌లో హెవీగా బ్రౌజింగ్ చేస్తుంటే కూడా జాగ్రత్త పడాలి. తెలియని సైట్స్ ద్వారా వైరస్ పీసీలోకి ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఒక మంచి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌తో పీసీని స్కాన్ చేసుకోవడం మంచిది.

పీసీని రీస్టార్ట్ చేయకపోవడం
యూజర్లు కంప్యూటర్‌లో ఉన్న దాదాపు అన్ని ప్రోగ్రామ్స్‌ని ఓపెన్ చేస్తుంటారు. ఇవి నిత్యం బ్యాక్​గ్రౌండ్​లో రన్​ అవుతూనే ఉంటాయి. అయితే బ్యాక్​గ్రౌండ్​లో ఎన్ని ఎక్కువ యాప్​లు రన్ అవుతే.. పీసీ అంత ఎక్కువగా నెమ్మదిస్తుంది. అదే యూజర్లు తమ కంప్యూటర్‌ని అప్పుడప్పుడు రీస్టార్ట్ చేసుకుంటే బ్యాక్​గ్రౌండ్​లో రన్ అయ్యే అన్ని యాప్స్ క్లోజ్ అవుతాయి. అప్పుడు కంప్యూటర్ సూపర్ ఫాస్ట్‌గా వర్క్ అవుతుంది. మళ్లీ కొన్ని రోజుల తర్వాత పీసీ పర్ఫామెన్స్ తగ్గితే, రీస్టార్ట్ చేసుకోవాలి.

హార్డ్‌వేర్ ఫెయిల్యూర్
సాధారణంగా కంప్యూటర్ స్లో అయినప్పుడు ట్రబుల్‌షూటింగ్ స్టెప్స్ అన్ని యూజర్లు ఫాలో అవుతుంటారు. ఈ స్టెప్స్ ఫాలో అవడం ద్వారా మళ్లీ కంప్యూటర్ ఫాస్ట్ అవుతుంది. కానీ ఒక్కోసారి అన్ని స్టెప్స్ ఫాలో అయినా కంప్యూటర్ పర్ఫామెన్స్ స్లోగానే ఉంటుంది. ఇలాంటప్పుడు హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ డ్యామేజ్ అయి ఉండొచ్చు. కంప్యూటర్ రిపేర్ చేసే ఎక్స్‌పర్ట్స్ సహాయంతో మీరు ఈ సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు.

పాతదైన కంప్యూటర్
కంప్యూటర్ పాతది అయినప్పుడు కొత్త అప్‌డేట్‌లకు సపోర్టు లభించదు. ఫలితంగా కంప్యూటర్ అనేది ఓల్డ్ సాఫ్ట్‌వేర్‌తో రన్ అవ్వాల్సి వస్తుంది. దీని వల్ల కంప్యూటర్ స్లో-డౌన్ అవుతుంది. ప్రోగ్రామ్స్‌ను కూడా కొత్త వెర్షన్లకు అప్‌డేట్‌ చేసుకోవడం కుదరదు. ఈ కారణంగా పీసీలోని అన్ని ప్రోగ్రామ్స్ క్రాష్ అవ్వడం, స్లో అవ్వడం జరుగుతుంది. సెక్యూరిటీ రిస్క్స్‌ కూడా పెరుగుతాయి. మొత్తంగా చూసుకుంటే ఓల్డ్ కంప్యూటర్ పర్ఫామెన్స్ పూర్తిగా స్లో అవుతుంది. అందుకే కొత్త కంప్యూటర్ తీసుకోవడం మంచిది.

అవుట్‌డేటెడ్ డ్రైవర్స్
కాలం తీరిన లేదా చెడిపోయిన డ్రైవర్స్ కారణంగా కూడా కంప్యూటర్ చాలా నెమ్మదిగా వర్క్ అవ్వచ్చు. అందుకే డ్రైవర్స్‌ను ఎప్పటికప్పుడు అప్​ టు డేట్​గా ఉంచుకోవాలి.

అనేక యాప్స్‌ బ్యాక్​గ్రౌండ్​లో రన్ కావడం
టర్న్ ఆన్ చేయగానే కొన్ని కంప్యూటర్స్‌లో చాలా యాప్స్‌ లోడ్ అయి రన్ అవుతుంటాయి. ఇవి లోడ్ కావడం వల్ల కంప్యూటర్‌పై చాలా భారం పడుతుంది. ఫలితంగా కంప్యూటర్ పనితీరు మందగిస్తుంది. అందువల్ల యాప్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ కాకుండా వాటిని క్లోజ్ చేసుకోవాలి.

మెమరీ లిమిట్ దాటడం
కంప్యూటర్ హార్డ్‌వేర్, ర్యామ్‌లో మెమరీ పూర్తిగా నిండిపోతే పీసీ బాగా స్లో అవుతుంది. పీసీ వేగంగా పని చేయాలంటే తగినంత స్టోరేజీ ఖాళీగా ఉండటం ముఖ్యం. హార్డ్ డ్రైవ్‌లో కనీసం 20 శాతం స్టోరేజీ ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. హార్డ్ డ్రైవ్‌​, ర్యామ్‌లో స్టోరేజ్ ఫ్రీ చేసుకోవడానికి అవసరం లేని యాప్స్ అన్ని డిలీట్ చేసుకోవాలి.
Published by:Mahesh
First published:

Tags: Anti virus, Computers, Internet, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు