SBI ATM డెబిట్ కార్డు బ్లాక్ చెయ్యాలా... SMSతో ఈజీగా చెయ్యండి

SBI Debit Card Block : డెబిట్ కార్డు బ్లాక్ చెయ్యాలంటే ఇప్పుడు చాలా ఆప్షన్లు వచ్చేశాయి. వాటిలో ఈజీ ఆప్షన్ SMS. అదెలాగో తెలుసుకుంటే... మంచిదే.

news18-telugu
Updated: March 2, 2020, 11:02 AM IST
SBI ATM డెబిట్ కార్డు బ్లాక్ చెయ్యాలా... SMSతో ఈజీగా చెయ్యండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
SBI Debit Card Block : డెబిట్ కార్డు మన దగ్గర ఉన్నంత వరకూ ఏ సమస్యా ఉండదు. అదే ఆ కార్డు పోయినా, ఎవరైనా కొట్టేసినా... నెక్ట్స్ నిమిషం నుంచీ టెన్షన్ మొదలవుతుంది. ఆ టైంలో మన మొబైల్‌కి ఏ మెసేజో వచ్చిందంటే... టెన్షన్ మరింత పెరుగుతుంది. ఎందుకంటే మన కార్డుతో ఇంకెవరైనా మనీ డ్రాచేసేశారేమో అనే టెన్షన్. ఐతే... SBI... డెబిట్ కార్డులను ఈజీగా బ్లాక్ చేసేందుకు SMS ఆప్షన్ తెచ్చింది. అందువల్ల డెబిట్ కార్డు పోయినా, చోరీ అయినా టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఆ కార్డుతో ఎవరూ ఎలాంటి ట్రాన్సాక్షన్లూ, మనీ డ్రాలూ చెయ్యకుండా ఉండేందుకు... ముందు మనం చెయ్యాల్సింది ఆ కార్డును బ్లాక్ చెయ్యడమే కదా. అందుకోసం మామూలుగా అయితే... బ్యాంక్ కస్టమర్ కేర్‌కి కాల్ చేసి... వాళ్లు చెప్పినట్లు 1, 2, 3 ఇలా రకరకాల నంబర్లు నొక్కితే... కాసేపటి తర్వాత గానీ కస్టమర్ కేర్ ప్రతినిధి మనతో మాట్లాడే పరిస్థితి ఉండదు. అంతసేపు కార్డు కొట్టేసిన వాళ్లు ఊరుకుంటారా. ఎంత త్వరగా మనీ డ్రా చేసేద్దామా అని కార్డును క్లోనింగ్ చేసేస్తారు. కాబట్టి... వీలైనంత త్వరగా కార్డును బ్లాక్ చెయ్యడానికి ఆన్‌లైన్‌ రూట్ ఫాలో అవ్వొచ్చు. లేదంటే... SBI మొబైల్ యాప్ ద్వారా చెయ్యొచ్చు. వీటన్నింటికంటే ఈజీ మెథడ్ ఒకటుంది. సింపుల్‌గా ఓ మెసేజ్ (SMS) పంపితే చాలు... కార్డు బ్లాక్ అవుతుంది.

ఇది టోల్-ఫ్రీ SMS ఫెసిలిటీ. SBI క్విక్ యాప్ ద్వారా... ఈ సదుపాయం అందుతోంది. ఈ సర్వీసులు అందుకోవడానికి SMS పంపడం లేదా... మిస్డ్ కాల్ ఇవ్వడం చెయ్యాలి. ATM కార్డును బ్లాక్ చెయ్యడంతోపాటూ... PoS, ATM, ఇంటర్నేషనల్ దగ్గర.... ATM కార్డును స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ చెయ్యడం వంటి సదుపాయం కూడా ఉంది. అంతేకాదు... SBI కస్టమర్లు ఈ క్విక్ యాప్ ద్వారా... తమ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, మినీ స్టేట్‌మెంట్ తీసుకోవచ్చు, చెక్ బుక్ కోసం రిక్వెస్ట్ పంపొచ్చు, గత ఆరు నెలల అకౌంట్ స్టేట్‌మెంట్ కోరచ్చు, హోమ్ లోన్ తీసుకోవచ్చు, ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ సర్టిఫికెట్స్ పొందొచ్చు.

SBI ATM డెబిట్ కార్డును SMS ద్వారా ఇలా బ్లాక్ చెయ్యండి :

BLOCK<space>XXXX అని టైప్ చేసి 567676కి SMS పంపండి. (ఇక్కడ XXXXలో... మీ ATM కార్డులోని చివరి 4 అంకెలను ఎంటర్ చెయ్యాలి).

వెంటనే మీకు ఓ మెసేజ్ వస్తుంది. అందులో మీ టికెట్ నంబర్, బ్లాక్ చేసే డేట్, బ్లాక్ చేసే టైమ్ వివరాలు ఉంటాయి.

పై సర్వీసులు పొందాలంటే... మీరు ఏ మొబైల్ నంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌కి లింక్ చేశారో... ఆ మొబైల్ నంబర్‌నే ఉపయోగించాలి. అప్పుడే ఈ సేవలు మీకు అందుతాయి. మీరు ఆల్రెడీ మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేయించి ఉంటే, మీరు ఈజీగా పై సేవల్ని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మొబైల్ నంబర్ రిజిస్టర్ కాకపోతే... ఓ SMS పంపడం ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఇందుకోసం REG<space>మీ అకౌంట్ నంబర్ ఎంటర్ ఎంటర్ చెయ్యండి. తర్వాత 09223488888కి SMS పంపండి. తద్వారా మీ ఫోన్ నంబర్... రిజిస్టర్ అవుతుంది.
First published: March 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading