అవయవ మార్పిడి పరిశోధనపై ఎంతో కాలంగా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరి నుంచి మరొకరి ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ (Organ Transplant) చేయడం ఈ రోజుల్లో సాధారణమైపోయినప్పటికీ.. అవయవాల కొరత, దీర్ఘకాలంలో సరిగ్గా పనిచేయకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. దీంతో జంతువుల అవయవాలను మనుషులకు అమర్చే పరిశోధనలను దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నారు. తాజాగా దీనికి పరిష్కారం దొరికింది. ఇటీవలే శాస్త్రవేత్తలు పంది మూత్రపిండాన్ని (Pig Kidney) మానవ శరీరానికి తాత్కాలికంగా అమర్చారు. గత నెలలో అమెరికా న్యూయార్క్ యూనివర్సిటీకి (Newyork University) చెందిన పరిశోధకుల బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది.
అవయవాల కొరతను పరిష్కరించి ఇలాంటి చికిత్స పద్ధతుల్లో అవరోధాలను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు పందులపై పరిశోధన సాగించారు. వరాహాల కణాల్లో చక్కెర శాతం వల్ల మానవ శరీరానికి వీటి అవయావాలు సరిపోలడం లేదు. అయితే తాజాగా చేసిన ప్రయోగంలో జన్యు సవరణను(gene Edited) కలిగిన జంతువు నుంచి ఆర్గాన్‌ను సేకరించారు. చక్కెరను తొలగించి రోగనిరోధక వ్యవస్థపై దాడిని నివారించేలా దాన్ని మార్చారు. మరణించిన ఓ వ్యక్తి శరీరానికి వెలుపల ఉన్న రక్తనాళాల జతకు పంది కిడ్నీని శాస్త్రవేత్తలు జోడించారు. రెండు రోజుల పాటు పరిశీలనలో ఉంచారు. ఈ కిడ్నీ మూత్రపిండాల విధి అయిన వ్యర్థాల వడపోతను సమర్థవంతంగా నిర్వహించింది. అంతేకాకుండా మూత్రాన్ని ఉత్పత్తి చేసింది.
Japan Citizens :హట్సాఫ్ టు సీనియర్ సిటిజన్స్.. వంద సంవత్సరాలు దాటిన పనికి రెఢీ..
* శాస్త్రవేత్తల సంతృప్తి..
ఈ విషయంపై పరిశోధకులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా సాధారణ పనితీరును కనబర్చిందని NYU లాంగోన్ హెల్త్ లో ఈ శస్త్రచికిత్స చేసిన బృందానికి నేతృత్వం వహించిన రాబర్ట్ మోంట్ గోమేరి అన్నారు. తాము భయపడినట్లుగా తిరస్కరణ(Rejection) కాలేదని స్పష్టం చేశారు. ఈ శస్త్రచికిత్స చాలా కీలకమైన దశ అని మిన్నెసోటా మెడికల్ స్కూల్ మెడికల్ వర్సిటీకి చెందిన ఆండ్రూ ఆడమ్స్ అన్నారు. తాము సరైన దిశలోనే పయనిస్తున్నామని, తాజా పరిశోధన రోగులకు, శాస్త్రవేత్తలకు భరోసా ఇస్తుందని తెలిపారు.
Melinda - Billgates : ప్రపంచ కుబేరుడి కూతురు వివాహం ..ఖర్చు ఎంతో తెలుసా..?
* శతాబ్దాల కృషి..
జంతువుల నుంచి మానవులకు అవయవాల మార్పిడి(xenotransplantation) చేయాలనే కల శతాబ్దాలు కొనసాగుతూ వచ్చింది. 17వ శతాబ్దం వరకు జంతువుల రక్తాన్ని మార్పిడి కోసం ఉపయోగించేవారు. 20వ శతాబ్దం నాటికి వైద్యులు, బబూన్(ఓ రకమైన కోతి) నుంచి అవయవాలను మానవులకు మార్పిడి చేసేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా చనిపోతున్న శిశువుకు(Baby Fae) బబూన్ హృదయాన్ని అమర్చి 21 రోజుల పాటు జీవించేలా చేశారు.
