WhatsApp: మీ వాట్సప్ నుంచి డబ్బులు పంపండి ఇలా

WhatsApp Payments Settings | వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. మీరు వాట్సప్‌లో డబ్బులు పంపొచ్చు. స్వీకరించొచ్చు. సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: June 8, 2020, 12:06 PM IST
WhatsApp: మీ వాట్సప్ నుంచి డబ్బులు పంపండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు వాట్సప్ ఉపయోగిస్తున్నారా? ఇకపై మీ వాట్సప్‌ను మెసేజెస్, ఫోటోలు, వీడియోలు పంపడానికి మాత్రమే కాదు... డబ్బులు పంపించడానికి కూడా ఉపయోగించొచ్చు. గూగుల్ పే, ఫోన్‌పే లాంటి పేమెంట్స్ యాప్స్‌కు పోటీగా వాట్సప్ కూడా సొంతగా పేమెంట్ ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చింది. వాట్సప్ పేమెంట్స్ పేరుతో పరిచయం చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NCPI యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్-UPI ఆధారంగా వాట్సప్ పేమెంట్స్ పనిచేస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకొని ఈ పేమెంట్ వ్యవస్థను నడిపించనుంది వాట్సప్. మీరు కూడా వాట్సప్ పేమెంట్ ఉపయోగించి డబ్బులు పంపొచ్చు. స్వీకరించొచ్చు. ఇందుకోసం మీ బ్యాంకు అకౌంట్‌ను వాట్సప్ పేమెంట్స్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకోండి.

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ యాప్‌ను అప్‌డేట్ చేండి. ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేయండి. రైట్ టాప్‌లో త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి. మీకు Payments ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. ఆ తర్వాత Add payment method పైన క్లిక్ చేయండి. నియమనిబంధనల్ని అంగీకరించేందుకు Accept and Continue పైన క్లిక్ చేయండి. బ్యాంకుల జాబితా కనిపిస్తుంది. అందులో మీ అకౌంట్ నెంబర్ ఉన్న బ్యాంకు సెలెక్ట్ చేయండి. అకౌంట్ నెంబర్‌కు మొబైల్ నెంబర్‌ లింకై ఉండాలి. ఆ తర్వాత మీ ఫోన్‌కు వెరిఫికేషన్ మెసేజ్ వస్తుంది. ఎస్ఎంఎస్ ద్వారా వెరిఫై చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు లింకై ఉన్న అకౌంట్ నెంబర్లు కనిపిస్తాయి. మీకు కావాల్సిన అకౌంట్ నెంబర్ ఎంచుకుంటే అకౌంట్ సెటప్ పూర్తవుతుంది.

ఇక మీరు వాట్సప్ ద్వారా డబ్బులు పంపడానికి రెండు పద్ధతులు ఉంటాయి. మీరు ఎవరికి డబ్బులు పంపాలనుకుంటే వారి ఛాట్ విండో ఓపెన్ చేయాలి. అటాచ్‌మెంట్ పైన క్లిక్ చేస్తే Payment ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి. ఆ తర్వాత సెండ్ మనీ పైన క్లిక్ చేసి అమౌంట్ టైప్ చేయాలి. ఆ తర్వాతి స్క్రీన్‌లో యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఇదే పద్ధతిలో డబ్బులు రిక్వెస్ట్ చేయొచ్చు. ఇక రెండో పద్ధతి ద్వారా డబ్బులు పంపాలనుకుంటే వాట్సప్ ఓపెన్ చేసి రైట్ టాప్‌లో త్రీ డాట్స్ పైన క్లిక్ చేయాలి. అందులో Payments ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. న్యూ పేమెంట్ పైన క్లిక్ చేసి మీ కాంటాక్ట్స్ లిస్ట్‌లో మీరు డబ్బులు పంపాలనుకుంటున్న వారి పేరు సెలెక్ట్ చేయాలి. ముందు చెప్పిన ప్రాసెస్‌లోనే డబ్బులు పంపాలి. అయితే అవతలివాళ్లు కూడా వాట్సప్ పేమెంట్స్ సెటప్ చేసుకుంటేనే డబ్బులు పంపడానికి వీలవుతుంది.

ఇవి కూడా చదవండి:

Jan Dhan account: జన్ ధన్ అకౌంట్‌లోకి మనీ ట్రాన్స్‌ఫర్ ప్రారంభం... బ్యాలెన్స్ చెక్ చేయండిలా

SBI Gold Loan: బంగారంపై రుణాలు... తక్కువ వడ్డీకే ఇస్తామంటున్న ఎస్‌బీఐ

Smartphone: కొత్త ఫోన్ కొనాలా? రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే
Published by: Santhosh Kumar S
First published: June 8, 2020, 12:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading