పాత ఫోన్ అమ్మేస్తున్నారా? తీసుకోవాల్సిన 7 జాగ్రత్తలివే

మీ ఫోన్ మరొకరి చేతుల్లోకి వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే మీ ప్రైవసీ రిస్క్‌లో పడే అవకాశముంది. మరి పాత ఫోన్ అమ్మడం లేదా ఎక్స్‌ఛేంజ్ చేయడం కన్నా ముందు మీరు మర్చిపోకూడని ముఖ్యమైన అంశాలివే.

news18-telugu
Updated: May 29, 2019, 3:04 PM IST
పాత ఫోన్ అమ్మేస్తున్నారా? తీసుకోవాల్సిన 7 జాగ్రత్తలివే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వారానికో కొత్త ఫోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఏడాదికోసారైనా ఫోన్ మార్చాలనిపిస్తుంది. సాధారణంగా ఏ ఫోన్ అయినా కనీసం రెండేళ్లు హ్యాపీగా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. మరి కొత్త ఫోన్ కొంటే పాత ఫోన్ ఏం చేయాలి? ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంటే వాడుకోవచ్చు. ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి కొనేయొచ్చు. లేదా పాత ఫోన్ ఎవరికైనా అమ్మేయడం అలవాటు. మరి మీరూ పాత ఫోన్ అమ్మేస్తున్నారా? లేదా ఎక్స్‌ఛేంజ్ చేస్తున్నారా? మీ ఫోన్ మరొకరి చేతుల్లోకి వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే మీ ప్రైవసీ రిస్క్‌లో పడే అవకాశముంది. మరి పాత ఫోన్ అమ్మడం లేదా ఎక్స్‌ఛేంజ్ చేయడం కన్నా ముందు మీరు మర్చిపోకూడని ముఖ్యమైన అంశాలివే.

1. డేటా బ్యాకప్: మీరు ఫోన్ కొన్న దగ్గర్నుంచి మీ ఇంపార్టెంట్ ఫైల్స్ అందులో స్టోర్ అవుతాయి. మీరు మెమొరీ కార్డ్ ఉపయోగిస్తున్నా సరే... ఫోన్‌లో కొన్ని ఫైల్స్ సేవ్ అవుతుంటాయి. అందుకే మీరు మీ పాత ఫోన్ అమ్మే ముందు ఫోన్‌లోన్ డేటాను బ్యాకప్ చేయడం మర్చిపోవద్దు. టెక్ట్స్, పీడీఎఫ్ ఫైల్స్, డాక్యుమెంట్స్, ఫోటోలు, వీడియోలు ఇతర ముఖ్యమైన ఫైల్స్ బ్యాకప్ చేసుకోవాలి.

2. కాంటాక్ట్స్: మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ని గూగుల్‌లోకి బ్యాకప్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫోన్‌లో Settings ఓపెన్ చేసి Accounts సెక్షన్‌లో Google పైన క్లిక్ చేయాలి. మీరు ఏ మెయిల్‌లోకి బ్యాకప్ చేయాలో ఆ మెయిల్‌పైన క్లిక్ చేసి కాంటాక్ట్స్ సింక్ చేయాలి.

3. ఫ్యాక్టరీ రీసెట్: మీ ఫోన్‌లోని డేటాను బ్యాకప్ చేసుకున్న తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. అంటే మీరు మొదట ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే అలా మారిపోతుంది. అందులో మీ లాగిన్ వివరాలేవీ ఉండవు. Settings ఓపెన్ చేసి Backup & reset సెక్షన్‌‌లో Factory data reset పైన క్లిక్ చేయాలి. ఒక్కసారి ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే హ్యాకర్లు కూడా డేటాను రికవర్ చేయలేరు.

4. స్విచ్ఛాఫ్: ఫోన్ రీసెట్ చేసిన తర్వాత వెంటనే స్విచ్ఛాఫ్ చేయండి. అకౌంట్ లాగిన్ చేయకుండా ఫోన్ వాడితే ఏం కాదనుకోవద్దు. వైఫైకి కనెక్ట్ చేసి ఉపయోగించొద్దు.

5. యాక్సెసరీస్: మీ పాత ఫోన్ నుంచి సిమ్ కార్డ్, మొమొరీ కార్డ్‌తో పాటు ఇతర యాక్సెసరీస్ ఏవైనా ఉంటే తీసెయ్యాలి.

6. ప్యాకింగ్: బాక్స్‌లో ఫోన్ ప్యాక్ చేయాలి. చార్జర్, ఇయర్‌ఫోన్, కవర్ బాక్స్, ఇన్వాయిస్ లాంటివి ఉంటే ప్యాక్ చేయాలి.7. సెల్లింగ్: ఆన్‌లైన్‌లో మీ ఫోన్ అమ్మాలనుకుంటే మీ ఫోన్ కండీషన్ ఎలా ఉందే డిస్క్రిప్షన్‌లో వివరించాలి. మీ ఫోన్‌లో ఏవైనా లోపాలు ఉన్నా చెప్పడం మంచిది.

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


ఇవి కూడా చదవండి:

ఆన్‌లైన్‌లో చెప్పులు కొంటున్నారా? ఈ 11 జాగ్రత్తలు తప్పనిసరి

IRCTC: రైలు టికెట్ కన్ఫామ్ కావాలా? ఈ 3 టిప్స్ ట్రై చేయండి

Business Loan: ష్యూరిటీ లేకుండా రూ.10 లక్షల లోన్... పొందండి ఇలా
First published: May 29, 2019, 3:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading