• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • SECRET FEATURES OF GOOGLE CHROME TO MAKE YOUR LIFE SIMPLER MK GH

Google Chrome: గూగుల్​ క్రోమ్​లోని ఈ అద్భుతమైన సీక్రెట్​ ఫీచర్ల గురించి తెలుసా?.. మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండరు!

Google Chrome: గూగుల్​ క్రోమ్​లోని ఈ అద్భుతమైన సీక్రెట్​ ఫీచర్ల గురించి తెలుసా?.. మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండరు!

(ప్రతీకాత్మక చిత్రం)

గూగుల్ క్రోమ్ ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇంటర్నెట్ బ్రౌజర్. దీని వాడుకలో సౌలభ్యం, అద్భుతమైన ఫీచర్లతో నేటికీ అత్యంత పాపులర్​ ఇంటర్నెట్​ బ్రౌజర్​గా కొనసాగుతుంది.

  • Share this:
గూగుల్ క్రోమ్ ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇంటర్నెట్ బ్రౌజర్. దీని వాడుకలో సౌలభ్యం, అద్భుతమైన ఫీచర్లతో నేటికీ అత్యంత పాపులర్​ ఇంటర్నెట్​ బ్రౌజర్​గా కొనసాగుతుంది. గూగుల్​ క్రోమ్​ మనందరికీ పరిచయమై పదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దీనిలో సరికొత్త ఫీచర్లను చేర్చింది. బ్రౌజర్లకు తెలియని లేదా ఎప్పుడూ ఉపయోగించని అద్భుతమైన ఫీచర్లను ఇందులో అందించింది. వాటిలో ముఖ్యమైన 8 సీక్రెట్​ ఫీచర్ల గురించి తెలుసుకోండి.

నేరుగా ఆడియో/ వీడియో ఫైల్‌ ప్లే
గూగుల్​ క్రోమ్​ను ఆడియో/ వీడియో ఫైళ్ళను కూడా ప్లే చేయగలదని మీకు తెలుసా?.. దీని కోసం మీరు చేయాల్సిందల్లా ఆడియో ఫైల్ లేదా వీడియో ఫైల్‌ను క్రొత్త ట్యాబ్‌లోకి డ్రాగ్​ చేయడమే. ఇది బేసిక్​ మీడియా ప్లేయర్ అయినప్పటికీ, మీరు దీనితో ఆడియో/ వీడియో ఫైల్‌ అద్భుతంగా ప్లే చేసి ఆస్వాదించవచ్చు.

డేటా సేఫ్టీ కోసం​ మాల్వేర్ స్కానర్
మీ బ్రౌజింగ్​ సురక్షితంగా ఉండేందుకు క్రోమ్​లో ఇన్​బిల్ట్​ మాల్వేర్ స్కానర్ ఉంటుంది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా సెట్టింగ్స్​కు వెళ్లి అడ్వాన్స్డ్​ ఆప్షన్​ను ఎంచుకోండి. అక్కడ మీరు సిస్టమ్​ రీసెట్ చేసి కంప్యూటర్‌ను క్లీనప్​ చేయవచ్చు.- ఇది మీ కంప్యూటర్‌ను స్కాన్ చేసి దాంట్లోని వైరస్​ను తొలగిస్తుంది. సిస్టమ్​లో ఏవైనా మాల్​వేర్​ చొరబడితే Chrome దాన్ని రిపోర్ట్ చేసి వెంటనే శుభ్రం చేస్తుంది.

డేటా ప్రైవసీ కోసం గెస్ట్​ మోడ్​
మీరు మీ స్నేహితుడు / సహోద్యోగికి మీ కంప్యూటర్‌ను కొంతకాలం పాటు వాడుకోమని ఇచ్చిన సందర్భంలో వారు మీ బ్రౌజింగ్​ హిస్టరీని తెలుసుకోకుండా ఉండేందుకు క్రోమ్​లో గెస్ట్ మోడ్ అనే అద్భుతమైన ఫీచర్​ ఉంది. గెస్ట్​ మోడ్​ కోసం మీరు చేయాల్సిందల్లా మీ గూగుల్​ క్రోమ్​ ఎగువ కుడి మూలలోని గూగుల్ అకౌంట్​ అవతార్‌పై క్లిక్ చేసి, గెస్ట్​ మోడ్‌ను ఎంచుకోండి. తద్వారా, మీ డేటా హిస్టరీని ఇతరుల చూడకుండా జాగ్రత్తపడవచ్చు.

