స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అకౌంట్ హోల్డర్లకు అలర్ట్. మీ బ్యాంక్ అకౌంట్ పాస్‌వర్డ్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అని హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ. వీక్ పాస్‌వర్డ్స్‌తో మీ బ్యాంకు ఖాతాలకు ముప్పేనని వార్నింగ్ ఇస్తోంది. సైబర్ నేరగాళ్లు అంత సులువుగా కనిపెట్టలేని పాస్‌వర్డ్ పెట్టుకోవాలని సూచిస్తోంది. పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా ఉంటేనే మీ బ్యాంక్ అకౌంట్ లేదా, బ్యాంకింగ్ యాప్స్ (Banking App) సురక్షితంగా ఉంటాయి. యూజర్లు తాము స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్ పెట్టుకున్నామనే అనుకుంటారు కానీ... చాలా సందర్భాల్లో అవి వీక్ పాస్‌వర్డ్సే ఉంటాయి. మరి పాస్ వర్డ్ ఎలా ఉండాలి? ఎలాంటి పాస్‌వర్డ్స్ పెట్టుకోవద్దు? పాస్‌వర్డ్ సెట్ చేసుకునేముందు ఏఏ టిప్స్ పాటించాలి? తెలుసుకోండి.
A strong password ensures higher levels of security.
Here are 8 ways in which you can create an unbreakable password and protect yourself from cybercrime. Stay alert & #SafeWithSBI!#StaySafeWithSBI #CyberSafety #StrongPassword #OnlineSafety #CyberCrime #StaySafe pic.twitter.com/PxdVJ5SdY3
— State Bank of India (@TheOfficialSBI) November 14, 2021
1. అప్పర్ కేస్, లోయర్ కేస్, నెంబర్స్ కలిపి పాస్‌వర్డ్ పెట్టాలి. ఉదాహరణకు పాస్‌వర్డ్‌లో ABCD..., abcd..., 1234.. లాంటి కాంబినేషన్ ఉండాలి. కేవలం అప్పర్ కేస్, లోయర్ కేస్, నెంబర్స్ మాత్రమే పాస్‌వర్డ్ పెట్టొద్దు. కాంబినేషన్ తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి.
2. పాస్‌వర్డ్‌లో @_+= లాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే పాస్‌వర్డ్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అంటే అప్పర్ కేస్, లోయర్ కేస్, నెంబర్‌తో పాటు స్పెషల్ క్యారెక్టర్స్ కలిపితే స్ట్రాంగ్ పాస్‌వర్డ్ అవుతుంది.
Whatsapp: వామ్మో... వాట్సప్‌లో కొత్త స్కామ్... వెంటనే మీ స్నేహితులకు చెప్పండి
3. పాస్‌వర్డ్‌లో కనీసం 8 క్యారెక్టర్లు ఉండాలి. ఆ 8 క్యారెక్టర్లలో పైన చెప్పినవన్నీ అంటే అప్పర్ కేస్, లోయర్ కేస్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ కలిపి ఉండాలి. 12 క్యారెక్టర్ల వరకు పాస్‌వర్డ్ పెట్టినా మంచిది. అంతకన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటే గుర్తుంచుకోవడం కష్టం.
4. కామన్ వర్డ్స్ పాస్‌వర్డ్‌గా పెట్టొద్దు. itislocked, thisismypassword, nopassword అనే సింపుల్ పాస్‌వర్డ్స్ పెట్టొద్దు. ఇవి స్ట్రాంగ్ పాస్‌వర్డ్ అని మీరు అనుకోవచ్చు కానీ... హ్యాకర్లకు అవి చాలా సింపుల్ పాస్‌వర్డ్స్.
5. ఇక కీబోర్డ్‌లో సింపుల్‌గా గుర్తుంచుంది కదా అని qwerty, asdfg లాంటి పాస్‌వర్డ్స్ అస్సలు పెట్టొద్దు. మీ పాస్‌వర్డ్ పటిష్టంగా ఉండాలంటే :), :/ లాంటి ఎమోషన్స్‌ని పాస్‌వర్డ్‌లో యాడ్ చేయాలి.
Airtel: ఎయిర్టెల్ యూజర్లకు రోజూ అదనంగా 500 ఎంబీ డేటా... ఎలా పొందాలంటే
6. ఇక 12345678, abcdefg లాంటి ఈజీ పాస్‌వర్డ్స్ పెడితే మీకు రిస్కే. బ్యాంక్ అకౌంట్ కాకుండా మీరు ఎప్పుడో ఓసారి ఉపయోగించే అకౌంట్ అయినా పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా ఉండాలి.
7. వీటితో పాటు DOORBELL బదులు DOOR8377 లాంటి సబ్‌స్టిట్యూట్ పాస్‌వర్డ్స్ కూడా పెట్టొద్దని చెబుతోంది ఎస్‌బీఐ.
8. పాస్‌వర్డ్ చాలా పెద్దగా ఉండాలి కదా అని పేరును, పుట్టిన తేదీ లేదా సంవత్సరాన్ని పాస్‌వర్డ్‌లో పెట్టొద్దు. ఉదాహరణకు Ramesh@1967 అనే పాస్‌వర్డ్ ఉండొద్దు.
బ్యాంక్ అకౌంట్, బ్యాంకింగ్ యాప్స్ మాత్రమే కాదు... వ్యక్తిగత అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్‌కు కూడా ఇవే పాస్‌వర్డ్ టిప్స్ ఫాలో కావొచ్చు. ఏ పాస్‌వర్డ్ అయినా ఇతరులు ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు సులువుగా గుర్తించలేనిదై ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank account, Mobile Banking, Password, Personal Finance, Sbi, State bank of india