హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Samsung Galaxy A04s: ఇండియాలో గెలాక్సీ A04s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఈ బడ్జెట్ శాంసంగ్ ఫోన్ ఫీచర్లు ఇవే..

Samsung Galaxy A04s: ఇండియాలో గెలాక్సీ A04s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఈ బడ్జెట్ శాంసంగ్ ఫోన్ ఫీచర్లు ఇవే..

సామ్ సంగ్ గెలక్సీ

సామ్ సంగ్ గెలక్సీ

Mobiles: అత్యంత విశ్వసనీయమైన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) ఇండియాలో ఎప్పటికప్పుడు సరికొత్త ఫోన్లను లాంచ్‌ చేస్తోంది. తాజాగా గెలాక్సీ A సిరీస్‌లో కొత్తగా గెలాక్సీ ఎ04ఎస్‌ (Samsung Galaxy A04s) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Delhi, India

అత్యంత విశ్వసనీయమైన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) ఇండియాలో ఎప్పటికప్పుడు సరికొత్త ఫోన్లను లాంచ్‌ చేస్తోంది. తాజాగా గెలాక్సీ A సిరీస్‌లో కొత్తగా గెలాక్సీ ఎ04ఎస్‌ (Samsung Galaxy A04s) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను బడ్జెట్ ధరతో ఒకటే స్టోరేజ్ వేరియంట్‌లో కంపెనీ పరిచయం చేసింది. ధర తక్కువే అయినప్పటికీ ఇందులో అందించిన స్క్రీన్ పెద్దదిగానే ఉంది. రిఫ్రెష్ రేట్ కూడా మిడ్-రేంజ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో అందించినట్లు శాంసంగ్ ఈ ఫోన్‌లో ఆఫర్ చేసింది. ఇక బ్యాటరీ, కెమెరాల, ధర తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

* కలర్ ఆప్షన్స్, బ్యాంక్ ఆఫర్స్

సోమవారం నాడు శాంసంగ్ కంపెనీ భారతదేశంలో ఆవిష్కరించిన గెలాక్సీ ఎ04ఎస్‌ ఫోన్ బ్లాక్, కాపర్, గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. దీనిని రిటైల్ స్టోర్లు, Samsung.com వెబ్‌సైట్, ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇంట్రడక్టరీ ప్రైస్‌గా శాంసంగ్ SBI బ్యాంక్, వన్ కార్డ్, స్లైస్ కార్డ్‌లతో చేసిన కొనుగోలపై రూ.1,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది.

* గెలాక్సీ A04s ధర, స్టోరేజ్

గెలాక్సీ A04s ఒకే ఒక 4GB+64GB వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.13,499గా కంపెనీ నిర్ణయించింది. 64GB ఇంటర్నల్ స్టోరేజీని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. RAM ప్లస్‌తో ఇంటర్నల్ ROM మెమరీని ఉపయోగించి 4GB RAMని 8GB RAMకి ఎక్స్‌పాండ్ కూడా చేయవచ్చని పేర్కొంది.

* ప్రాసెసర్, ఓఎస్

గెలాక్సీ A04s Exynos 850 ప్రాసెసర్‌ సాయంతో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 OS, One UI 4.1తో అందుబాటులోకి వచ్చింది. దీనికి భవిష్యత్తులో రెండు మేజర్ ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్ లభిస్తాయని కంపెనీ వెల్లడించింది.

* గెలాక్సీ A04s డిస్‌ప్లే, సౌండ్ క్వాలిటీ

గెలాక్సీ A04s 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల IPS LCD HD+ ఇన్ఫినిటీ-V డిస్‌ప్లేతో వస్తుంది. సాధారణంగా శాంసంగ్ ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో సూపర్ AMOLED డిస్‌ప్లే ఆఫర్ చేస్తుంటుంది. కానీ ఈ కొత్త ఫోన్‌లో మాత్రం IPS LCDని అందించింది. ఏదేమైనా ఈ డిస్‌ప్లే చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి అమెజాన్ , నెట్‌ఫ్లిక్స్‌లో మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. గేమ్ ఆడుతున్నా లేదా ఇష్టమైన వెబ్ సిరీస్‌ని చూస్తున్నా 20:9 యాస్పెక్ట్ రేషియోతో సినిమాటిక్ వ్యూ పొందుతూ మంచి ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చని కంపెనీ తెలిపింది. ఇక వైర్డు, బ్లూటూత్ హెడ్‌సెట్‌లలో డాల్బీ అట్మోస్ సపోర్ట్‌ కూడా లభిస్తుంది కాబట్టి ఇందులో గేమింగ్, వీడియో ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది.

* ఛార్జింగ్, ప్రైవసీ ఫీచర్స్

ఈ న్యూ ఫోన్‌లో సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌, శాంసంగ్ నాక్స్ (Knox) సెక్యూరిటీని ఆఫర్ చేశారు. ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుండగా.. ఇది కేవలం 15W అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. యూజర్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను పొందొచ్చు. ఆప్టిమైజ్డ్‌ బ్యాటరీ లైఫ్ కోసం ఈ మొబైల్ యూజర్ల యూసేజ్ అలవాట్లను గుర్తించి, సర్దుబాటు చేసే AI పవర్ మేనేజ్‌మెంట్‌తో కూడా వస్తుంది.

* కెమెరాలు

గెలాక్సీ A04s 50MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చే ఇందులో 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో కెమెరా ఉంటాయి. ఇక సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఆఫర్ చేశారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Mobiles, Samsung

ఉత్తమ కథలు