ఈజీ రీడింగ్​ కోసం రీడర్​ మోడ్​
సహజంగా ఏదైనా ఆర్టికల్స్​, కంటెంట్​ చదివే సమయంలో యాడ్స్​ తెగ ఇబ్బంది పెడుతుంటాయి. యాడ్స్ వల్ల మనం చదివే విషయంపై దృష్టి మరలుతుంది. అందువల్ల, గూగుల్​ క్రోమ్​లో రీడర్ మోడ్‌ను అందించారు. దీని ద్వారా ఎంటువంటి యాడ్స్​లేని కంటెంట్​ను చదువుకోవచ్చు. రీడర్ మోడ్‌ను ప్రారంభించడం కోసం మీరు చేయాల్సిందల్లా.. క్రోమ్​లో క్రొత్త ట్యాబ్‌ను తెరిచి chrome: // flags / # enable-reader-mode అని టైప్ చేసి రీడర్ మోడ్ ఆప్షన్​ను ప్రారంభించండి. రీడర్​ మోడ్​ ఎనేబుల్ అయ్యాక మీ క్రోమ్​ మెనూలో ఎంటర్ రీడర్ మోడ్ ఆప్షన్​ కూడా కనిపిస్తుంది.

స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్లలో ఒకే ట్యాబ్‌
మీరు మీ కంప్యూటర్‌లో ఏ ట్యాబ్​లనైతే ఓపెన్​ చేస్తారో.. అవే ట్యాబ్​లను టాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో ఏకకాలంలో ఓపెన్​ చేయవచ్చు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా.. అడ్రస్​ బార్​లోని URLపై రైట్​ క్లిక్ ఇచ్చి “సెండ్​ టు యువర్​ డివైజెస్​” అనే ఆప్షన్​ను ఎంచుకోండి. అయితే, మీ కంప్యూటర్​లో ఏ గూగుల్ అకౌంట్​ అయితే వినియోగిస్తున్నారో.. అదే అకౌంట్​ను ట్యాబ్​, స్మార్ట్​ఫోన్​లోనూ ఉపయోగించాలి. దీంతో మీ అన్ని డివైజెస్​లో ఒకే గూగుల్​ అకౌంట్​ సింక్​ అవుతుంది. తద్వారా మీ కంప్యూటర్​లో ఏదైతే URL ఓపెన్​ చేస్తారో.. అదే URL మిగతా డివైజెస్​లో కూడా ఓపెన్​ అవుతాయి.

స్ట్రీమింగ్ మోడ్​ ఫీచర్​
క్రోమ్​ కుడి ఎగువ మూలలోని మూడు చుక్కలపై క్లిక్ చేయడం ద్వారా, మీరు క్యాస్టింగ్​ ఆప్షన్​ ఎంపికను చూడవచ్చు. మీరు మీ బ్రౌజర్ ట్యాబ్‌లను లేదా డెస్క్‌టాప్‌ను క్రోమ్​ కాస్ట్​ డివైజ్​లో స్ట్రీమింగ్​ చేయాలనుకుంటే ఈ ఆప్షన్​ను ఎంచుకోండి. ఒకవేళ మీరు యూట్యూబ్​ లేదా OTT యాప్​లను ఉపయోగిస్తుంటే, ఇక్కడ మీరు వీడియో కంటెంట్‌ను కూడా ప్లే చేయవచ్చు.

ట్యాబ్స్​ను సేవ్​ ఫీచర్​
అకస్మాత్తుగా మీ క్రోమ్​ని మూసివేయడం ద్వారా, అప్పటికే తెరిచి ఉన్న అన్ని ట్యాబ్​లు కూడా ఆటోమేటిక్​గా మూసివేయపడతాయి. కానీ, వాటిని రీస్టోర్​ చేసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. దీని కోసం మీరు మెనూ ఓపెన్​ చేసి సెట్టింగ్స్​కు వెళ్లండి. అక్కడ మీకు ఆన్-స్టార్ట్-అప్ ఆప్షన్​ కన్పిస్తుంది. దాన్ని ఎంచుకొని మీరు ఆపివేసిన చోట మళ్లీ ట్యాబ్​లను యథావిధిగా కొనసాగించవచ్చు.

ఈజీ బ్రౌజింగ్​ కోసం ట్యాబ్స్​ గ్రూపింగ్​
ట్యాబ్స్ గ్రూపింగ్​ ఫీచర్​ అనేక ట్యాబ్‌లను ఏకకాలంలో నిర్వహించడాన్ని సులభతరం చేస్తుంది. బ్రౌజింగ్ కోసం మీరు లేబుల్స్, కలర్ కోడ్ ట్యాబ్‌లను కూడా జోడించవచ్చు. మీరు చేయాల్సిందల్లా ట్యాబ్‌పై రైట్​-క్లిక్ చేసి, ‘యాడ్​ టు న్యూ గ్రూప్​’ అనే ఆప్షన్​ను ఎంచుకోండి. తద్వారా, మీ గ్రూప్​కి ట్యాబ్‌లను జోడించవచ్చు లేదా తీసివేయవచ్చు.
First published:

అగ్ర కథనాలు