Home /News /technology /

SAMSUNGS NO MO FOMO FESTIVAL SALE ANNOUNCED AND CUSTOMERS CAN GET SAMSUNG GALAXY SMARTPHONES TABLETS LAPTOPS AT HUGE SAVINGS GH SRD

Samsung Discounts: శామ్‌సంగ్ స్పెషల్ ఫెస్టివల్ సేల్.. గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌పై భారీ డిస్కౌంట్స్‌..

Samsung Discounts: శామ్‌సంగ్ స్పెషల్ ఫెస్టివల్ సేల్.. గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌పై భారీ డిస్కౌంట్స్‌..

Samsung Discounts: శామ్‌సంగ్ స్పెషల్ ఫెస్టివల్ సేల్.. గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌పై భారీ డిస్కౌంట్స్‌..

Samsung Discounts: శామ్‌సంగ్ తాజాగా "నో మో’ ఫోమో ఫెస్టివల్ సేల్ (NO MO’ FOMO)" ప్రకటించింది. ఈ సేల్ ద్వారా శామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్‌, ల్యాప్‌టాప్స్‌, హోమ్ అప్లయెన్సెస్, వేరబుల్స్‌, తదితర ప్రొడక్ట్స్‌పై మెగా ఆఫర్లు, అట్రాక్టివ్ క్యాష్‌బ్యాక్స్‌ పొందవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ఇండియాలో ఫెస్టివల్ సీజన్ (Festival Sale) ప్రారంభమైన వేళ చాలా కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతదేశపు అత్యంత విశ్వసనీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్‌సంగ్ (Samsung) కూడా సరికొత్త సేల్‌తో ముందుకు వచ్చింది. ఈ కంపెనీ తాజాగా "నో మో’ ఫోమో ఫెస్టివల్ సేల్ (NO MO’ FOMO)" ప్రకటించింది. ఈ సేల్ ద్వారా శామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్‌, ల్యాప్‌టాప్స్‌, హోమ్ అప్లయెన్సెస్, వేరబుల్స్‌, తదితర ప్రొడక్ట్స్‌పై మెగా ఆఫర్లు, అట్రాక్టివ్ క్యాష్‌బ్యాక్స్‌ పొందవచ్చు. మరి ఆ ఆఫర్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆఫర్లు Samsung.com, శామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, 'శామ్‌సంగ్ షాప్ (Samsung Shop)' యాప్‌లో అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు శామ్‌సంగ్ షాప్ యాప్ ద్వారా తమ మొట్టమొదటి కొనుగోలు పూర్తి చేసి రూ.4,500 వరకు అడిషనల్ డిస్కౌంట్ పొందొచ్చు. Samsung.com నుంచి శామ్‌సంగ్ ప్రొడక్ట్స్‌ను షాపింగ్ చేసేవారు 28 వేల పిన్ కోడ్‌లలో సూపర్‌ఫాస్ట్ హోమ్ డెలివరీ సర్వీస్‌ను ఆస్వాదించవచ్చు. లేదంటే నచ్చిన శామ్‌సంగ్ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న 1,300కి పైగా శామ్‌సంగ్ స్పెషల్ స్టోర్స్‌ విజిట్ చేయవచ్చు. ఇది కూడా చదవండి : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్‌లో ధమాకా ఆఫర్లు.. ఇలాంటి ఆఫర్లు మళ్లీ రావు బాసూ..! * ట్యాబ్లెట్స్‌, వేరబుల్స్‌, మరిన్నిటిపై ఆఫర్లు గెలాక్సీ ట్యాబ్లెట్స్‌, వేరబుల్స్‌, అప్లయెన్సెస్ కొనుగోలు చేసేవారు 55% వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. కొత్త గెలాక్సీ ల్యాప్‌టాప్‌ల సెలెక్టెడ్ మోడల్స్‌పై 30% వరకు తగ్గింపు పొందొచ్చు. అలానే ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌లతో సహా శామ్‌సంగ్ డిజిటల్ అప్లయెన్సెస్‌ను 43% వరకు డిస్కౌంట్ ధరలతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్‌, వేరబుల్స్‌, అప్లయెన్సెస్, ల్యాప్‌టాప్స్‌ను కొనుగోలు చేసేవారు HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లించేటప్పుడు 15% వరకు క్యాష్‌బ్యాక్ పొందుతారు. * టీవీలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ది ఫ్రేమ్, QLED, UHD టీవీల వంటి శామ్‌సంగ్ టీవీలపై 48% వరకు డిస్కౌంట్స్ అందుకోవచ్చు. Neo QLED, QLED, The Frame, UHD టీవీల సెలెక్టెడ్ మోడల్‌ల కొనుగోలుపై యూజర్లు రూ.21,490 విలువైన గెలాక్సీ A32 స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా దక్కించుకోవచ్చు. అయితే టాప్ ఎండ్ Neo QLED టీవీల (8K మోడల్స్‌)తో రూ.1,09,999 విలువైన గెలాక్సీ S22 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను ఫ్రీగా గెలుచుకోవచ్చు. * మొబైల్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు NO MO' FOMO సేల్ సమయంలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లపై గరిష్ఠంగా 57% డిస్కౌంట్ పొందొచ్చు. ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ Z సిరీస్, గెలాక్సీ S సిరీస్, గెలాక్సీ A సిరీస్, గెలాక్సీ M, F సిరీస్‌ల ఫోన్లపై ఈ డిస్కౌంట్స్ వర్తిస్తాయి. గెలాక్సీ Z సిరీస్ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసేవారు రూ.5,199 విలువైన Wireless Charger Duoని రూ.499కే సొంతం చేసుకోవచ్చు. సెలెక్టెడ్ గెలాక్సీ S సిరీస్, Galaxy A సిరీస్ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసేవారు వాటి కవర్లపై 50% డిస్కౌంట్ పొందవచ్చు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Samsung, Samsung Galaxy, Smart phones, Smart tvs, Tech news

తదుపరి వార్తలు