కాన్సర్, ముసలితనానికి చెక్... విప్లవాత్మక పరిశోధన... ఎప్పటికీ యంగ్ గానే ఉంటామా?

ముసలితనమే ఓ రోగం అంటాడో కవి. వయసు మీద పడితే రకరకాల అనారోగ్య సమస్యలు, మనకు మనమే భారం అయ్యే పరిస్థితి ఉంటుంది. అసలీ ముసలితనం ఎందుకొస్తోంది? అది రాకుండా చేస్తే... ఈ దిశగా భారీ ముందడుగు పడింది.

news18-telugu
Updated: October 17, 2020, 2:55 PM IST
కాన్సర్, ముసలితనానికి చెక్... విప్లవాత్మక పరిశోధన... ఎప్పటికీ యంగ్ గానే ఉంటామా?
కాన్సర్, ముసలితనానికి చెక్... విప్లవాత్మక పరిశోధన... ఎప్పటికీ యంగ్ గానే ఉంటామా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వయసు పెరుగుతున్న కొద్దీ మానవ శరీరంలో వృద్ధాప్య ఛాయలు రావడం సహజం. అంతేకాక ముసలితనంలో కాన్సర్ వంటి వ్యాధుల భారిన పడే ప్రమాదం ఎక్కువ. దీనికి గల కారణాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఈ మధ్య కొత్త టెక్నాలజీని తయారుచేశారు. దాని ద్వారా... కణాలకు ముసలితనం రాకుండా చేయగలుగుతున్నారు. అంటే... మనుషులకు ముసలితనం రాకుండా చేయగలిగినట్లే. సాధారణంగా మనిషి శరీరంలోని కణాలు క్రమం తప్పకుండా విభజింపబడుతూ ఉంటాయి. ఒకవేళ కణాల్లో విభజన జరగకపోతే ఆ కణాలు చనిపోతాయి. మనం వయసులో ఉన్నంతకాలం... ఈ కణ విభజన జోరుగా జరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ... కణ విభజన తగ్గిపోతూ ఉంటుంది. అంటే... కొత్త కణాలు రావు... ఉన్న కణాలు చనిపోతూ ఉంటాయి. తద్వారా ముడతలు, ముసలి తనపు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కొత్త కణాలు రాని పరిస్థితుల్లో కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

మన శరీరంలోని క్రోమోజోముల చివర్లలో టెలోమియర్స్ అని పిలిచే డి-ఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ (DNA) విస్తరించి ఉంటుంది. కణ విభజన సమయంలో ఈ టెలోమియర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఈ టెలోమియర్ల సంఖ్య ఎంత తక్కువగా ఉంటే... కణ విభజన అంత తక్కువగా ఉంటుంది. అందువల్ల టెలోమియర్ల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలి. సంఖ్య తగ్గువగా ఉంటే కణ విభజన ఆగిపోతుంది. క్రమంగా ఆ కణం... ముసలిది అవుతూ... చనిపోతుంది. సో... మనుషులు ఏం చెయ్యాలంటే... టెలోమియర్లు సరిగ్గా పనిచేసేలా, వాటి సంఖ్య ఎక్కువగా ఉండేలా చేసుకోవాలి. అందుకు అందుకు ఏం చెయ్యాలనే అంశంపై తాజాగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. టెలోమెరిక్ రిపీట్-కంటెయినింగ్ RNA (టెర్రా) అనే RNA జాతి...టెలీమియర్లు బాగా పనిచేయడానికి సాయపడుతుందని కనుక్కున్నారు.

సో, టెలోమియర్లు బాగా పనిచేయడానికి టెర్రా ఆర్ఎన్ఏలను నియమిస్తారు. ఇవి టెలోమియర్ల సంఖ్య బాగా ఉండేలా చేస్తాయి. టెలోమియర్లను చురుగ్గా చేస్తాయి. టెలోమియర్లను రిపేర్ చేస్తాయి. అందువల్ల టెలోమియర్ల సంఖ్య పెరుగుతుంది... అప్పుడు కణ విభజన జరుగుతూ ఉంటుంది. అంటే... ముసలితనం రానట్లే. టెలోమియర్లు బాగా పనిచెయ్యాలంటే రైబోన్యూక్లిక్ యాసిడ్ (RNA) ముఖ్యమన్నమాట.

టెర్రా అవసరమైన స్థానానికి చేరాక... అనేక ప్రోటీన్లు టెలోమియర్లతో ఉండే అనుబంధాన్ని నియంత్రిస్తాయి. దీనికి గాను RNA-51 అనే ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుందని కనుగొన్నారు. RNA–DNA హైబ్రిడ్ మాలిక్యూల్స్‌గా పిలిచే టెలోమెరిక్ DNAకి టెర్రా RAD-51 సాయం చేస్తున్నట్లు ఎకోల్ పాలిటెక్నిక్ ఫెడరెల్ డి లౌసాన్, మసారిక్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ విధమైన హైబ్రిడ్ అణువుల నిర్మాణం గతంలో DNA విషయంలో మాత్రమే కనుక్కున్నారు. ఇప్పుడు టెలోమియర్లు విషయంలోనూ ఇది జరగడం విప్లవాత్మకమైనదని పరిశోధకులు తెలిపారు.
Published by: Krishna Kumar N
First published: October 17, 2020, 2:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading