WhatsApp New Features: వాట్సప్‌లో ఈ ఫీచర్స్ వచ్చేస్తున్నాయి...

WhatsApp New Features | ఏదైనా ఛాట్ హైడ్ చేస్తే ఆర్కైవ్‌లోకి వెళ్తుంది. ఆ ఛాట్‌లో కొత్త మెసేజ్ వచ్చినా కనిపించదు. ఆర్కైవ్‌లో ఉంటుంది.

news18-telugu
Updated: April 27, 2019, 9:14 AM IST
WhatsApp New Features: వాట్సప్‌లో ఈ ఫీచర్స్ వచ్చేస్తున్నాయి...
WhatsApp New Features: వాట్సప్‌లో ఈ ఫీచర్స్ వచ్చేస్తున్నాయి...
news18-telugu
Updated: April 27, 2019, 9:14 AM IST
వాట్సప్‌లో త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లకు కొత్త ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్న వాట్సప్... మరిన్ని ఫీచర్లు రిలీజ్ చేయనుంది. స్క్రీన్‌షాట్ బ్లాక్ చేయడం, స్టేటస్‌ను ఫేస్‌బుక్‌లో షేర్ చేయడం, డూడుల్ యూఐ లాంటి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. అయితే ఈ ఫీచర్స్‌ని అందరికీ రిలీజ్ చేసే ముందు బీటా టెస్టర్లు పరీక్షిస్తున్నారు. లోపాలు సరిదిద్దిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ ఫీచర్లను అందరికీ రిలీజ్ చేస్తుంది వాట్సప్. మరి త్వరలో వాట్సప్ రిలీజ్ చేయబోయే ఫీచర్లు ఏంటీ? వాటితో ఉపయోగాలేంటీ? తెలుసుకోండి.

ఛాట్స్ స్క్రీన్ షాట్స్ బ్లాక్: వాట్సప్ చాట్ యాప్‌లో స్క్రీన్ షాట్ తీసుకోవడం సాధ్యం కాదు. మీరు ఆప్షన్ ఎనేబుల్ చేస్తేనే స్క్రీన్ షాట్ పనిచేస్తుంది. లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోవడం కుదరదు.

ఫేస్‌బుక్‌లో స్టేటస్ షేరింగ్: వాట్సప్‌లో స్టేటస్ పెట్టడం చాలామందికి అలవాటు. త్వరలో ఆ స్టేటస్‌ని నేరుగా ఫేస్‌బుక్‌లో షేర్ చేయొచ్చు. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.

వాట్సప్ డూడుల్ యూఐ: యూజర్ల కోసం డూడుల్ యూఐ రూపొందిస్తోంది వాట్సప్. ప్రస్తుతం స్టిక్కర్స్, ఎమోజీస్‌కు వేర్వేరు ట్యాబ్స్ ఉన్నాయి. ఇకపై అన్నీ ఒకే గ్రూప్‌లో కనిపిస్తాయి.



ఇగ్నోర్ ఆర్కైవ్డ్ ఛాట్స్: ఏదైనా ఛాట్ హైడ్ చేస్తే ఆర్కైవ్‌లోకి వెళ్తుంది. ఆ ఛాట్‌లో కొత్త మెసేజ్ వచ్చినా కనిపించదు. ఆర్కైవ్‌లో ఉంటుంది.

యానిమేటెడ్ స్టిక్కర్స్: ఇప్పటి వరకు వాట్సప్‌లో మామూలు స్టిక్కర్సే ఉన్నాయి. త్వరలో యానిమేటెడ్ స్టిక్కర్స్ రానున్నాయి.

Photos: అదిరిపోయిన ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్
Loading...


ఇవి కూడా చదవండి:

SBI Loans: ఎస్‌బీఐ ఆఫర్ చేస్తున్న లోన్స్ ఇవే...

Amazon Summer Sale: అమెజాన్‌లో సమ్మర్ సేల్... ఆఫర్లు ఇవే...

Jio GigaFiber: నెలకు రూ.600 చెల్లిస్తే బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ కనెక్షన్
First published: April 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...