హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

SBI WhatsApp Banking: ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్‌లో మరిన్ని సేవలు... ఇలా రిజిస్టర్ చేయండి

SBI WhatsApp Banking: ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్‌లో మరిన్ని సేవలు... ఇలా రిజిస్టర్ చేయండి

SBI WhatsApp Banking: ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్‌లో మరిన్ని సేవలు... ఇలా రిజిస్టర్ చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)

SBI WhatsApp Banking: ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్‌లో మరిన్ని సేవలు... ఇలా రిజిస్టర్ చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

SBI WhatsApp Banking | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వాట్సప్ బ్యాంకింగ్‌లో మరిన్ని సేవల్ని అందిస్తోంది. మొదట్లో 3 సేవలు అందుబాటులో ఉంటే, ఇప్పుడు 9 సేవలు లభిస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆరు నెలల క్రితం వాట్సప్ బ్యాంకింగ్ (WhatsApp Banking) సేవల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట ఇందులో కేవలం మూడు సేవలు మాత్రమే లభించేవి. కానీ ఇప్పుడు ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్‌లో 9 సేవలు లభిస్తున్నాయి. కాబట్టి చాలావరకు సేవలు పొందడానికి ఎస్‌బీఐ ఖాతాదారులు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. తమ స్మార్ట్‌ఫోన్‌లోనే కేవలం వాట్సప్ ఉపయోగిస్తూ బ్యాంకింగ్ సేవల్ని (Banking Services) పొందొచ్చు. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు పొందాలంటే ముందుగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఎలా రిజిస్టర్ చేయాలో తెలుసుకోండి.

ఎస్‌బీఐ ఖాతాదారులు బ్యాంకులో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి SMS WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ టైప్ చేసి 917208933148 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఆ తర్వాత +919022690226 నెంబర్‌ తమ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేయాలి. ఇదే నెంబర్‌కు వాట్సప్‌లో Hi అని టైప్ చేసి మెసేజ్ పంపాలి. ఈ కింది 9 ఆప్షన్స్ వస్తాయి.

Train Tickets: ఈ క్రెడిట్ కార్డ్ ఉందా? రైలు టికెట్లపై 5 శాతం డిస్కౌంట్ పొందండి

1. అకౌంట్ బ్యాలెన్స్

2. మినీ స్టేట్‌మెంట్

3. పెన్షన్ స్లిప్

4. డిపాజిట్ ప్రొడక్ట్స్ సమాచారం (సేవింగ్స్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్, టర్మ్ డిపాజిట్-ఫీచర్స్, వడ్డీ రేట్లు)

5. లోన్ ప్రొడక్ట్స్ సమాచారం (హోమ్ లోన్, కార్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ , ఎడ్యుకేషన్ లోన్- వడ్డీరేట్లు)

6. ఎన్ఆర్ఐ సేవలు (ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఓ అకౌంట్)- FAQ, ఫీచర్స్, వడ్డీ రేట్లు

7. ఇన్‌స్టా అకౌంట్స్ ఓపెనింగ్ (ఫీచర్స్, అర్హతలు, అవసరాలు, FAQ)

8. కాంటాక్ట్స్/గ్రీవెన్స్ రిడ్రెస్సల్ హెల్ప్‌లైన్స్

9. ప్రీ-అప్రూవ్డ్ లోన్‌కు సంబంధించిన ప్రశ్నలు (పర్సనల్ లోన్, కార్‌లోన్, టూవీలర్ లోన్)

వీటిలో ఖాతాదారులు తమకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. రిప్లై రూపంలో మీకు కావాల్సిన సమాచారం వస్తుంది. అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడం మాత్రమే కాదు పెన్షన్ స్లిప్ పొందడం, ప్రీ-అప్రూవ్డ్ లోన్ సమాచారం తెలుసుకోవడం కూడా వాట్సప్ ద్వారా సాధ్యమే.

Train Tickets: ఈ ట్రిక్‌తో బుక్ చేస్తే ట్రైన్ టికెట్స్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ

ఎస్‌బీఐ ఖాతాదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మాత్రమే వాట్సప్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇక ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు వాట్సప్ ద్వారా సేవలు చాలాకాలంగా లభిస్తున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు తమ అకౌంట్ వివరాలు, రివార్డ్ పాయింట్స్, ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్, కార్డ్ పేమెంట్స్ లాంటి డీటెయిల్స్ వాట్సప్‌లో తెలుసుకోవచ్చు.

First published:

Tags: Sbi, State bank of india, Whatsapp

ఉత్తమ కథలు