ఇంటర్‌స్టెల్లార్ ప్లానెట్... కొత్త గ్రహాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు

ఇంటర్‌స్టెల్లార్ ప్లానెట్... కొత్త గ్రహాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు (ప్రతీకాత్మక చిత్రం)

New Planet: ఈ కొత్త గ్రహం ఎక్కడుంది? నాసా ఎందుకు దీని గురించి ఎక్కువ పరిశోధన చెయ్యాలనుకుంటోంది? ఆసక్తికర విషయం తెలుసుకుందాం.

 • Share this:
  కొత్త గ్రహం గురించి చెప్పుకునే ముందు... మనం ఓ విషయం మాట్లాడుకుందాం. అదే... మన సౌరకుటుంబం లోని... జూపిటర్. (గురుగ్రహం). మన గ్రహాలన్నింటిలోకీ పెద్దది గురు గ్రహమే. అది ఎంత పెద్దదంటే... మన భూమి లాంటి గ్రహాలు 1300 అందులో పట్టేస్తాయి. మనుషులు జీవించేందుకు గురు గ్రహం ఉపయోగపడేలా లేదు. అదే ఆ గ్రహంపై జీవం ఉండి ఉంటే... మన భూమి నుంచి... గురు గ్రహానికి ట్రిప్స్ వేసేవాళ్లే. ఇదంతా ఎందుకంటే... అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తలు కనుక్కున్న గ్రహం... జూపిటర్ సైజులోనే ఉంది. సూర్యుడి కక్ష్యలో తిరుగుతున్న ఒక డెడ్ స్టార్ (వైట్ డ్వార్ఫ్) కక్ష్యలో ఈ గ్రహం తిరుగుతున్నట్టు వారు చెబుతున్నారు. వైట్ డ్వార్ఫ్‌కు సుమారు ఏడు రెట్లు పెద్దదిగా గ్రహం ఉందని విశ్లేషిస్తున్నారు.

  నాసా ప్రయోగాలతో వెలుగులోకి:
  ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS), రిటైర్డ్ స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా గ్రహం ఉనికిని తాము కనిపెట్టినట్టు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - NASA ప్రకటించింది. ఈ భారీ గ్రహానికి నాసా... WD 1856 B అని పేరు పెట్టింది. నార్తర్న్ కన్స్‌స్టల్లేషన్ డ్రాకో నుంచి ఇది 80 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సుమారు 10 బిలియన్ సంవత్సరాల వయసు ఉండే వైట్ డ్వార్ఫ్‌కి 11,000 మైళ్ల (18,000 కిలోమీటర్లు) పరిధిలోని కక్ష్యలో ఈ గ్రహం తిరుగుతోంది. ఇది ట్రిపుల్ స్టార్ సిస్టమ్‌లో భాగంగా కనిపిస్తోంది.

  వైట్ డ్వార్ఫ్ దగ్గర ఏదైనా వస్తువు ఉండటం చాలా అరుదు. ఎందుకంటే దాని దగ్గర్లో ఉండే వస్తువులన్నీ వైట్ డ్వార్ఫ్ క్రియేషన్ ప్రాసెస్‌లో నాశనమవుతాయి. ఇప్పుడు ఉన్న ప్రదేశానికి ఈ గ్రహం ఎలా వచ్చిందో తెలియట్లేదని విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్శిటీలో పరిశోధనా బృందం సభ్యుడు, ఆస్ర్టానమీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆండ్రూ వాండర్బర్గ్ చెబుతున్నారు. "వైట్ డ్వార్ఫ్ క్రియేషన్ ప్రాసెస్ దగ్గర్లోని గ్రహాలు నాశనమవుతాయి. అయినా WD 1856 B ఎలా ఉనికిలో ఉందో తెలుసుకోవాలి" అని ఆయన వివరిస్తున్నారు.

  శాస్త్రవేత్తలు కనుక్కున్నవాటిలో ఇదే చల్లటి గ్రహం:
  వైట్ డ్వార్ఫ్ సమీప కక్ష్యల్లో గ్రహాలు ఉన్నట్టు ఇప్పటి వరకు తేలలేదని నిపుణులు చెబుతున్నారు. "గ్రహాలు తమ కక్ష్య నుంచి లోపలికి వచ్చే అవకాశముంది. కానీ ఇలా ప్రయాణిస్తున్న గ్రహాన్ని కనుక్కోవడం ఇదే తొలిసారి" అని బృంద సభ్యురాలు, రచయిత సియైక్సు తెలిపారు. గ్రహం నుంచి ఎలాంటి కాంతిని, ఇన్‌ఫ్రారెడ్ తరంగాలను కూడా తాము చూడలేదని ఆమె చెబుతున్నారు. అంటే ఆ గ్రహం చాలా చల్లగా ఉండొచ్చని, వారు ఇప్పటివరకు కనుక్కున్న చల్లటి గ్రహాల్లో ఇదే మొదటిదని ఆమె వివరిస్తున్నారు.

  గ్రహం దాని కక్ష్య నుంచి ఎలా ముందుకు వస్తుంది?, వైట్ డ్వార్ఫ్ ప్రభావం దానిపై ఎలా ఉంది... అనేవి తెలుసుకునేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఈ భారీ గ్రహం ప్రస్తుత ప్రదేశానికి కనీసం 50 రెట్లు దూరం నుంచి వచ్చి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: