Home /News /technology /

SELF DRIVING CARS THE CHINESE COMPANY THAT INVENTED THE ELECTRIC ROBOT CAR WHICH VEHICLE REPRESENTS THE FUTURE OF SELF DRIVING CARS GH EVK

Self-Driving Cars: చైనా స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌.. ఎలక్ట్రిక్ రోబో కారు.. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల‌కు భ‌విష్య‌త్‌లో గిరాకీ!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

చైనీస్ ఆటోమేకర్ గీలీ, ఎలక్ట్రిక్ వెహికల్ వెంచర్ జిడు(Jidu) సహాయంతో ఓ రోబో ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌ కారును ఆవిష్కరించింది. ఇది కారు, రోబో కూడా. ప్రారంభ దశ డిజైన్, ఆలోచనను త్వరగా నిరూపించుకోవడానికి కాన్సెప్ట్ కారుని ఉపయోగించనున్నారు.

ఇంకా చదవండి ...
చైనా (China) లోని వాహన తయారీదారులు అసిస్టెడ్ డ్రైవింగ్ టెక్నాలజీ అభివృద్ధికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. అసిస్టెడ్‌ డ్రైవింగ్‌ను నిజం చేయడానికి కృషి చేస్తున్న కంపెనీలలో బైడు (Baidu), గీలీ (Geely) ఉన్నాయి. బైడు నియంత్రణలోని చైనీస్ ఆటోమేకర్ గీలీ, ఎలక్ట్రిక్ వెహికల్ వెంచర్ జిడు(Jidu) సహాయంతో ఓ రోబో ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌ కారును ఆవిష్కరించింది. బైడు, గీలీ భాగస్వామ్యానికి అంగీకరించిన తర్వాత దాదాపు ఒక సంవత్సరం క్రితం స్థాపించిన ఈ జాయింట్ వెంచర్ సీఈవో జో జియా మాట్లాడుతూ..‘ఇది కారు, రోబో కూడా.  ప్రారంభ దశ డిజైన్, ఆలోచనను త్వరగా నిరూపించుకోవడానికి కాన్సెప్ట్ కారుని ఉపయోగిస్తాం.’ అని చెప్పారు.

Motorola: టాప్ క్లాస్ కెమెరా ఫీచ‌ర్స్‌తో మోటో నుంచి కొత్త ఫోన్.. స్పెసిఫికేష‌న్ వివ‌రాలు


జిడు మొదటి వాహనం నమూనాను సీఈవో వివరిస్తూ.. ‘డ్యాష్‌బోర్డ్ స్థానంలో పొడవైన స్క్రీన్‌ వస్తుంది. అది కారు ముందు స్కాన్‌ (Scan) చేస్తుంది. డ్రైవర్ వాయిస్‌ కంట్రోల్‌ (Voice Control) సిస్టమ్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. కాక్‌పిట్ బటన్‌లు తొలగించాం.’ అని చెప్పారు. ఈ కారు ఫ్యూచరిస్టిక్‌ లుకింగ్‌, లార్జ్లీ అటానమస్‌ హ్యాచ్‌బ్యాక్‌ను రోబో-1 అంటారు. కంపెనీ ప్రకారం.. దీనికి ఇది కనీసం 30,000ల డాలర్‌లు ఖర్చు అవుతుంది. వచ్చే ఏడాది అందుబాటులోకి రానుంది.

జిడు సెల్ఫ్ డ్రైవింగ్ (Self Driving) ఆటోమొబైల్స్‌కు ప్రమాణంగా మారవచ్చని జియా పేర్కొంది. కానీ వాహనంతో పాటు డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌కు ఏ స్థాయిలో సహాయం అందుతుందనే మరిన్ని వివరాలను పంచుకోలేదు. అయితే నివేదికల ప్రకారం.. వాహనం యాక్టివేట్‌ చేసినప్పుడు సెన్సార్లు, లైడార్‌ హుడ్ నుంచి పైకి లేస్తుంది, ముందున్న రోడ్‌ మ్యాప్‌ 3Dలో లోడ్ అవుతాయి. రోబో-1 చివరి మోడల్ బీజింగ్‌లో ప్రదర్శించిన దానితో పోలిస్తే 90 శాతం ఒకేలా ఉంటుందని జిడు పేర్కొంది. అయితే ఏ అంశాలు మారతాయో వెల్లడించలేదు.

