హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

అద్భుతం: నోరు కాదు.. మీ మెదడు మాట్లాడుతుంది

అద్భుతం: నోరు కాదు.. మీ మెదడు మాట్లాడుతుంది

మెదడు

మెదడు

గొంతు కేన్సర్, పార్కిన్సన్ వ్యాధులతో బాధపడేవారికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  స్టీఫెన్ హాకింగ్.. ప్రపంచం మెచ్చిన శాస్త్రవేత్త. గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారు. వీల్ చైర్‌లో కూర్చొనే విశ్వంపై పరిశోధనలు చేశారు. నోటి మాట రాకున్నా ప్రపంచానికి పాఠాలు చెప్పారు. చిన్న కంప్యూటర్ పెట్టెను తన కళ్ల ముందు ఉంచుకొని, ‘స్పీచ్ సింథసైజర్’ సహాయంతో తన మదిలోని మాటలను పంచుకున్నారు. అయితే, ఆయనలా ఎంతో మంది మాట పడిపోయిన వాళ్లున్నారు. వారందరికీ ఈ సాంకేతికత అందలేకపోయింది. అందుకే, శాస్త్రవేత్తలు ఓ అద్భుత ఆవిష్కరణ చేశారు.


  మాట పడిపోయిన బాధితులకు గొప్ప వరాన్ని ప్రసాదించేందుకు సిద్ధమయ్యారు. తమ బాధ ఇదీ! అని చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్న వారికి సహాయం చేయడానికి రెడీ అయ్యారు. అవును.. పెదవి విప్పకుండా, గొంతుతో అరవకుండా.. మనం మాట్లాడితే? మెదడు ఆలోచనలే మాటలై బయటకు వస్తే? ఎలా ఉంటుంది. అద్భుతమే! ఇదే అద్భుతాన్ని నిజం చేశారు శాస్త్రవేత్తలు. మెదడు చర్యలను అనువదించి మాటలుగా మార్చే డీకోడర్‌ను అభివ‌ృద్ధి చేశారు. దీనితో మన మెదడు ఏది ఆలోచించినా అది వాయిస్‌లోకి మారుతుందట. గొంతు కేన్సర్, పార్కిన్సన్ వ్యాధులతో బాధపడేవారికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


  ‘చరిత్రలో తొలిసారి.. మెదడు చర్యలకు వాయిస్‌లోకి మార్చగలిగాం. దానితో, మాట్లాడలేని స్థితిలో ఉన్నవారి కోసం ఒక పరికరాన్ని తయారు చేసి అందించవచ్చు’ అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో శాస్త్రవేత్త ఎడ్వర్డ్ చాంగ్ వెల్లడించారు. మెదడులో ఆదేశాలను పంపే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని శాస్త్రవేత్తలు పరిశోధనకు తెర తీశారు. నాలుక, పెదాలు, దవడ ప్రాంతాలకు మెదడు పంపే సిగ్నల్స్‌తో ఒక అల్గారిథంను రూపొందించి ఈ డీకోడర్‌ను అభివృద్ధి చేశామని ఈ శాస్త్రవేత్తల బృందంలో ఉన్న భారత సంతతి శాస్త్రవేత్త గోపాలకృష్ణ అనుమంచిపల్లి వెల్లడించారు.

  First published:

  Tags: Cancer, Health, Health Tips, World Cancer Day

  ఉత్తమ కథలు