స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సాంసంగ్ మరో సంచలనం సృష్టిస్తోంది. తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అందించనుంది. సాంసంగ్ గెలాక్సీ ఏ42 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది కంపెనీ. ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలను మాత్రమే ప్రకటించింది కంపెనీ. చీపెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌గా చెబుతోంది. ఇప్పటికే ఉన్న సాంసంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్ కన్నా ధర తక్కువ ఉంటుందని అంచనా. ఇప్పటికే సాంసంగ్ గెలాక్సీ ఏ51 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఈ ఫోన్ ధర సుమారు రూ.36,000 ఉంటుంది. గెలాక్సీ ఏ51 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఏ42 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంతకన్నా తక్కువ ఫీచర్స్ ఉంటాయని అంచనా. సాంసంగ్ గెలాక్సీ ఏ51 5జీ కన్నా సాంసంగ్ గెలాక్సీ ఏ42 5జీ ధర అంతకన్నా తక్కువే ఉంటుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సూపర్ అమొలెడ్ డిస్ప్లే, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందో, ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియాల్సి ఉంది.
UPI Payment: గూగుల్ పే, ఫోన్‌పే పేమెంట్స్ చేసినవారికి గుడ్ న్యూస్
సాంసంగ్ గెలాక్సీ ఏ42 5జీ స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: 6.6 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్ప్లే
ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 690
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లాక్
ధర: రూ.35,000 లోపు
ఇక ఇప్పటికే ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.24,999. హైఎండ్ వేరియంట్ ధర రూ.29,999. అంటే రూ.25,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది వన్‌ప్లస్. మరి సాంసంగ్ గెలాక్సీ ఏ42 5జీ ధర ఇండియాలో ఎంత ఉంటుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G, Android 10, Samsung, Smartphone