Google Features: గూగుల్ మెసేజెస్ యాప్‌లో యాడ్స్‌ వ‌ద్దా.. ఇలా ట్రై చేయండి


మొబైల్‌ కనెక్షన్‌ ద్వారా సాఫ్ట్‌వేర్‌ అపడేట్‌
జిడు వాహనం అపోలో కస్టమైజ్డ్‌ వెర్షన్‌ను పోలి ఉంటుందని చెప్పింది. ఇది బైడు అనేక మంది భాగస్వాములు నిర్మించిన ఓపెన్ ప్లాట్‌ఫారమ్‌ను చైనాలోని డజన్ల కొద్దీ కార్ల తయారీదారులు ఉపయోగిస్తున్నారు. రాబోయే కారు చాలా రోడ్లపై స్వయంగా డ్రైవ్ చేయగలదని కూడా తెలిపింది.

ఏప్రిల్ నాటికి అపోలో 16.7 మిలియన్ మైళ్లకు పైగా అటానమస్‌ డ్రైవింగ్‌ను పర్యవేక్షించినట్లు బైడు పేర్కొంది. అటానమస్‌ డ్రైవింగ్ అల్గారిథమ్‌లకు శిక్షణ ఇవ్వడానికి బైడు ఉపయోగించిన గణన సామర్థ్యాన్ని Xia టెస్లా తన సాఫ్ట్‌వేర్ ఆటోపైలట్‌ని పరిపూర్ణం చేయడానికి ఉపయోగించే సూపర్ కంప్యూటర్‌తో పోల్చింది. అదనంగా మొబైల్ కనెక్షన్ ద్వారా సాధారణ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ల ద్వారా క్రమ పద్ధతిలో కారు ఫీచర్లను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తామని జిడూ పేర్కొంది.

ఈవీ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌
జిడుతో ఆటోమేకింగ్‌లో బైడు అడుగుపెట్టడం కూడా చైనా ఐటీ పరిశ్రమ వృద్ధికి సూచన అని అర్థం చేసుకోవచ్చు. వినియోగదారులు తమ ఆటోమొబైల్స్‌లో యాప్ లాంటి అనుభవాన్ని ఆశిస్తున్నారని నిపుణులు విశ్వసిస్తున్నారు.

Google Features: గూగుల్‌లో కొత్త‌గా అదిరిపోయే ఫీచ‌ర్స్‌.. ఎలా వినియోగించాలో తెలుసుకోండి


చైనాలోని చాలా పెద్ద ఇంటర్నెట్ వ్యాపారాలు ఏదో ఒక పద్ధతిలో ఆటోమోటివ్ టెక్నాలజీని సృష్టిస్తున్నాయి. బైడు ఎలక్ట్రిక్‌ వాహన రంగంలోకి ప్రవేశించడం అనేది కంపెనీ దృష్టిని ప్రకటనల నుంచి దూరంగా, అటానమస్‌ డ్రైవింగ్, కృత్రిమ మేధస్సు వంటి కొత్త వృద్ధి రంగాలలోకి మార్చడానికి చర్యలు తీసుకుంటున్నారు. చైనాలో సాంకేతిక వ్యాపారాలు ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించే ధోరణి కనపడుతోంది.

షియోమి గత ఏడాది తన సొంత ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో 2024 మొదటి అర్ధభాగంలో భారీ ఉత్పత్తిని ప్రారంభించాలనే ఆశతో, రాబోయే 10 సంవత్సరాలలో తన సొంత ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో 10 బిలియన్ల డాలర్‌లను పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని తెలిపింది.
Published by:Sharath Chandra
First published:

Tags: Electric Car, Electric Vehicles, Latest Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు