UPI Frauds: డిజిటల్ ఇండియా(Digital india) పుణ్యామా అని దేశంలో యూపీఐ (Unified Payment Interface) లావాదేవీలు మొదలయ్యాయి. కొవిడ్‌లో మొదలైన సోషల్ డిస్టెన్స్‌తో ఈ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు కూరగాయల నుంచి ఫ్లైట్ టికెట్ వరకు అన్నింటినీ వీటితోనే చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గణాంకాల ప్రకారం 2022లోని ఫిబ్రవరి ఒక్క నెలలోనే రూ.24 కోట్ల నుంచి రూ.36 కోట్ల వరకు యూపీఐ పేమెంట్స్ జరిగాయి. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఇదే అదునుగా కొంతమంది ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. కొతకాలంగా యూపీఐ ఫ్రాడ్స్ ఎక్కువ అవుతున్నాయి.
అమాయకులకు రకరకాల కారణాలు చెప్పి, ఎర వేసి మరీ సైబర్ నేరగాళ్లు యూపీఐ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ‘పేమెంట్ మిస్టేక్’ ట్రిక్ ఉపయోగిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. ఇందులో మీ ఖాతాకు డబ్బులు పంపుతారు. పొరపాటున జరిగినట్లు నమ్మించి, తిరిగి తమకు చెల్లించమంటారు. మనం వాళ్లకు రివర్స్ పే చేసే సమయంలో మన యూపీఐ వివరాలు హ్యాక్ చేసి, మన ఖాతా ఖాళీ చేస్తారు. ముంబైలో జరిగిన ఇలాంటి యూపీఐ స్కాంలో సుమారు 81 మంది నుంచి రూ.1కోటి కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు.
2022-23 మధ్య కాలంలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి 95,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసినప్పటికీ స్కామర్లు ఏదో రూపంలో మోసాలకు పాల్పడుతున్నారు.
* అది కచ్చితంగా మోసమే..
రాంగ్ ట్రాన్సాక్షన్ జరిగిందని, తిరిగి చెల్లించాలని, వాటి స్క్రీన్‌షాట్లు పెట్టమని ఎవరైనా మిమ్మల్ని అడిగితే అనుమానించండి. యూపీఐ ఉపయోగించి తిరిగి చెల్లిస్తే, మాల్వేర్ చొరబడేలా చేస్తారు. మాల్వేర్ ఫిషింగ్, హ్యూమన్ ఇంజినీరింగ్ సాయంతో మీ బ్యాంకు , ఆధార్, పాన్ (PAN), కేవైసీ వివరాలను యాక్సెస్ చేయగలరు. యూపీఐ గేట్ వేను హ్యాక్ చేసే అవకాశం ఉంది. మీ మొబైల్‌లో యాంటీ-మాల్వేర్ సాఫ్ట్‌వేర్ ఉన్నా అది సరిపోకపోవచ్చు.
Google: ఏఐ చాట్‌బాట్ ట్రైనింగ్ కోసం జీమెయిల్ డేటా వాడుతున్న గూగుల్ ..? కంపెనీ రెస్పాన్స్ ఇదే..
** ఈ జాగ్రత్తలు తప్పనిసరి
యూపీఐ చెల్లింపులు లేదా ఆన్‌లైన్ లావాదేవీలు చేసేవారు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..
* పర్యవేక్షణ: యూపీఐ లావాదేవీలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. ఏదైనా అనుమానంగా ఉంటే వెంటనే బ్యాంక్‌ను సంప్రదించండి.
* అప్‌డేట్: మీ యూపీఐ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయండి. దీని వల్ల కొత్త బగ్ పరిష్కారాలు అవ్వడం ద్వారా భద్రత పెరుగుతుంది.
* పరిమితి: వేర్వేరు యూపీఐ యాప్‌ల నుంచి కాకుండా ఒకటే యూపీఐ నుంచి లావాదేవీలు నిర్వహించండి. దీంతో ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు.
* ఓటీపీ విషయంలో జాగ్రత్త: యూపీఐ, పిన్, ఓటీపీలకు సంబంధించి వచ్చే కాల్స్, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి. అలాంటి వాటికి స్పందించకపోవడం ఉత్తమం,
* చెకింగ్: చెల్లించే ముందు వారి పేరు, యూపీఐ ఐడీ, ఇతర వివరాలను ఒకటికి, రెండుసార్లు చెక్ చేసుకోండి. అనుమానం ఉంటే క్రాస్‌చెక్ చేసుకోండి.
* ఎవరికీ చెప్పొద్దు: మీ యూపీఐ పిన్, ఇతర వివరాలను అత్యంత నమ్మకమైన వ్యక్తులతో కూడా షేర్ చేసుకోవద్దు. వాటి వివరాలు గోప్యంగా ఉంచండి.
* పిన్: మీ పుట్టినరోజు లేదా ఫోన్ నంబర్ వంటివాటిని పిన్‌లుగా పెట్టుకోవద్దు. ఇతరులు ఊహించేందుకు కష్టంగా ఉండే పిన్‌ను సెట్ చేసుకోండి.
* విశ్వసనీయత: బ్యాంక్ లేదా అధికారిక యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేయండి. విశ్వసనీయత లేని సోర్స్‌ల నుంచి వీటిని డౌన్‌లోడ్ చేయొద్దు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Technology, UPI, Upi payments