* వాటి ప్రత్యేకత ఏంటి?
కోతులు, ఏప్స్(కొండముచ్చు) కంటే పందుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి అవయవాలను ఆహారం కోసం ఉత్పత్తి చేస్తాయి. అదే పందుల్లో మాత్రం గర్భధారణ కాలం తక్కువగా ఉన్నా.. పిల్లలను మాత్రం ఎక్కువగా కంటాయి. కాబట్టి వీటి అవయవాలను మనుషులతో పోల్చవచ్చు. అంతేకాకుండా పంది గుండె కవాటాలను దశాబ్దాలుగా మానవుల్లో విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. రక్తంలో సన్నగా ఉండే హెపారిన్‌ను పంది పేగుల నుంచి సేకరిస్తున్నారు. కాలిన గాయాలపై పిగ్ స్కిన్ గ్రాఫ్ట్స్ ఉపయోగిస్తున్నారు. చూపును మెరుగుపరచడానికి చైనీస్ సర్జన్లు పంది కార్నియాను ఉపయోగించారు.
మళ్లీ పేట్రేగిన Kim Jong un -జపాన్ జలాల్లోకి North Korea బాలిస్టిక్ మిస్సైల్
NYU కేసులో మాత్రం మరణించిన మహిళ కుటుంబం నుంచి అంగీకారం తీసుకున్న తర్వాత పరిశోధకులు ఆ దేహాన్ని వెంటిలేటర్ పై ఉంచారు. అంతేకాకుండా సదరు మహిళ తన అవయవాలను దానం చేయాలనుకుంది. అయితే అవి దానానికి పనికి రావు. దీంతో ఆ దేహానికి పంది కిడ్నీని అమర్చారు.
* అవయవాల కోసం ప్రత్యేకంగా పందుల పెంపకం..
మానవ అవయవాల కొరతను తగ్గించడానికి మార్పిడికి అనువైన పంది అవయవాలను ట్రాన్స్ ప్లాంట్ చేసేందుకు అనేక బయోటెక్ కంపెనీలు పోటీపడుతున్నాయి. అమెరికాలో 90 వేల మందికి పైగా ప్రజలు మూత్రపిండాల మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి రోజూ 12 మంది తమ వంతు కోసం వేచి చూస్తున్నారు. అడ్వాన్స్ యునైటెడ్ థెరఫ్యూటిక్స్ అనుబంధ సంస్థ అయిన రివైవికర్ కఠిన నియంత్రణ పరిస్థితుల్లో 100 పందులను పెంచుతోంది. ఇందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మానవ రోగనిరోధక వ్యవస్థపై తక్షణ దాడిని ప్రేరేపించే చక్కెర అయిన ఆల్ఫా గాల్ ను ఉత్పత్తి చేసే జన్యువు వీటికి లేదు.
పాపం.. పెళ్లికాని ప్రసాద్‌లకు షాక్.. ఆ దేశంలోని మహిళలు అలా డిసైడయ్యారట
* సమస్యలకు పరిష్కారం దొరికినట్లేనా?
గత నెలలో చేసిన ప్రయోగం రాబోయే సంవత్సరాల్లో జీవించే వ్యక్తుల్లో పంది కిడ్నీ లేదా గుండె మార్పిడికి మార్గం సుగమం చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇదే సమయంలో అవయవ దాతలుగా పందులను పెంచడం కొంతమందికి తప్పు అనిపిస్తోంది. అయితే జంతువుల సంక్షేమం గురించి ఆందోళనలను పరిష్కరించగలిగితే ఈ విధానం మరింత ఆమోదయోగ్యంగా మారవచ్చు అని హేస్టింగ్ సెంటర్ లోని పరిశోధకుడిగా పనిచేస్తున్న కరెన్ మష్కే అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Medical Research, Technology