టెక్ దిగ్గజం శామ్సంగ్, గెలాక్సీ స్మార్ట్ఫోన్ల (Galaxy Smartphones) కోసం శామ్సంగ్ వాలెట్ (Samsung Wallet) యాప్‌ను గతేడాది పరిచయం చేసింది. అయితే ఇప్పటివరకు ఈ డిజిటల్ పేమెంట్, పాస్వర్డ్ స్టోరేజ్ సర్వీస్ భారత యూజర్లకు అందుబాటులోకి రాలేదు. కాగా కంపెనీ ఎట్టకేలకు తన శామ్సంగ్ వాలెట్ (Samsung Wallet)ను భారత్‌తో సహా మరిన్ని దేశాలకు తీసుకొస్తోంది. ఈ నెలాఖరు నాటికి భారత యూజర్లకు ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. ఈ యాప్ డిజిటల్ సర్వీస్‌లకు ఆల్-ఇన్-వన్ సొల్యూషన్‌గా పనిచేస్తుంది. యూజర్లు దీనిలో ఫిజికల్ వాలెట్ లాగా క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు, లాయల్టీ కార్డ్‌లు, ఐడీలు, బోర్డింగ్ పాస్‌లు, ఇంకా మరెన్నో స్టోర్ చేయవచ్చు.
శామ్సంగ్ పే (Samsung Pay), శామ్సంగ్ పాస్ (Samsung Pass) సేవలను కంబైన్గా అందించే ఈ Samsung Wallet ప్రీమియం శామ్సంగ్ గెలాక్సీ ఫోన్లు, ఎ-సిరీస్ స్మార్ట్ఫోన్ల యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ద్వారా పేమెంట్ కార్డ్‌లు, క్రిప్టో వాలెట్లను సేవ్ చేసుకుని సెక్యూర్, హ్యాక్-ఫ్రీ పేమెంట్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు.
అందుకు శామ్సంగ్ తన ఇంటర్నల్ నాక్స్ ఎన్క్రిప్షన్ (Knox security) ద్వారా ఈ సర్వీస్‌కి కట్టుదిట్టమైన ప్రైవసీని అందిస్తుంది. అయితే శామ్సంగ్ వాలెట్ శామ్సంగ్ డివైజ్‌ల్లో మాత్రమే పని చేస్తుంది. ఇది iOS లేదా ఇతర Android డివైజ్‌ల్లో అందుబాటులో ఉండదు.
ఇది కూడా చదవండి : Google Voice: గూగుల్ వాయిస్ యాప్ నుంచి స్మార్ట్ రిప్లై ఫీచర్ తొలగింపు.. కారణాలు చెప్పని కంపెనీ
శామ్సంగ్ ఈ వాలెట్ సర్వీస్‌ను భారతదేశానికి తీసుకువస్తోంది కానీ దీని ద్వారా ఏ నిర్దిష్ట సేవలను భారత యూజర్లకు అందిస్తుందో ఇప్పటివరకైతే క్లారిటీ ఇవ్వలేదు. సాధారణంగా ఈ వాలెట్ యూజర్లు ఐడీలను స్టోర్ చేయడానికి, రిటైల్ అవుట్లెట్లలో మొబైల్‌ను పేమెంట్ డివైజ్‌గా ఉపయోగించడానికి సహాయపడుతుంది. ఇది సెలెక్టెడ్ కారు బ్రాండ్లకు డిజిటల్ కీగా కూడా పని చేస్తుంది. అయితే ఈ డిజిటల్ కీ ఫీచర్ ప్రస్తుతం దక్షిణ కొరియాలో మాత్రమే అందుబాటులో ఉంది.
* ప్రత్యేకతలు ఇవే..
శామ్సంగ్ వాలెట్లో శామ్సంగ్ పాస్ ఫీచర్లు కంబైన్ అయి ఉంటాయి. దాంతో స్టోర్డ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించి యాప్‌లు, సర్వీస్‌లను సులభంగా యాక్సెస్ చేయడంలో యూజర్లకు ఇది పాస్వర్డ్ మేనేజర్‌లాగా కూడా పనిచేస్తుంది. శామ్సంగ్ వాలెట్ COVID-19 వ్యాక్సినేషన్ కార్డును స్టోర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. శామ్సంగ్ బ్లాక్‌చైన్ వాలెట్ ఇంటిగ్రేషన్‌ని ఉపయోగించి క్రిప్టోకరెన్సీ పెట్టుబడులను మానిటర్ చేసుకోవచ్చు.
చైనా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కొరియా, కువైట్, దక్షిణాఫ్రికా, యూఏఈ, యూకే, యూఎస్ వంటి 20కి పైగా దేశాల్లో ఇప్పటికే శామ్సంగ్ వాలెట్‌ను తీసుకొచ్చిన కంపెనీ ఈ జనవరి నాటికి ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్, ఇండియా, మలేషియా, సింగపూర్, తైవాన్ దేశాల్లో రిలీజ్ చేయనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samsung, Samsung Galaxy, Tech news