TV Offer | కొత్త టీవీ కొనే యోచనలో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. స్మార్ట్ టీవీపై కళ్లుచెదిరే డీల్ ఒకటి అందుబాటులో ఉంది. దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) స్మార్ట్ టీవీపై సూపర్ ఆఫర్ లభిస్తోంది. మీరు కేవలం రూ. 999కే స్మార్ట్ టీవీ (TV) పొందే ఆప్షన్ ఒకటి అందుబాటులో ఉంది. అది ఏ ఆఫర్ అని అనుకుంటున్నారా? అయితే ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే.
ఫ్లిప్‌కార్ట్‌లో సెన్స్ స్మార్ట్ టీవీలు ఉన్నాయి. వీటిపై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ లభిస్తోంది. సెన్స్ 32 ఇంచుల స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్ ఉంది. ఈ స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రూ. 20,990గా ఉంది. అయితే దీన్ని మీరు ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 9999కే కొనొచ్చు. అంటే మీకు నేరుగానే ఈ టీవీపై 52 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. అంతేకాకుండా మరో ఆఫర్ కూడా ఉంది. అదే ఎక్స్చేంజ్ ఆఫర్. మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 9 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అంటే మీకు అప్పుడు రూ. 999కే టీవీ లభించినట్లు అవుతుంది.
అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ పాత టీవీ ఆధారంగ మారుతుంది. కొన్ని టీవీలకు తక్కువ ఎక్స్చేంజ్ విలువ కూడా రావొచ్చు. అందుకే మీరు టీవీ కొనే ముందు మీ టీవీకి ఎంత ఎక్స్చేంజ్ విలువ వస్తుందో చెక్ చేసుకోండి. ఈ ఆఫర్లు మాత్రమే కాకుండా ఇతర డీల్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా అయితే రూ. 750 అదనపు తగ్గింపు వస్తుంది. అలాగే ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై కూడా 10 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డుపై కూడా ఆఫర్లు ఉన్నాయి. పది శాతం తగ్గింపు పొందొచ్చు.
చౌక ధరకే 55 ఇంచుల స్మార్ట్ టీవీ.. నెలకు రూ.1,400 కడితే చాలు!
ఇకపోతే ఈ స్మార్ట్ టీవీలో నెట్‌ఫ్లిక్స్ , ప్రైమ్, డిస్నీ హాట్‌స్టర్ సహా పలు ఓటీటీ యాప్స్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ సిస్టమ్‌పై ఈ టీవీ పని చేస్తుంది. సౌండ్ ఔట్‌పుడ్ 20 వాట్. రిఫ్రెష్ రేటు 60 హెర్ట్జ్. ఇంకా ఈ టీవీపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా పొందొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 3333 నుంచి ప్రారంభం అవుతోంది. 3 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే రెగ్యులర్ ఈఎంఐ అయితే నెలకు రూ. 350 కడితే సరిపోతుంది. 36 నెలలకు ఇది వర్తిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget smart tv, Flipkart, Latest offers, Smart TV