Income Tax Return: ఆల‌స్యం వ‌ద్దు.. ప‌న్నుల చెల్లించండి సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కే అవకాశం

మరోవైపు కంపెనీలు ఐటీఆర్‌లు దాఖలు చేసే గడువును నవంబర్‌ 30 నుంచి 2022 ఫిబ్రవరి 15కు సీబీడీటీ పొడిగించింది.

వివాద్‌ సే విశ్వాస్‌ పథకం కింద ఎటువంటి వంటి అదనపు చార్జీలు(additional charge) లేకుండా పన్ను చెల్లించడానికి ఆఖరు తేదీని ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తున్నట్టు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌​ ట్యాక్సెస్‌ (Tax) తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది.

  • Share this:
    ఐటీఆర్(ITR) దాఖలు చేయడానికి ప్ర‌భుత్వం సెప్టెంబ‌ర్ 30, 2021 గ‌డువు విధించింది. ఈ లోపు ఐటీ చెల్లిస్తే ఆల‌స్య రుసుము చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆదాయ శాఖ తెలిపింది. వాస్త‌వానికి ఐటీఆర్ దాఖ‌లుచేయ‌డాకి జూలై 31 అయితే ప‌లు కార‌ణాల ద్వారా ఐటీఆర్ ఫైల్ చేయ‌డం కుద‌ర‌ని వారు సెప్టెంబ‌ర్ 30 (September 30)లోపు చెల్లించ వ‌చ్చు.
    వివాద్‌ సే విశ్వాస్‌ పథకం కింద ఎటువంటి వంటి అదనపు చార్జీలు(additional charge) లేకుండా పన్ను చెల్లించడానికి ఉన్న ఆఖరు తేదీని ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తున్నట్టు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌​ ట్యాక్సెస్‌ (Tax) ప్రకటించింది. వివాద్‌ సే విశ్వాస్‌ ద్వారా పన్ను చెల్లింపులో భాగంగా ఫారమ్‌ 3 వల్ల ఇబ్బందులు ఎదురైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ ప్రకటించింది.

    Aadhar-Epfo Link: ఈపీఎఫ్‌వోకి ఆధార్ లింక్ చేశారా.. సెప్టెంబ‌ర్ 1 ఆఖ‌రు తేదీ


    అదనపు ఛార్జీలతో పన్నులు చెల్లించేందుకు అక్టోబరు 31కే చివరి తేది అని, ఇకపై గడువు పొడగింపులు ఉండవని సీబీడీటీ(CBTD) తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆగస్టు 29న సీబీడీటీ ప్రకటన జారీ చేసిన విష‌యం తెలిసిందే.

    సెక్ష‌న్ 234ఏ అనేది ఐటీఆర్ ఆలస్యం అయితే విధించే వ‌డ్డీ(intrest) గురించి, పాటించాల్సిన నియ‌మాల గురించి చెబుతుంది. వాస్త‌వానికి టాక్స్ చెల్లించే వారు జూలై 31 వ‌ర‌కే త‌మ చెల్లింపులు చేస్తే ఎటువంటి వ‌డ్డీ ప‌డ‌దు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం ఇచ్చిన సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు చేస్తే జ‌రిమానాపై వ‌డ్డీ మిన‌హాయింపు వ‌స్తుంది.
    దీనిపై ఇన్‌క‌మ్ టాక్స్ ఆఫ్ ఇండియా త‌న అధికారిక ట్విట్ట‌ర్(Twitter) ఖాత‌లో ట్వీట్ ద్వారా వెల్ల‌డించింది.
    ఆఖ‌రి నిమిషంలో ఇబ్బంది ప‌డొద్దు..
    ప్ర‌స్తుతం ఉన్న స‌మ‌యంలో సాంకేతిక లోపాల‌తో పోర్ట‌ల్ ఇబ్బంది ప‌డితే ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డం ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌గా ఐటీఆర్ చేయ‌డం వ‌ల్ల ఆఖ‌రి నిముషంలో క‌లిగే ఇబ్బందుల‌ను నివారించ‌వ‌చ్చు
    Published by:Sharath Chandra
    First published: