హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google: వీడియో సెర్చ్‌ ఆప్షన్‌ అందించనున్న Google.. తాజా ఈవెంట్‌లో వెల్లడించిన ప్లాన్స్‌ ఇవే..

Google: వీడియో సెర్చ్‌ ఆప్షన్‌ అందించనున్న Google.. తాజా ఈవెంట్‌లో వెల్లడించిన ప్లాన్స్‌ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సోమవారం జరిగిన గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్‌లో కంపెనీ తన స్కిల్స్‌, అప్లికేషన్స్‌ను ప్రదర్శించింది. డెవలప్‌ చేస్తున్న అప్లికేషన్‌ వివరాలను తెలియజేసింది. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన కొన్ని ఆసక్తికరమైన ఫీచర్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ఈ రోజుల్లో ఏ చిన్న సందేహం వచ్చినా, సమాచారం అవసరమైనా వెంటనే ఫోన్‌ తీసి ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేస్తుంటారు. కొంత సేపు ఆలోచిస్తే గుర్తొచ్చే విషయాలకు కూడా సమయం కేటాయించడం లేదు. స్మార్ట్‌ఫోన్‌లో సెర్చింగ్‌(Searching) వినియోగం భారీగా పెరిగింది. మిలియన్ల మంది భారతీయులు తమ రోజువారీ అవసరాల్లో భాగంగా గూగుల్‌ సెర్చ్‌ని ఉపయోగిస్తున్నారు. యూట్యూబ్‌లో(YouTube) సమాచారం సెర్చ్‌ చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో ఇండియాలోని గూగుల్ బిజినెస్‌లో సెర్చింగ్‌ అనేది అంతర్గత భాగమని Google కంపెనీ గుర్తించింది. మెరుగైన సెర్చింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించడంతో పాటు మరికొన్ని ఆప్షన్‌లను వినియోగదారులకు అందిస్తున్నట్లు గూగుల్‌ వెల్లడించింది. రియల్‌ టైమ్‌ ప్రాబ్లమ్స్‌కి అడ్వాన్స్‌డ్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నెట్‌వర్క్(Network) సహాయంతో పరిష్కారాలు చూపుతోంది. సోమవారం జరిగిన గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్‌లో కంపెనీ తన స్కిల్స్‌, అప్లికేషన్స్‌ను ప్రదర్శించింది. డెవలప్‌ చేస్తున్న అప్లికేషన్‌(Application) వివరాలను తెలియజేసింది. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన కొన్ని ఆసక్తికరమైన ఫీచర్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యూట్యూబ్‌లో సెర్చ్‌ ఇన్‌ వీడియో

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫారం యూట్యూబ్‌. ఇండియాలోనే ఎక్కువ మంది యూట్యూబ్‌ యూజర్లు ఉన్నారు. అయితే యూట్యూబ్‌ను ప్రస్తుతం చాలా మంది సమాచారం సెర్చ్‌ చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు. కేవలం వీడియోలు చూడటానికే ఉపయోగించడం లేదు. ఈ కొత్త ట్రెండ్‌ను గూగుల్‌ కంపెనీ గుర్తించింది. అందుకే వీడియోలోని స్పెసిఫిక్‌ పార్ట్‌ని సెర్చ్‌ చేసేలా కొత్త ఆప్షన్‌ అందిస్తున్నట్లు గూగుల్‌ వెల్లడించింది. ఏదైనా వీడియోలో సమాచారం కోసం.. వీడియో ఓపెన్‌ చేసి ఫార్వార్డ్‌ చేయడం, స్క్రోల్‌ చేయాల్సిన అవసరం లేకుండా.. నేరుగా వీడియోలో సమాచారం ఉన్న టైమ్‌కి వెళ్లేలా ఈ ఆప్షన్‌ ఉపయోగపడుతుందని వివరించింది. దీంతో కామన్‌ సెర్చ్‌ వర్డ్‌ టైప్‌ చేస్తే నేరుగా వీడియోలని ఆ పార్ట్‌ని ఓపెన్‌ చేయవచ్చు. ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే అంశంపై గూగుల్ స్పష్టత ఇవ్వలేదు. అయితే కొన్ని వారాల్లోనే లాంచ్‌ చేసే సూచనలు ఉన్నాయని తెలిసింది.

మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌లు చదవనున్న AI

సాధారణంగా డాక్టర్ అందించిన ప్రిస్క్రిప్షన్‌ అర్థం చేసుకోవడం దాదాపు సాధ్యం కాదు. ఏ మెడిసిన్‌ సూచించారో కూడా తెలియదు. మెడికల్‌ షాప్‌లో అందజేసి, ఇచ్చినవి తీసుకోవడానికే పరిమితం అయ్యారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేలా గూగుల్‌ కొత్త ఫీచర్‌ అందిస్తోంది. త్వరలో మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లను చదవడంలో AI సహాయం చేయనుంది. ఈవెంట్‌లో గూగుల్‌ స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ద్వారా డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ క్యాప్చర్‌ చేసి డీక్రిప్ట్ చేయడాన్ని డెమో ద్వారా వివరించింది. ప్రారంభ దశలో ఉన్న ఈ ఫీచర్‌ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

Job Opportunity: రూ.2 లక్షలకు పైగా శాలరీతో డిప్యూటీ కమిషనర్‌ పోస్టులు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలిలా..

ఆండ్రాయిడ్‌లో డిజిలాకర్‌తో డాక్యుమెంట్లకు భద్రత

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్, పాన్ కార్డ్ వంటి ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను యాక్సెస్ చేసుకొనే సదుపాయం కల్పించేందుకు భారత ప్రభుత్వంతో గూగుల్ చేతులు కలుపుతోంది. ఆండ్రాయిడ్‌లోని ఫైల్స్‌ యాప్‌, డిజిలాకర్ ప్లాట్‌ఫారమ్‌తో ఇంటిగ్రేట్‌ కానుంది. ఇకపై ఆండ్రాయిడ్‌ యూజర్లు డాక్యుమెంట్లను పొందడానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్క్రీన్ లాక్ వెనుక డాక్యుమెంట్లను భద్రపరచుకోవచ్చని గూగుల్ తెలిపింది. డాక్యుమెంట్లకు మెరుగైన భద్రత ఉంటుందని, చివరికి కంపెనీ కూడా యాక్సెస్‌ చేయలేదని వివరించింది.

First published:

Tags: Google, Youtube, Youtuber

ఉత్తమ కథలు