మీరు సాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? అయితే మీకు శుభవార్త. సాంసంగ్ 2015 లో సాంసంగ్ టీవీ ప్లస్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 1.5 కోట్ల యాక్టీవ్ యూజర్స్ ఉన్నారు. 2016 నుంచి సాంసంగ్ స్మార్ట్ టీవీల్లో సాంసంగ్ టీవీ ప్లస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లభిస్తోంది. ఈ సర్వీస్‌ను లేటెస్ట్‌గా ఇండియాలో లాంఛ్ చేసింది సాంసంగ్. అన్ని సాంసంగ్ స్మార్ట్ టీవీల్లో సాంసంగ్ టీవీ ప్లస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పటికే సాంసంగ్ స్మార్ట్ టీవీలు కొన్నవారితో పాటు కొత్తగా కొనేవారికి కూడా సాంసంగ్ టీవీ ప్లస్ ఉచితంగా లభిస్తుంది. ఇందులో ఆన్ డిమాండ్ వీడియోస్, యాడ్ సపోర్టెట్ లైవ్ ఛానెల్స్ ఉంటాయి. ఎలాంటి సెట్ టాప్ బాక్స్ అవసరం లేదు. కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఇప్పుడు సాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు సాంసంగ్ టీవీ ప్లస్ ఓటీటీ సర్వీస్‌ను ఉచితంగా అందిస్తోంది కంపెనీ.
POCO X3: పోకో ఎక్స్3 ధర తగ్గింది... కొత్త రేటు ఎంతంటే
WhatsApp: వాట్సప్‌లో ఈ సెట్టింగ్ చాలా ముఖ్యం... వెంటనే మార్చేయండి
సాంసంగ్ టీవీ ప్లస్ కరోనా వైరస్ మహమ్మారి సమయంలో కస్టమర్లకు చాలా ఉపయోగకరంగా ఉందని కంపెనీ చెబుతోంది. గత ఏడాదిగా ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్న వినియోగదారులు తమ టీవీలు, స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్, ఇన్ఫర్మేషన్ ఎక్కువగా పొందేందుకు ఆసక్తి చూపించారని కంపెనీ వెల్లడించింది. అందుకే ఇండియాకు సాంసంగ్ టీవీ ప్లస్‌ను పరిచయం చేస్తున్నామని వివరించింది. అయితే ప్రస్తుతం ఇండియాలో ఏఏ ఛానెళ్లను సాంసంగ్ టీవీ ప్లస్ అందిస్తుందన్న విషయం ఇంకా తెలియదు. అమెరికాలో మాత్రం 300 బ్రాడ్‌క్యాస్ట్ నెట్వర్క్స్‌తో సాంసంగ్ ఒప్పందం కుదుర్చుకుంది.
Poco X3 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో ఎక్స్3 ప్రో వచ్చేసింది... ధర ఎంతంటే
Poco M3: నిమిషానికి 8 ఫోన్లు అమ్మిన పోకో ఇండియా... ఈ ఫోన్ ఎందుకంత స్పెషల్?
ఇక సాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్ ఉపయోగిస్తున్న వారికి ఈ నెలాఖరులోగా సాంసంగ్ టీవీ ప్లస్ యాక్సెస్ లభిస్తుంది. సాంసంగ్ గెలాక్సీ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి సాంసంగ్ టీవీ ప్లస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఏఏ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లకు సాంసంగ్ టీవీ ప్లస్ యాక్సెస్ లభిస్తుందో తెలియాల్సి ఉంది. అయితే చాలావరకు గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లలో సాంసంగ్ టీవీ ప్లస్ యాక్సెస్ చేయొచ్చని తెలుస్తోంది. ఇక సాంసంగ్ టీవీ ప్లస్ సర్వీస్ భారతదేశంతో పాటు అమెరికా, కెనెడా, కొరియా, స్విట్జర్‌ల్యాండ్, జర్మనీ, ఆస్ట్రియా, యూకే, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, మెక్సికో దేశాల్లో అందుబాటులో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Ott, Samsung, Smartphone, Smartphones