NASA: అంగారక గ్రహం పైకి మీ పేరును పంపొచ్చు ఇలా...

Mars 2020 rover | మీరు సెప్టెంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు సావనీర్ బోర్డింగ్ పాస్ లభిస్తుంది. దాంతో పాటు ఫ్రీక్వెంట్ ఫ్లయర్ పాయింట్స్ కూడా వస్తాయి.

news18-telugu
Updated: May 27, 2019, 4:28 PM IST
NASA: అంగారక గ్రహం పైకి మీ పేరును పంపొచ్చు ఇలా...
NASA: అంగారక గ్రహం పైకి మీ పేరును పంపొచ్చు ఇలా... (image: NASA)
  • Share this:
నాసా ఓ మంచి ఆఫర్ ప్రకటించింది. మార్స్ 2020 రోవర్‌లో మీ పేర్లను అంగారక గ్రహంపైకి పంపే అవకాశం కల్పిస్తోంది నాసా. ఎవరైనా తమ పేరును మార్స్ పైకి పంపాలంటే నాసా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నవారికి బోర్డింగ్ పాస్ కూడా ఇస్తుంది నాసా. ఫైనలైజ్ చేసిన పేర్లు మార్స్ 2020 రోవర్‌లోని మైక్రోచిప్స్‌పై కనిపిస్తాయి. మనిషిని అంగారక గ్రహంపైకి పంపేందుకు ఇంకా ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. కానీ అంతకంటే ముందే మనుషుల పేర్లను పంపాలని నిర్ణయించింది నాసా. అందుకే ఎవరెవరు తమ పేర్లను మార్స్‌ పైకి పంపాలనుకుంటున్నారో దరఖాస్తు చేసుకోండని ఆహ్వానిస్తోంది నాసా. ఇప్పటికే 50 లక్షల మందికి పైగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.

మార్స్ 2020 రోవర్‌ను వచ్చే ఏడాది జూలైలో లాంఛ్ చేయనుంది నాసా. 2021 ఫిబ్రవరిలో స్పేస్‌క్రాఫ్ట్ అంగారక గ్రహంపైకి వెళ్తుంది. మార్స్ 2020 రోవర్‌ సుమారు 1,000 కిలోల బరువు ఉంటుందని అంచనా. అంగారక గ్రహంపై వాతావరణం, మనిషి జీవించడానికి అవకాశాలపై అధ్యయనం చేయనుంది మార్స్ రోవర్. నాసా శాస్త్రవేత్తలు నిర్వహించబోయే ఈ అద్భుత ప్రయాణంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం. మరి మీరు కూడా మీ పేర్లను మార్స్‌పైకి పంపాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి.

https://mars.nasa.gov/participate/send-your-name/mars2020/

మీరు సెప్టెంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు సావనీర్ బోర్డింగ్ పాస్ లభిస్తుంది. దాంతో పాటు ఫ్రీక్వెంట్ ఫ్లయర్ పాయింట్స్ కూడా వస్తాయి. వచ్చిన పేర్లను ఎలక్ట్రాన్ బీమ్ ద్వారా సిలికాన్ చిప్‌పై చెక్కుతారు. మనిషి వెంట్రుకలో వెయ్యో వంతు ఎంత ఉంటుందో మీ పేరు అంత సూక్ష్మంగా చిప్‌పైన చెక్కి పంపిస్తారు. నాసా ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఇదే కొత్త కాదు. గతంలో ఇన్‌సైట్ మిషన్‌ను మార్స్‌పైకి పంపినప్పుడు కూడా ఇలాగే పేర్లను ఆహ్వానించింది. అప్పుడు 20 లక్షల మంది పేర్లను ఇన్‌సైట్ మిషన్‌లో పంపింది.



Technology: మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hyundai Venue: స్మార్ట్ ఫీచర్లతో హుందాయ్ వెన్యూ... కారు ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Redmi 7A: షావోమీ నుంచి లో-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ఏ

Tata Sky: టాటా స్కై సెట్ టాప్ బాక్స్ ధరలు తగ్గాయి... కొత్త రేట్లు ఇవే

IRCTC: రైలు టికెట్ కన్ఫామ్ కావాలా? ఈ 3 టిప్స్ ట్రై చేయండి
First published: May 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>